Saturday, June 18, 2005

యుగాంతం యండమూరి వీరేంద్రనాథ్

యండమూరి వీరేంద్రనాథ్

యుగాంతం
నవసాహితి బుక్ హౌస్
ఏలూరు రోడ్ , విజయవాడ ౫౨౦౦౦౨

సమయం ౮:౩౧ ఉదయం

యుగాంతం

అనంతాకాశమైన విశ్వంలో కొన్ని వేల సంవత్సరాల్నుంచీ నిర్విరామంగా ఒకే కక్ష్యలో పరిభ్రమిస్తున్న కోటానుకోట్ల గోళాల మధ్య ఒక చిన్న కదలిక క్షణంలో వెయ్యోవంతు సేపు ఏర్పడి మామూలుగా సర్దుకుంది. సూక్ష్మాతి సూక్ష్మమైన కదలికని ప్రపంచంలోని ఏ విజ్ఞాన పరికరమూ పట్టుకొనలేకపోయింది.

భూమి మామూలుగానే తిరుగుతోంది. సూర్యుడి ఉదయాస్తమయాలు మామూలుగానే జరుగుతున్నాయి. అయితే భూమికి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఒక నక్షత్రం - ప్రాక్సిమా సెంక్చువరీ అని పిలువబడేది. వెంట్రుకవాసిలో తన కక్ష్య నుంచి బయటపడి అమితమైన వేగంతో జారిపోసాగినది.

అది ఎప్రిల్ పదమూడు, గ్రీనివిచ్ కాలమానం ప్రకారం ౧౪-౩౦ నిమిషాలు. అప్పుడు సగం ప్రపంచం గాడ నిద్రలో వుంది.

శైలజ, రమణ, జానకి, రాజయ్య, మెక్ డోనాల్డు, జగదీష్ చంద్ర అందరూ కలిస్తే ప్రపంచం.

సమస్యలు, సాంఘికం, మానసికం, రాజకీయం, నైతికం అన్నీ కలిస్తే ప్రపంచం.ఇండియన్ టైమ్స్ ప్రకారం పత్రికా కార్యాలయం రెండో అంతస్థు కుడివైపు హాల్లో బల్లమీదున్న ఓ చిన్న కాగితం ముక్కని భూతద్దంలో పరిశీలిస్తున్నది శైలజ.

"ఏమిటది అంత పరీక్షగా చూస్తున్నావ్?" అన్నది టైపిస్టు రాణి దగ్గర కొస్తూ.

"ఏదో చెత్త కాగితం. ఏమి వ్రాసివుందా అని చూస్తున్నాను."

"సబెడిటర్ లక్షణం పోనిచ్చావు కాదు. ప్రతిదాన్ని శోధించనిదే మనసు నిలవదా ఏం?"

శైలజ నవ్వింది. "మనం ఇంకా నయం. అమెరికాలో జర్నలిస్టులైతే..."

"చాల్చాలు.... " అంటూ రాణి టేబుల్ మీద కాగితం తీసుకొంది.

ఏదో పురాతన కాలపు పుస్తకంలోంచి వూడిపోయిన ముక్క అది. ఎండకి ఎండి, వానకి నాని చివికిపోయింది. శిథిలావస్థలో వుంది.

"ఎక్కడ దొరికిందిది?"

"మా ఇంటి పెరట్లో. "

రాణి నవ్వింది. "పెరటిలో దొరికిన కాగితాలన్నీ ఇక్కడికి తీసుకొచ్చి శోధించటం కోసమేనా నీకు జీత మిస్తున్నది?"
"ఏ పుట్టలో ఏ కాగితం వుందో ఎవరికి తెలుసు?"
"సర్లే పద. టీకి టైమవుతూంది."

ఇద్దరూ క్యాంటీన్ వైపు నడుస్తూంటే శైలజ అన్నది - "మా ఇంటి పెరటికి అవతలివేపు గోరీలున్నాయి. అక్కణ్నుంచి గాలికి ఎగిరి వచ్చుంటుంది. "

ఏ పుస్తకంలోదో చిరిగి వుంటుంది. దానికంత ప్రాముఖ్యత ఇవ్వటం అనవసరం."

శైలజ మాట్లాడలేదు.

ఇద్దరూ కాంటీన్ లో ఓ మూల కూర్చున్నారు. కుర్రాడు టీ తీసుకొచ్చి ముందు పెట్టేడు.

రాణి ముందుకు వంగుతూ "ఎంత బావుందో!" అన్నది.

"ఏమిటి?"

"అలా ముందుకి వంగొని కూర్చొంటే నీ కడుపుమీద ముడత."

శైలజ చప్పున సర్దుకొని కూర్చుంటూ, "ఇడియట్" అంది.

రాణి నవ్వింది. "నేనన్నదాంట్లో తప్పేముందు?"
తప్పులేదు. శైలజ పక్కనుంచి వెళ్ళే పదిమందిలో తొమ్మిదిమంది ఆమెవైపు చూస్తారు తిరిగి.

"నీ వయస్సెంత?" రాణి అడిగింది.

"ఇరవై ఆరు."

"మై గాడ్!" అంది రాణి. "ఇరవై ఆరేళ్ళ జీవితాన్ని డ్రైగా గడిపేవా?"

"డ్రై ....అంటే?"
"వెట్ కానిది."

కొంచెం నిశబ్దం. మళ్ళీ రాణీయే టీ కప్పు తీసుకుని తాగుతూ అన్నది. "వేడి వేడి కప్పులో టీ లాటిది యవ్వనం."

"అవును. మూడు గుక్కలేస్తే అయిపోతుంది."

"వెయ్యకపోతే చల్లారిపోతుంది."

ఈ మాటలకి శైలజ నవ్వింది. రెండు చేతుల్లోకి కప్పు తీసుకుంది. "నా జీవితాన్ని ఇలా దోసిలిలో వుంచి అర్పిద్దామని ఎదురు చూస్తున్నాను. ఈ నా మనసు, ఈ శరీరం ఒకరికే. ఆ ఒకరూ ఎవరో నాకు తెలీదు. ఇదొక "వే ఆఫ్ లైఫ్". నువ్వన్నట్టూ జీవితాన్ని ఇంకోరకంగా కూడా అనుభవించవచ్చు. అది పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇక్కడ ప్రశ్న ఏరకం జీవితాన్ని కొనసాగించాలా అని. నేను మొదటి రకాన్నే ఇష్టపడతాను."

"ట్రాష్ " అంది రాణి. "ఇవన్ని సెంటిమెంట్లు. నీ తండ్రి నీకు సంబంధాలు చూడడు. నీ తమ్ముళ్ళు రెక్కలొచ్చేవరకూ నిన్ను ప్రేమగా చూసి ఆ తర్వాత ఎగిరిపోతారు. అప్పటికి నీకు నలభై ఏళ్ళొస్తాయి"

ఒక్క క్షణం నిశబ్దం.

శైలజ ఖాళీకప్పు కిందపెట్టి, చిన్న స్వరంతో "ఇవన్నీ నేను ఆలోచించలేదంటావా?"

ఆలోచిస్తే ఇలా నిస్సారంగా గడపవు" అన్నది రాణి. "దూరంగా చిన్న వెలుగు రేఖ కూడా కనిపించని చీకటే భవిష్యత్తయితే, దొరికిన మినుగురుల్తో ఆడుకోవటమే మంచి పద్దతి. "మీ ఇంట్లో చిదిమి దీపం పెట్టుకోడిరా" అని ఓ అపరంజి బొమ్మని పల్లకీలో పంపితే, వాళ్ళు సంతృప్తి చెందరు. పక్కన నోట్లకట్ట వుందా, లేదా అని చూస్తారు.

నీ శరీరాన్ని నువ్వెంత పవిత్రంగా వుంచూ- నీ మనసెంత పవిత్రంగానైనా వుండనీ - పెళ్ళి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ డబ్బే ప్రధానపాత్ర వహిస్తుంది. అలాంటప్పుడు అటువంటి మొగవాడికోసం ఎందుకు శరీరాన్ని పవిత్రంగా వుంచడం? ఎంజాయ్!

ఆమెవైపు కన్నార్పకుండా చూసింది శైలజ.

అంతర్లీనంగా డబ్బు, మనిషి నైతిక విలువలమీద ఎంత ప్రభావం చూపిస్తుంది!

ఈ కొత్త థియరీ చాలా చేదు నిజం. కానీ జీర్ణం చేసుకోవాలి.

పొరలు పొరలుగా విడదీసి చూస్తే ముగ్దంగా వుండాల్సిన స్త్రీని రాటుతేలేటట్టు చేసింది వ్యవస్థేనేమో అనిపిస్తుంది.

"ఏమిటి ఆలోచిస్తున్నావ్?"

"వ్యవస్థ మారాలంటే ఏం చెయ్యాలి?"

రాణి నవ్వింది. "ప్రళయం రావాలి."

శైలజ నవ్వలేదు. "ఈ వ్యవస్థ మారటంకోసం ప్రళయమే రావాల్సివ్స్తే, ఆ ప్రళయాన్ని ఈ క్షణమే ఆహ్వానిస్తున్నానేను. ప్రళయం రావాలి. ఆ ప్రళయం ఝుంఝూమారుతంలో.....ప్రక్షాళనమైన మనస్సుతో, ప్రక్షాళనమైన వ్యవస్థతో మనిషి కొత్త జీవితం ప్రారంభించాలి."

శైలజ తన ఆవేశానికి తానే సిగ్గుపడి, "సారీ, పద పోదాం" అంది.

ఇద్దరు పైకి శైలజ సీటు దగ్గరకి వచ్చేరు. రాణి కుర్చీ వెనక్కి జారబడి, "ఏమిటి ఫైలు?" అని అడిగింది ఫైలు విప్పుతూ.

"ఇంటర్వ్యూ అప్లికేషన్లు. రేపు ఇంటర్వ్యూ వుందిగా."

"కొత్త కుర్రాళ్ళూ వస్తారన్నమాట" ఒక్కో అప్లికేషనూ, దాని కుడివైపు మూలనున్న ఫోటో చూస్తూ తిప్పసాగింది రాణి.

అలా చూస్తున్నదల్లా ఒకచోట ఆగి "హాయ్!" అంది. "ఈ అబ్బాయి చూడు ఎంత బావున్నాడో?"

శైలజ అటు చూడలేదు. "అయితే ఏమిటిట" అన్నది.

"సర్లే సర్లే. తెలియక అన్నానా మాట" నవ్వింది. మళ్ళీ ఫోటోవైపు చూస్తూ, "అయినా ఇంతందంగా వున్నాడూ అంటే ఈ పాటికే ఎవర్తోనో ప్రేమలో పడే వుంటాడు" అంది.

"లంచ్ టమ్ అయిపొయినట్టుంది?" శైలజ గుర్తు చేసింది.

రాణి నవ్వి, లేస్తూ, "సర్లే సాయంత్రం కలుస్తాను" అని వెళ్ళిపోయించి.

ఆమె వెళ్ళేక శైలజ అప్లికేషన్ ఫైల్లో తిరిగి ఫోటోవైపు చూసింది. రాణి అన్నట్టు అతడు చాలా అందంగా వున్నాడు. అమాయకంగా, తన కన్నా చిన్నగా.

పేరు చూసింది.
రమణ.
బి.ఏ. యూనివర్శిటీ ఫస్ట్.
ఫైల్లో అప్లికేషన్ పెట్టేసి, దాని డ్రాయర్ లోకి తోసేసి, పనిలో మునిగిపోయింది.

* * ***********************************************

సాయంత్రం అయిదింటివరకూ అమెకి ఊపిరి సలపని పని తగిలింది. మేటర్ కంపోజింగ్ కి యివ్వటం, కంపోజ్ అయివచ్చిన మేటర్ ప్రూపులు దిద్దటం, అడ్వర్టయిజ్మెంట్ బ్లాకులకు ఫోన్ చెయ్యటం లాటివి. 'పగవాడికైనా సబ్ ఎడితర్ పని వద్దురా బాబూ!' అంటూ ఆమె వళ్ళు విరుచుకుంటుంటే రాణి వచ్చింది.

"పోదామా?"

"ఇదిగో అయిపోయింది."

మరో అయిదు నిమిషాల్లో ఆమె టేబుల్ సర్దివేసింది.

ఇద్దరూ బయటకొస్తూంటే రాణి అడిగింది.

"ఆ కాగితంలో ఏం వుందో కనుక్కొన్నావా!"

"ఏ కాగితం?"

"అదే! గోరీల మధ్య దొరికిందన్నావే - అది."

"ఉహూ ....ఎక్కడా తీరిక దొరకందే!"

వాళ్ళిద్దరూ కారిడర్లో నడుస్తూంటే ఎదురుగా అటెండర్ వస్తూ కనిపించేడు. వాడి పేరు ఇస్మాయిల్.

రాణి అతణ్ణి ఆపి, "ఇదిగో, ఈ కాగితంలో ఏం వ్రాసి వుందో చెప్దూ" అంది.

అతడు కాగితం అందుకొన్నాడు. చదువుతూంటే అతడి మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనపడింది.
"ఏముందందులో?" నిశబ్దాన్ని భరించలేక అడిగింది.

అతడు మాట్లాడలేదు.

"ఏమిటది ....? ఉర్దూనా?"

అతడు కాగితంవైపు మళ్ళీ చూసేడు.


"కాదు ....అరబ్బీ!

"నీ కొచ్చా?"
"వచ్చు."

అతడు చదివేడు, "యోమాయూన్ ఫిక్క్ ఫిసూరి పతుతూనా ఆఫ్ వాజా!"

"అంటే....?" ఇద్దరూ ఒకేసారి అడిగేరు.

అతడు తల పైకెట్టాడు. అతడి కళ్ళు నిస్తేజంగా ఉన్నాయి. మొహం భావరహితంగా వుంది. అనాసక్త కంఠంతో అతనన్నాడు.

"......ఈరోజు శంఖం వూదబడుతుంది. ఆకాశం తెరవబడుతుంది. అప్పుడు శవాలన్నీ గుంపులు గుంపులుగా లేచి వస్తాయి."

అతనా మాటలంటూ వుంటే దూరంగా ఎక్కడో ఉరిమింది. ఆ రాత్రి కురవబోయే కుంభవృష్టికి సూచనగా మేఘాలు అలుముకుంటున్నాయి.


నాంది:

మినుకు మినుకుమని వెలుగుతూన్న ద్వీపాన్ని టప్పున ఆర్పి చీకటి మరింత చేతనత్వాన్ని పొందింది. మనిషి మనసులో పాపంలాంటి చీకటి: మనోసముద్రపు నిబంధనల చెలియలికట్టని కొద్ది తొలగిస్తే వెల్లువలా బయటకు దూకే పాపం.

తలుపు సందుల్లోంచి బలంగా వీస్తున్న ఈదురుగాలి శబ్దం శరీరాన్ని గగుర్పొడుస్తూంది.

మనిషిని అనుక్షణమూ బ్రతికిస్తున్న గాలి కొద్దిగా చెలరేగితే మనిషి గడ్డిపోచలా ఎగరాలి.

బాబు జానకి ఒళ్ళో మరింత మునగదీసి పడుకున్నాడు. గదిలో దీపం ఆరిపోయినా ఆమె కదల్లేదు. మినుకు మినుకు వెలుగుకన్నా చీకటే బావుంది. ప్రక్కగదిలో మరిది ఇంకా చదువుతూనే వున్నాడు. రేపు ఇంకో ఇంటర్వ్యూ. ప్రకాశరావు ఇంకా రాలేదు. మామగారు దగ్గు వినిపిస్తూ వుంది అప్పుడప్పుడూ. దూరంగా గడియారం ఒంటిగంట కొట్టింది.

గదిలో రమణ పుస్తకంలోకి చూస్తూ మాలతి గురించి ఆలోచిస్తున్నాడు . మరుసటిరోజు ఇంటర్వ్యూ. అయినా ఆలోచనలు మాలతి చుట్టూనే.

...... జానకి బాబుని ఒళ్ళోంచి లేపి, మంచంమీద పడుకోబెట్టింది. కిటికీ తలుపు తెరచి చూడబోతే ఫెడేలున వర్షపుజల్లు మొహంమీదకు కొట్టింది. చప్పున తలుపు మూసింది. గడియ విరిగిపోతుందేమో నన్నంత బలంగా గాలి వీస్తుంది.

శివుడి జటాజూటం నుంచి దభిల్లున జారిన గంగానది. ఏనుగు తొండాల్తో పోసినట్తు కుంభవృష్టి.

తలుపు దబదబా బాదిన చప్పుడు. వెళ్ళి తలుపు తీసింది. ప్రకాశరావు. ముద్దగా తడిసిపోయాడు. చలికి వణికిపోతున్నాడు. గాలితోపాటు లోపలికొచ్చేడు. తలుపు బలంగా వేసింది. "ఇక్కడ జల్లు పడుతోంది" అని ముసలాయన గొణుగుతున్నాడు. ఆయన్ని లేవమని చెప్పి మంచం మరిది గదిలో వేసింది. ముసలాయనకి లైటుంటే నిద్రపట్టదు. రమణ లైట్ ఆర్పేసేడు. చీకట్లో వెల్లకిలా పడుకొని కళ్ళు మూసుకున్నాడు. మాలతి.

మాలతి.... మాలతి.

ప్రకాశరావు తల తుడుచుకొని బట్టలు మార్చుకొంటుంటే జానకి వంటింట్లోకి వెళ్ళి అన్నం, నీళ్ళూ పెట్టింది. అతడు రెండు మెతుకులు తిని లేచిపోయాడు. జానకి అన్నీ చూస్తూంది. మాట్లాడలేదు. ప్రెళ్ళయి ఎనిమిదేళ్ళయింది. మాట్లాడటానికేమీ లేదు. కంచం తీసింది.

ప్రకాశరావు గదిలోకి వచ్చేడు. బాబుని క్షణం చూసి పక్కనే పడుకున్నాడు. లోపల వంటగదిలో సామాను సర్ది జానకి కూడా వచ్చింది. మంచం పక్కనె చాప వేసుకొని పడుకొంది. తల దగ్గరే వున్న మాసిన బట్టల పెట్టెలోంచి తదిసిన బట్టల వాసన.

కుడిచేతి పక్కకి వత్తిగిల్లుతూ 'ప్రళయం వచ్చేటట్టు వుంది పాడు వర్హం' అనుకొన్నది జానకి. తథాస్తన్నట్టు మిన్ను వెన్నుమీద మెరుపు మెరిసింది.

****

****

విరిగి పడటానికి సిద్దంగా వున్న పాత చూరుకింద రాజయ్య పడుతున్న వర్షాన్ని చూస్తున్నదు. అతడి ఒహమ్మీద ముడతలు అతడి గత జీవితపు కష్టాల్లా లెక్కపెట్టలేనంతగా వున్నాయి. ఆనందాన్నీ, విషాదాన్నీ ఒకేలా ప్రదర్శించటానికి అలవాటుపడ్డ గాజుకళ్ళు వర్షాన్ని నిర్లిప్తంగా చూస్తున్నాయి.

రాజయ్య ఎకనమిక్స్ చదువుకోలేదు. ఎనిమిదో క్లాసుకూడా చదువుకోలేదు. అయినా భూషణం చెప్పిన లెక్క సరిగ్గానే వున్నట్లు తోచింది. ఆ లెక్క అర్థమయ్యేటట్టు చెప్పటానికి భూషణమూ, పెదకామందూ చాలా కష్టపడవలసి వచ్చింది. మరి ఎనిమిదో క్లాసువరకూ అయినా చదూకోని రాజయ్యకి, వ్యవస్థ చాలా కట్తుదిట్టంగా నిర్మించిన అర్థశాస్త్రాన్ని బోధించటం అంటే సామాన్యం కాదు. అయినా వాళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు. చేతివేళ్ళు ఉపయోగించి లెక్కలు కట్టడం నేర్పారు. ఎలాగైతేనేం ఓ చిన్న లెక్కని అతని బుర్రలోకి ఎక్కించారు. అది బాగా అర్థమయినా కాకపోయినా ఒక విషయం మాత్రం అతడికి బాగా అర్థమైంది. ఇంకో నెలలో తన పాకా, పొలమూ ఖాలీచేసి అతడు భూషణానికి అర్పించాలి.

పాక సంగతి సరే. దాంట్లో వున్నా, బయట వర్షంలో వున్నా ఒక్కటే. అయితే తాతముత్తాతల పొలం అది. దాన్ని వదులుకోవాలంటే బాధ. రాజయ్యవాళ్ళ తాత రాజయ్య కిచ్చిన అరెకరాన్నీ భూషయ్యవాళ్ళ తాత భూషయ్యకిచ్చిన వందెకరాల్తోనూ కలపకుండా ఎవరాపగలరు?

ప్రవాహంలా కదుల్తూన్న వాన నీటిలోకి తుపుక్కున ఉమ్మేసి, "ఎదరలోకం! ఎదవలోకమంట. థూ, భూకంపం వచ్చి కూలిపోకూడదూ" అన్నాడు చుట్టకోసం తడుముకుంటూ.

*****

*****

లాస్ ఏంజెల్స్, వెస్ట్రన్ కాలిఫోర్నియా, హోటల్ షెర్టాన్ నాలుగో అంతస్థులో అయిదువందల ఇరవై రెండో నెంబరు గదిలో రాత్రి ఒంటిగంటా నలబై అయిదు నిమిషాలకి ఫోన్ ఎడతెరిపి లేకుండా మోగసాగింది. ఫస్ట్ సెక్రటరీ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ - జేమ్స్ డొనాల్డ్ కొద్దిగా కదిలి, రజాయి కిందనుంచి చెయ్యి బయటికి పెట్టి రెసీవర్ అందుకొని "హలో!" అన్నాడు విసుగ్గా.

రూమ్ టెంపరేచర్ కృత్రిమంగా కంట్రోలు చెయ్యబడినా, గాజు అద్దాల్లోంచి, బయటి మంచు వెనులో చలి పుట్టిస్తూంది.

రిసీవర్ని చూపుడు వేలితో టాప్ చేసి "హలో" అన్నాడు మళ్ళీ. హోటల్ ఆపరేటర్ లైనులోకివచ్చి, "ఎక్స్యూజ్ మీ సర్" అంది. "కాల్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో."

రజాయి కింద మెక్ కొద్దిగా కదిలేడు.

నలబై అయిదేళ్ళ వయసు, తెల్లబడుతూన్న జుట్టు, ఆరడుగుల రెండంగుళాలు ఎత్తు. యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ పట్ల అప్పరమయిన గౌరవం, ఒక భార్యా, ఇద్దరు పిల్లలు.

"హలో"

అవతలిపక్క లైనులోకి ఎవరో వచ్చిన ధ్వని "హలో మెక్!"
"ఎవరూ?"
"రోజర్స్ ...విలియమ్ రోజర్స్."

మెక్ చేతిలో రిసీవర్ బిగుసుకుంది. పక్కమీద చప్పున లేచి కూర్చొని, "సర్!" అన్నాడు.

"నువ్వు వెంటనే బయల్దేరు."
"సర్!"
"వాషింగ్టన్ కాదు..... ఫ్రిస్కో."

నిన్న సాయంత్రం న్యూయార్క్ నుంచి తనతో మాట్లాడాడే! అట్లాంటిక్ సముద్రంనుంచి పసిఫిక్ వైపు ఇంత అర్జంటుగా ఈయనెందుకు వచ్చేడు?

"ఇంకో గంటలో నువ్విక్కడ వుండాలి. ఈ లోపులో మనక్కావలసిన పూర్తి సమాచారం వస్తుంది."

ఏ సమాచారం అని అడగలేదు. "వస్తున్నాను" అని ఫోన్ పెట్టేశాడు.

మంచంమీద నుంచి దిగి, గబగబా పది బిస్కీలు తీసి, సింక్ లో మొహం కడుక్కొని బాటిల్ చివర్లో వున్న నాల్గు చుక్కలూ కొట్టేసి, సూట్‌కేస్ సర్దుకొని అయిదు నిమిషాల్లో మెట్లు దిగేడు.

"ఇంత అర్థరాత్రి వెళ్ళిపోతున్నారేం?" రిసెప్షనిస్టు పలకరించింది. ఇరవై యేళ్ళ యవ్వనాన్ని ముద్దచేసినట్టుంది రెండ్రోజుల క్రితం పరిచయం.

మెక్ నవ్వి, "ఫోనొచ్చింది" అన్నాడు.

మెక్ నవ్వితే గ్రేగరీ పెక్ లానూ వుంటాడు, నవ్వకపోతే చార్లెస్ బ్రాన్సన్లానూ వుంటాడు. రాత్రి రెండు. నిర్మానుష్యమైన వరండా.

"ఎవరు? భార్యా?"
తల అడ్డంగా వూపి "కాదు" అన్నాడు.
"బైట బాగా మంచు కురుస్తోంది, కారు నడవదు."
"ఎకాగో సర్దుకొంటాను."
"దార్లో మాటిమాటికీ కాప్స్ (పోలీసులు) ఆపుతారు."
"గుర్తింపు కార్డు వుంది."
"పీటర్స్ స్ట్రీట్ లో రెండు తర్వాత వెళ్ళనివ్వరు."
"చుట్టూ తిరిగి నార్త్ స్క్వేర్ మీంచి వెళతాను" ఆగి అన్నాడు....
"ఎలాగూ రూమ్ ఖాలీ చేసేశాను."

"రూమే సమస్య అయితే ఇంకో గంటలో నేను రిలీవ్ అయిపోతున్నాను. షెర్టాన్ హోటల్, రిసెప్షనిష్టులకి మంచి కాటేజీలిస్తుంది మిష్టర్ మెక్."

"మెక్ ఆమెవైపు చూశాడు. బాల్డ్ గ్రే హెయిర్, నీలి కళ్ళు పగడాల్లాంటి పెదవులు."

నవ్వి, "ఉండేవాణ్ణే, కాని పిల్చింది, విలియం రోజర్స్" అని, సూట్ కేసు పట్టుకోని చీకటిలో కలిసిపోయాడు.

ఆమె అంటే చూస్తూ నిలబడింది. నెమ్మదిగా ఆమె పెదవులమీద చిరునవ్వు వెలిసింది. "విలియం రోజర్స్" అట. నలబై సంవత్సరాల క్రిత చాలామంది తల్లిదండ్రులు కొడుకులకి ఆ పేరే పెట్టుకున్నారు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాది కూడా ఆ పేరే.

****

****

మెక్ కాంటెస్సా ఎయిర్‌పోర్టు వైపు దూసుకుపోతున్న సమయాన డిల్లీ ఇంద్రప్రస్థమార్గ్ పధ్నాలుగో నెంబరు ఇంటిలో జగదీష్‌చంద్ర తన టేబుల్ ముందున్న కాగితాల మధ్య మోచేతులాన్చి, చేతుల మధ్య తల పెట్టుకోని నిస్త్రాణంగా కళ్ళు మూసుకున్నాడు. అలసటతో అతని కళ్ళు మూతలు పడసాగాయి. కానీ ఆ రాత్రి ఆ విషయాన్ని తేల్చేయాలి. మరుసటిరోజు పార్లమెంటులో మంత్రివర్గాన్ని ప్రకటించాలి.

అతి కష్టంమీద అతడి పార్టీ మెజారిటీ సంపాదించ గలిగింది. కానీ ఈ మంత్రుల్ని ఎన్నుకోవటంలో ఏమాత్రం పొరపాటు చేసినా తన పార్టీ అధికారం నుంచి టప్పున పేకముక్కలా పడిపోవటం ఖాయం. అందర్నీ సంతృప్తి పరచటం ఎలా?

జగదీస్ చంద్ర చిన్నతనం నుంచీ కొన్ని కొన్ని సిద్దాంతాల మధ్య పెరిగినవాడు. తన జీవితాన్ని దేశం కోసం అర్పితం చేసినవాడు. అందుకే నలభయి రెండేళ్ళ వయసులోనే ప్రధానమంత్రి కాగలిగేడు.

దేశాన్ని ఎదుర్కొంటున్న సమస్యలు ఇన్ని వుండగా ప్రతిపార్టీ రాజకీయాలకి ఇంత ప్రాముఖ్యత ఎందుకిస్తుందో అతడికి అర్థంకాలేదు. ఏ మమ్చిపని చేయబోయినా దాంట్లో తప్పులు పట్టడానికి సిద్దంగా ఉంటుంది ప్రతిపక్షం. దేశం గురించి ఆలోచించట్ంకన్నా వీళ్ళ గురించి ఆలోచించటానికే తన సమయం సరిపోఅటంలేదు.

ఎలా?-

ఉత్తరప్రదేశ్ కి చెందిన వాడికి ఉపప్రధాని పదవి ఇవ్వాలి. తన పార్టీతో చేతులు కలిపిన లేబర్ పార్టీ ముగురు మంత్రుల్ని రికమెండ్ చేసింది. ఉత్తరభారతానికి, దక్షిణానికి మధ్య సంబంధాలు అసలు బాగాలేవు. ఈసారి మెజారిటీ వాళ్ళకే ఇవ్వాలి. ఇద్దరు ముస్లిం మంరులూ, ఒక సిక్కు ప్రతినిషి.

తల విదిలించాడు.

రాజ్యాంగాన్ని మార్చి ఎన్నికల్ని రద్దు చేస్తే తప్ప దేశం బాగు పడదు. ఊహూ తను అలా ఆలోచించకూడదు. భారతదేశౌ ప్రధాని అలా ఆలోచిస్తున్నాడని తెలిస్తే దేశంలో....
ఫోన్ మ్రోగింది.
పార్టీ అధ్యక్షుడు అవినాష్!
"ఏమన్నా తేలిందా?"
"ఊహూ ఓ పన్నెండు పేర్లు ఫైనలైజ్ చేసేను."
"అందులో పది, సాయంత్రమే అనుకున్నాంగా."
జగదీష్ మాట్లాడలేదు.
".... నేను మెలకువగా వుంటాను. చెప్పు, ఎంత సేపయినా సరే----"
"ఎవరెవరున్నారు మీ గదిలో----"
అవతలివైపు నవ్విన ధ్వని. "అందరూ ... మొత్తం దేశం అంతా."
ఫోన్ పెట్టేశాడు.

గడియారం రెండు కొట్టింది.

కిటికీ దగ్గర కొచ్చి బయటకు చూడసాగేడు. మబ్బులు విడిపోయి, వెన్నెల పడుతూంది. విశాలమయిన కాంపౌండు. సగం వరకూ పూల మొక్కలు, అక్కడక్కడ పెద్ద బండరాళ్ళు. జుట్టు విరబోసుకున్న దెయ్యంలా దూరంగా పెద్ద చెట్టు. ఏదో ఒకటి తేల్చెయ్యాలి. కానీ అందరినీ సంతృప్తి పరచాలి, లేకపోతే పార్టీలో వుంటూనే గోతులు తీస్తారు. సమ్మెలు, లూటీలు, పోలీసు కాల్పులు, పార్లమెంటులో ప్రశ్నలు, సైనయం.....

తన చేతకానితనాన్ని చాలా జాగ్రత్తగా నిరూపిస్తారు.

చీకట్లోకి చూస్తూ తనని తనే ప్రశ్న వేసుకొన్నాడు జగదీష్ చంద్ర. అతడికి నవ్వొచ్చింది. విశ్వంతో పోలిస్తే... యాభై అడుగుల పొడవూ, నలభై అడుగుల వెడల్పూ వున్న తెల్లకాగితం మీద సూదిని ఇంకులో ముంచి చుక్క పెడితే ----------- కనపడే సూక్ష్మ బిందువులాంటి భూమి దానిమీద పీలికలాంటి మనిషి.

.... కిటికీ వూచల్ని పట్టుకొని బయటికి చూస్తున్న చంద్ర ఉలిక్కి పడ్డాడు. చూస్తున్నది నిజమో, కలో అర్థంకాలేదు. గొంతులోంచి రాబోయిన కేకని బలవంతంమీద ఆపుకొన్నాడు. అలాగే నిశ్చేష్టుడయి, అచేతనంగా వుండిపోయాడు.

క్రేన్తోగాని, పదిమంది మనుషులు ఎత్తితేగానీ లేవని పెద్ద బండరాయి, గాలిలో నాలుగైదు అడుగులు పైకి లేచి , రెండు క్షణాలు శూన్యంలో ఊగిసలాడి, ఎవరో వదిలేసినట్లు దభేలున పడిపోయింది.
చుట్టూ గాడమైన నిశబ్దం.

ప్రారంభం:

జూన్ ఇరవై తొమ్మిది

రాత్రి కురిసిన వర్షం ప్రభావంవల్ల చల్లటిగాలి దక్షిణం నుంచి వీస్తూ వుంది.

తొమ్మిదిన్నరయింది.
రమణ బట్టలేసుకున్నాడు. ఉన్నవి రెండు జతలు. అందులో ఒకటి ఇంటర్వ్యూలకోసం, మాలతిని కలుసుకోవటంకోసం అట్టే పెట్టింది. అది వేసుకున్నాడు. జేబులో అర్థరూపాయి వుంది. అన్నయ్యని అడగటానికి మనసొప్పలేదు. అడిగినా వుండదు. అడక్కపోతే అడిగి లేదనిపించుకొన్న అసంతృప్తి వుండదు.

ఫైల్లో సర్టిఫికెట్లు వున్నయ్యో లేదో చూసుకొన్నాడు.

బి.ఏ. ఎకనామిక్సు. యూనివర్శిటీ ఫస్టు. నె.సి.సి. బాడ్మింటన్. మంచి కుర్రవాడు.

ఫైలు మూసి, "వదినా వెళుతున్నాను' అని అరిచేడు. జానకి లోపల్నించే "మంచిది బాబూ" అంది.

"తడుముకోకుండా చెప్పరా" అన్నాడు దగ్గుతూ ముసలాయన. రమణకి నవ్వొచ్చింది. ఇది పదహారో ఇంటర్వ్యూ.

తలూపి బయటకొచ్చాడు.
పత్రిక ఆఫీసు కొచ్చేసరికి పావుతక్కువ పది. తనలాటి మరో ఇరవైమంది భారతియులు చావబోతున్న ఆవుకోసం ఆకాశంలో తిరిగే గ్రద్దలు....

అతడి వంతు వచ్చేసరికి పన్నెండయింది. నెమ్మదిగా గదిలోకి ప్రవేశించాడు.

ఆ గదిలో ఉన్న రోజ్‌వుడ్ టేబుల్ ఖరీదుతో ఒక సగటు మనిషి రెండు నెలలు, అక్కడున్నవాళ్ళ ఒక్కొక్కరి కోటు కుట్టడానికయిన ఖర్చుతో ఒక నెలా, ఆ గది కేసిన పెయింటింగు ఖరీదుతో మూడు నెలలూ భోజనం చెయ్యొచ్చు.

ఆ గదిలో గాలి కూడా నమ్రతతో వీస్తోంది.
పేపర్ వెయిట్ కూడా హుందాగా వుంది.
"బీ సీటెడ్ మిస్టర్ రమణా!"
"థాంక్యూ సర్!"
"మీ క్వాలిఫికేషను?"
"బి.ఏ."
"క్లాసు?"
"ఫస్టుక్లాసు. యూనివర్శిటీ ఫస్ట్."
"సబ్జెక్టు!"
"ఎకనమిక్స్"
క్షణం నిశబ్దం.
".... భూమికి, సూర్యుడికి మధ్య దూరం యెంత?"
"తొమ్మిదికోట్ల ముప్పై నాలుగు లక్షల మైళ్ళు."
"మిస్టర్ రమణా! ఆకాశంలో నక్షత్రాలెన్ని?"
'లాభంలేదు. ఈ ఉద్యోగం తనకి రాదు. ఆర్దిక శాస్త్రంలో పట్టభద్రుడైన తనని ఆస్ట్రానమీలో ప్రశ్నలడుగుతున్నారంటే - ఈ ఉద్యోగం యింతకు ముందే యెవరికో అంకితం అయిపోయిందన్నమాట!'
అయినా చెప్పటం మొదలు పెట్టేడు.

"మన కమ్టికి కనబడేవి దాదాపు ఆరువేల నక్షత్రాలు. కానీ లక్ష మిలియన్ల నక్షత్రాలు మన మిల్కీవేలో ఉన్నాయని అంచనా. అలాంటి మిల్కీవే గలాక్సీలు విశ్వంలో దాదాపు పదిలక్షల మిలియన్ లున్నాయి. అంటే విశ్వంలో పదికోట్ల కోట్ల నక్షత్రాలున్నాయన్న మాట. పదితర్వాత ఇరవయినాలుగు సున్నాలు."

అవతలివాళ్ళ తల దిమ్మెక్కినట్లయింది. కొంచెంసేపెవరూ మాట్లాడలేదు. తరువాత ఒకాయన అడిగేడు.
"లావా అంటే ఏమిటి?"
"భూమి అంతర్భాగాన మహోజ్వలమైన వేడికి కరిగిన ఘన పదార్థం. సప్త లోకాహల మిశ్రమం."
"మీరు తెలుగు బాగా అధ్యయనం చేసినట్టున్నారే" నవ్వులు.
రమణ మొహం ఎర్రగా మారింది.
"లావా మరి భూమి పైకి ఎందుకు రాదు?"
"కవచంలాగా పైపొర కప్పుకుంది కాబట్టి"
"లావాలో ఇనుము వుంటుంది కదా?"
"ఉంటుంది."
"మీ తమ్ముడు ఓ బావిలోకి అయస్కాంతం పట్టుకెళ్ళాడనుకోండి. మరి లావా బయటికొచ్చెయ్యాలి కదా- ఐ మీన్ భూమిని చీల్చుకుని"

రమణ తలెత్తి చూసేడు. అందరి మొహాల్లోనూ ముసి ముసిగా నవ్వులు.

"భూమి పొర చాలా మందం. అలా రాదు"
"భూమి డెన్సిటీ ఎంత?"
"క్యూబిక్ సెంటీమీటరుకి అయిదు పాయింట్ల అయిదు గ్రాములు"
"భూమి లోపల డెన్సిటీ ఎంత?"
"దాదాపు దానికి రెండు రెట్లు."
"అంత డెన్సిటీ వున్న లావాని ఈ పొర ఆపగలదా?" అడిగేడొకాయన. "పకోడీలు దట్టంగా కూరి కాగితంలో కడ్తే - లోపలి డెన్సిటీ ఎక్కువైతే ఏమవుతుంది?"

ఇంకో ఇంటర్వ్యూ కమిటీ మెంబరు తనే సమాధానం చెప్పాడు, "కాగితం పగిలి మనకందరికీ పకోడీలు దొరుకుతాయి"

గొల్లున నవ్వులు.

"మిస్టర్ రమణా! భూమి మాస్ ఎంత?"

"అయిదూ పాయింట్ తొంభై ఏడు ఇంటూ పదివందల ఇరవై ఏడు గ్రాములు."

"ఇంత పదార్థాన్ని పై పొర ఆపలేకపోతే ఏమవుతుంది?"

రమణ లేచాడు. సర్టిఫికెట్లు సర్దుకున్నాడు. "ఇలాంటి ఇంటర్వ్యూలుండవు. మనిషి తిండికోసం ఏడవటం వుండదు. చదువుకున్న చదువు యింత ఉద్యోగం దొరకలేదే అన్న బాధ వుండదు. ఎయిర్ కండీషన్డ రూమ్ లుండవు. ప్రశ్నలుండవు. సమాధానాలుండవు. అసలేమీ వుండదు"

******************************************

"ఏమైంది ఇంటర్వ్యూ?" అడిగింది మాలతి.

"ఏమవుతుంది?"

"అంటే?"

అతన్ని అనునయంగా చూస్తూ, "పోన్లే ---- అదృష్టం బావుంటే ఇంకోసారి వస్తుంది" అన్నది.

"రాదు ఇంకోసారి కూడా రాదు" అన్నాడు. అతను అడ్డంగా తలవూపుతూ, "ఆ దేవుడికి కూడా తెలుసు మనం తనకేమీ లంచం యివ్వలేమని"

"నేన్నీ కొకటి చెప్పనా?"
అతడు ఏమిటన్నట్టు చూసేడు.
"తిట్టగూడదు సుమా!"
"ఏమిటి?"
"నీకీసారి ఉద్యోగం వస్తే మనిద్దరం తిరుపతి వస్తానని మొక్కుకున్నాను" అందామె.

"నేనూ మొక్కుకున్నాను"
"ఏమని?" అందామె ఆశ్చర్యంగా. ఆమెకి అతడు "మొక్కుకున్నా"డంటే చాలా ఆశ్చర్యంగా వుంది. "ఏమని?" రెట్టించింది. అతడు మౌనంగా వుండటం చూసి.

"ఈసారి ఉద్యోగం రాకపోతే తిరుపతి వచ్చి, విగ్రహాన్ని బాంబుల్తో బ్రద్దలు కొట్టేస్తానని."

ఆమె సన్నగా వణికి, చప్పున అతడి చెయ్యి పట్ట్కొని, "అలా అనకు, ప్లీజ్! నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది" అంది. అతడు పేలవంగా నవ్వి "రాదు" అన్నాడు. "వచ్చినా, ఆ ఉద్యోగపు జీతం, మీ నాన్నగారు నీకు ప్రతినెలా ఇచ్చే పాకెట్ మనీ అంత కూడా వుండదు"

"అఖ్కర్లేదు" అన్నదామె. "నువ్వు నా ప్రక్కనుంటే నాకు డబ్బు అఖ్కర్లేదు, ఏమీ అఖ్కర్లేదు."

అతడీసారి నిజంగానే నవ్వాడు. "షేక్స్పియర్ నుంచీ అదే వ్రాస్తూ వచ్చారు ఈ కాలం రచయతల వరకూ."

ఆమె రోషంగా --- "నేను నీకు మరీ కలల్లో బ్రతికే ఆడపిల్లలాగా కనిపిస్తున్నానా?" అన్నది. అతడు ఆమెవైపు ఆరాధనగా చూసేడు.
"చాలా సమస్యలు --- కట్నం, ఉద్యోగం, అత్తల కష్టాలు, ప్రేమ, కోరుకున్నవాడు దొరక్కపోవటం. ఇన్ని కష్టాల్లో బ్రతకటం కంటే ఆడపిల్ల కలల్లో బ్రతకటమే మంచిది."

"మిగతా ఆడపిల్లల సంగతి నాకు తెలీదు. నేను మాత్రం నిన్నే వివాహం చేసుకొంటాను. ఆరు మూడైనా, మూడు ఆరైనా సరే అందుగ్గానూ నా ఆస్థి సర్వస్వం వదిలి వచ్చేస్తా. ఇంకొక్క మాట కూడా వినను. అలా వచ్చేసినందుకు నేను ఆ తర్వాత ఎప్పుడూ భవిష్యత్తులో చింతించను."

అతడు తిరిగి నవ్వబోయాడుగానీ, ఆమె మొహంలో కనబడ్తున్న అదోవిధమైన దీప్తిని చూసి కదిలిపోయి, "మలతీ" అన్నాడు. ఆమె కూడా త్న ఉద్వేగానికి సిగ్గుపడి "సారీ" అన్నది.

"ఎందుకు" అన్నాడతడు. "మనిషిలో ఆ మాత్రం సెన్సిటివ్ నెస్ ఫీలింగ్ లేకపోతే బ్రతకడం అనవసరం. నీకు తెలుసా మాలతీ - నేను ఈ వ్యథాబరిత జీవితం. చచ్చిపోవకుండా అలా అనుభవిస్తున్నానంటే దాని వెనకున్న ఒకే ఒక కారణం నువ్వే. ఫస్ట్రేషన్ ఫస్ట్రేషన్ యువకుల్లోనూ, యువతుల్లోనూ, ముసలివాళ్ళలోనూ అందరిలోనూ నిరాశే. అంతా బ్రతకటానికి మాత్రం ఒక కారణం ఏదో ఒక కారణం. అంతే అలా నేను బ్రతకడానికి కారణం నువ్వు."

ఆమె మాట్లాడలేదు.

ఇద్దరూ మౌనంగా నడవసాగేరు. నిసబ్దమే మాట్లాడుతూంది ఆర్ద్రంగా.

"బాగా చీకటిపడింది. ఇక వెనుదిరుగుదామా" అన్నాడతడు. పైర్ల మీద నుంచి వచ్చే గాలి ఆహ్లాదంగా వుంది. దూరంగా ఓ రెండెడ్ల బండి చప్పుడు చేసుకుంటూ వెళ్తూంది. "ఊరికి చాలా దూరం వచ్చేశాం....."

ఇద్దరూ వెనుతిరిగారు, వెనుదిరుగుతూంటే ఆమె ఆగి "రమణా " అంది.

"ఊ.... " అన్నాడు.

"నేను .... నేను ఒకసారి నీ చేతిని నా చేతుల్లోకి తీసుకోవాలి ఒకేసారి .... "

అతడు ఆమె వైపు నెమ్మదిగా తల తిప్పేడు. నెమ్మదిగా కానీ దృడంగా అన్నాడు __ "వద్దు"

ఆమె హర్టు అయి "ఏం?" అంది.

"దీనికి ఇక అంతం ఉండదు మాలతీ. హృదయంలో ఉప్పెనలో పొంగే ఆత్మీయతని ప్రదర్శించటానికి చెయ్యి స్పృశించటమే అవుట్ - లెట్ అయితే, అదికూడా కొంతకాలానికి సరిపోదు. అది అక్కడితో ఆగదు కూడా. మనిషి నైతిక విలువలకర్థం కొద్ది కొద్దిగా మారిపోతుంది. ఆత్మవంచన ప్రారంభమవుతుంది. కొంతకాలం ఆగుదాం. నాకు ఉద్యోగం దొరికితే .... " అని నవ్వేడు.

ఆమె నవ్వలేదు. ఆలోచిస్తూంది. ఈ దౌర్భాగ్యపు ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమకూడా వ్యవస్థ నిర్మించిన అసమానతల్లోపడి కాలుష్యమయిపోతుంది. తన తండ్రి ఇల్లూ, కారూ, ఫ్రిజ్ అన్నీ అమ్మి ప్రేమికులకి వంచిస్తె ... అప్పుడొచ్చింది ఆమెకి నవ్వు. తల అబ్సర్డు ఆలోచనలని తల్చుకొని. అయినా ఇందులో అబ్సరిటీ యేముంది? ప్రేమకన్నా ఆకలి దారుణమైంది.

తమ వందెకరాల్నీ పంచి వందమంది కిచ్చేస్తే? నిర్భాగ్యులకీ -- మాలలకీ -- మాదిగలకీ----


***********************************************************

"మాదిగోడికి పొలమేమిట్రా? మన ఇట్టరీలో ఏడన్నా చూసినావా అది?" మున్సబు చుట్టపీకి, "థూ" అని ఉమ్ముతూ అన్నాడు.

రాజయ్య మాట్లాడలేదు.

భూషణం చెయ్యి మీసం మీదికిపోయింది. కడుపులోంచి క్రితం రాత్రే మున్సబుతో కలిసి కొట్టిన మందు త్రేన్పుగా వస్తూంది.

"ఎల్లెల్లు ఏదో ఆయనిచ్చింది తీసుకొని - పన్చేసుకో. "పో" మళ్ళీ అన్నాడు మున్సబు.

"ఇంకో రెండు గింజలు ఎక్కువ కావాలంటే భూషణాన్ని అడిగి తీసుకోరాదట్రా. పొలం నాదనడం దేనికి .... ? " కరణం అన్నాడు.
రాజయ్య వాళ్ళవైపు చూశాడు.
మునసబు, భూషణం, కరణం.
వెనక్కి తిరిగి తన వాళ్ళవైపు చూసేడు.
ఎల్ల మంద, ఈరిగాడు, యూనవు.

అవతలివాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇవతలి వాళ్ళు వినటం తప్ప ఇంకేమీ చేతకానివాళ్ళు, వింటున్నారు. మధ్యలో తను - అన్యాయం జరిగినవాడు.

భూషణం కళ్ళు ఎర్రగా వున్నాయి తాగీ తాగీ.

తన కళ్ళు ఎర్రగానే వుండొచ్చు, రాత్రంతా ఏడ్చీ ఏడ్చీ.

కోపమొచ్చినా ఎర్రబడతాయట కళ్ళు, తెలీదు. జీవితం మొత్తం మీద కోపం వచ్చిందెప్పుడు? ఎప్పుడైనా తెచ్చుకొందామన్నా - దానికి వీలు కలిగించగలిగే పెళ్ళాం - పెళ్ళయిన రెండేళ్ళకే వెళ్ళిపోయింది.

"ఏమంటావురా!" మున్సబు అడిగేడు.

"ఆ పొలం మా తాతల్నాటిది దొరా?"

"నిజమేరా, మీ తాత నాకు తెల్సుగదా! భూషణం తాత దగ్గర పన్జేసేవాడు. ఆడికా బంజరు రాసిచ్చింది ఆయనేరా!"

"రాసిచ్చింది తీసుకుంటే ఎట్టనయ్యా?"

"రాసివ్వటం అంటే ఏకంగా రాసిచ్చినా రేందిరా! మూడు సంవత్సరాలకి కౌలు కిచ్చినారు."

"బంజరుభూమి అది. దాన్ని మాతాత వదిలేసిండు. మా యన వదిలేసిండు. నేను దున్నిన మూడేళ్ళనుమ్చి అది పండుతోంది. ఇప్పుడు తీసుకుంటానంటే ఎట్టనయ్యా?"

"మూడ్ళ్ళయిపోయింది కద, ఇదిగో ఈ కాగితం చూడు!" మాసిన కాగితంమీద మరకల ఇమ్కు.

ముప్పై సంవత్సరాల క్రితం వ్రాసిందా? మూడు నెలల్లో సృష్టించిందా?

"న్యాయమంటే న్యాయమే. కాగితాన్నీ, కాగితంమీద వ్రాసిందాన్నీ నువ్వు కాదనలేవు గదా. ఇది నీ సంతకమే. అంటే అదే ... ఏలుముద్ర అనుకో ... దాన్నీ కాదనలేవు కదా!! చూడు రాజయ్యా, ఈ చెట్టు క్రింద కూర్చొని నేనెన్నో తీర్మానాలు చేసినా, న్యాయాలు చెప్పినా, నువ్వు యినుకో. ఆ పొలం భూషణం స్వాధీనమ్ చెయ్యి. కావాలంటే ఆడికిందే పన్జెయ్యి. ఆ పొలం నువ్వే దున్ను. పండించు, నీ కూలి తీస్కో. ఆయన మంచాయన. మేం అందరమ్ చెప్పినాం కాబట్టి వొప్పుకుంటుండు."

'పన్జెయ్యి, దున్ను, పండించు, కూలి తీస్కో. పండించింది ఆయన కియ్యి. ఆయన మంచాయన. కూలి యివ్వటానికి ఒప్పుకుంటాడు.'

రాజయ్యకి నవ్వూ ఏడుపూ రాలేదు. చచ్చినోడు తగలపడ్తూంటే బతికున్నోడు శ్మశానంలో కూచుంటే కలిగే స్థితి. చేతులు కట్టుకొని అన్నాడు-

"ఏదయినా సెబ్దామన్నా నాకు ఎక్కువ బాస రాద్దొరా! అయినా సెప్పాలికదా, సెప్తే నాయం జరుగుద్దనికాదు. సెప్పకుండా సెడిపోయా నన్న బాధ, ముందు ముందు నాకు లేకుండా వుండేందుకన్నా అది సెప్పాలి. ముప్పైయేళ్ళక్రితం మూడేళ్ళకి భూమి రాసిచ్చినాయన మరింత కాలమూ దాన్నెందుకు అడగలేదంట.....? అడుగుతున్నానని నారాజవకయ్యా! ఇదిగో యీ సేతుల్చూడు- ఈటిల్తో దున్నినా, ఈ పొలము తడిసింది నీళ్ళతో కాదయ్యా, సెమటతో. ఇప్పుడిప్పుడే అది కాసింత కనికరించి గింజల్ని రాలుత్తాంది... మీరీ కాగితము సూపించినారు. అది మా తాత రాసిందట ఆల్ల తాతకి! సచ్చినోడు ఎట్టానూ రాడు. సావలేక బతకలేక శవాల్లా బతుకుతున్న మాలాటి వోల్లకి సాచ్చం సెప్పటానికి దేవుడు కూడా దాక్కుంటాడు."

కరణం కదిలేడు, అసలింతసేపు వీడ్ని మాట్లాడించటం ఏమిటీ అన్నట్టు మునసబు వేపు చూసేడు.

"ఈ సంతకం నీదే కదయ్యా!" దీనికేం చెప్తావన్నట్టు మున్సబు అడిగేడు. రాజయ్య నవ్వాడు.

"సిన్నప్పుడు బడిపంతులు మనూర్లో యిల్లిల్లూ తిరిగి పిల్లగాళ్ళందర్నీ సదువుకు రమ్మని పిల్చేవోడు, గుర్తున్నదా దొరా? మా నాయన అప్పుడప్పుడు - 'నా కొడుకుని పంపితే ఏమున్నది పంతులూ, పన్నెండేళ్ళు నీ యిస్కూల్లో వుంచుకుని ఎనిమిదో కలాసుదాకా జెప్పిస్తావు. ఆ తరువాత జెప్పేంద్కు మీ దగ్గరేమి వుండదు. జెప్పించుకొనేంద్కు మా దగ్గరా పైసలుండవ్. అక్కడితో ఆగిపోతాడు. అంత చదువు చదివినాడు కాబట్టి అడితో మెరక దున్నించలేను. అంత కొద్దిగా సదివినాడు కాబట్టి సర్కారోళ్ళు ఉద్దోగం కూడ యియ్యరు. రొంటికీ సెడిపోతాడు' - అన్నాడు మా నాయన. 'చదువే ముఖ్యం' అన్నాడు పంతులు. పెపంచాన్ని సూసేటంద్కు. సదువుకోవాల్నంట. అప్పుడే దేశం బాగుపడుద్దన్నాడు. నాకు బాగా గురుతు. దేశము బాగుపడేదంటే ఏదో తెలియకున్నా పంతులు సెప్పిన మాటలు మాత్రం బాగా యాదుకున్నాయ్. పోరగాళ్ళతో కలిసి యిస్కూలు కెళ్ళాలంటే గదోసర్దా. మా నాయన 'గద్సరే పంతులూ, మావోడు కూలికెల్తే రెండు రూపాయల కూలి దొరుకుద్ది కదా, మరి నీతో పంపిస్తే ఏం దొరుకుద్ది? అని అడిగిండు. నాటకాల్లో ఏసాలేసే పంతులు నాటకంలోలాగే 'ఇజ్ఞానము దొరుకుద్ది' అన్నాడు సప్పున. 'మా

*********************************************************************************

ఆకాశానికి నమస్కారం

లాస్ ఏంజిల్స్, డిశంబర్ ౧౪: మన సౌరకుటుంబమూ, నక్షత్ర సౌదాయమూ పాలపుంతలోని నక్షత్ర సముదాయాలూ గంటకు ౧౬ లక్షల కిలోమీటర్ల వేగంతో కన్యారాశివైపుగా దూసుకుపోతున్నయని, ఆ దిశలోనున్న బ్ర్హత్తర నక్షత్ర మందలి పెను బలతో మన పాల పుంతను ఆకర్షిస్తుండటమే దీనికి కారణం అనీ జర్జి స్మూట్ అనే శాస్త్రవేత్త భావిస్తున్నారు. మన భూమితో సహా మన నక్షత్ర సముదాయమంతా సెకనుకు అయిదువందల కిలోమీటర్ల వేగంతో రోదసీలో పయనిస్తోందని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన ఆ శాస్త్రవేత్త చెబుతున్నారు. మన సమస్త నక్షత్రాలూ ప్రళయ వేగంతో రోదసీలో పయనిస్తోందని కాఅలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన ఆ శాస్త్రవేత్త చెబుతున్నారు. మన సమస్త నక్షత్రాలూ ప్రళయ వేగంతో ఎందుకు ప్రయాణం చేస్తున్నాయో అన్నది కలవరపరిచే ప్రశ్న అనీ, బహుశా ఏ రాకాశి గ్రహాలో తిరుగు లేనంత బలంతో మనని ఆకర్షిస్తున్నాయన్నది మాత్రం నిర్ణయం అని స్మూట్ చెప్పారు.

అటువంటి మహా నక్షత్ర సముదాయం ఒకటి ఉన్నట్లయితే అటు వంటివి ఇంకా అనేకం ఉండవచ్చునని ఊహకందని బ్రహ్మాండ పరిమాణంలో పదార్థ సముదాయాలు ఆ ప్రదేశంలో వుండవచ్చునని ఆయన అన్నారు.

******************************************************************************

కిజ్ఞానము వద్దు బాబూ, ఇంత తిండి దొరికితే సాలన్నాడు మా నాయన. 'స్కూల్లో యింత మంది సదువుతున్నట్టు సర్కారోడికి సూపించాలి ఎట్లా?'
గన్నడు పంతులు. 'మావోడు యిస్కోలు కొస్తున్నట్టు రాసుకో, ఆడ్ని కూలి కొదిలి పెట్టు' అన్నాడు నాయన. మీయందరిని యిట్ట నిలబెట్టి మాట్టాడుతున్నానని కోపము దెప్పించుకోకండయ్యా! ఇంతకీ నే సెప్పేది నాకు సదువు అంటలేదని . 'అ' కి 'ఈ' కి తేడా తెల్వనోడి కాడ కాగితము బెట్టి నీకు సర్కారోడు ఎరువులు మంజూరు ఏసిండు అంటే ఒకసోట ఏంది దొరా.... ఎయ్యమన్న సోటల్లా ఏలముద్ర లేస్తము నేనూ, ఈసోపూ ఈరిగాడు. ఇప్పుడా కాగితము సూపించి 'ఇదే నాయం?' అంటే ఏం జేస్తం? నాయం గదేనేమో అనుకుంటాము. అంతకన్నా ఏం జేస్తం? చెట్టుకింద కూర్చొని నివ్వెన్ని నాయాలు సెప్పినవ్. ఈ రోజు మళ్ళీ గదే సెబ్తున్నవ్, దాన్ని యినుకొని నేన్నా ఇన్లు వదిలిపెడ్త. ఉండేటంద్కు ఏ సెట్టో సూస్కుంట. ఈ సెట్టుకింద కూర్చొని నువ్వు సెప్పింది యినుకొని ... నేనూ ఇంకో చెట్టుకిందికి సేరిపోత...." అంటూ వెనక్కి తిరిగేడు.

భూషణం మున్సబును చూసి నవ్వేడు. మున్సబు కరణాన్ని చూసి నవ్వలేదు ప్రిస్టేజికి భంగమని.
రచ్చబండమీద నుంచి అందరూ లేచేరు. అప్పటికే అన్యాయం జరిగినోళ్ళు నాలుగొందల గజాలు వెళ్ళిపోయారు.
న్యాయం చెప్పినవాళ్ళు ఇళ్ళవైపు సాగిపోతున్నారు.
అప్పుడో శబ్దం వినిపించింది.
ఫెళా ఫెళా విరిగిన శబ్దం.
అటువాళ్ళూ, ఇటువాళ్ళూ వెనుదిరిగి చూసేరు.

అప్పటివరకూ పచ్చగా కళకళలాడిన ఆ చెట్టు యెవరో తోసినట్టు పైకి లేచి పెద్ద శబ్దంతో పక్కకి ఒరిగిపోయింది.

**********************************************************************

ఇరానీ హోటల్లో కూర్చొని వున్నాడు రమణ. జేబులో అర్థరూపాయుంది. 'టీ'కి ఆర్డరిచ్చాడు. హోటల్లో ఎవరూ లేరు. ఎవరోపొట్లంలో భోజనం చేస్తున్నారు.

భరించలేనంత నిస్సహాయత!! ఈ ఉద్యోగమూ రాలేదన్న భావం మనసుని పరఫరా కోస్తూంది.... చదివిన చదువు వ్యర్థం అయిపోతూంది... ఇంట్లో తండ్రికి బాగాలేదు... అన్నయ్య జీతం ఇంట్లో రెండు పూటలా తిండికే సరిపోవటంలేదు. ఎలా? అవునెలా?

ప్రశ్న చాలా చిన్నది.
సమాధానమ్ విశ్వమంత పెద్దది.
చెంపమీద ఏదో జారినట్టు అనిపిస్తే తడిమేడు. కన్నీటి చుక్క. అంత బాధలోనూ నవ్వొచ్చింది.

"ఏమిటి --? ఏడుస్తూ నవ్వుకొంటున్నావ్?"

హఠాత్తుగా వినిపించిన ప్రశ్నకి తలెత్తి చూసేడు. ఒక ముసలివాడు .... యభై అయిదేళ్ళవాడు .... చిరుగడ్డమ్ ... తెల్లబడిన బట్టతల.... ఒక లాంగు కోటు ..... ఫైజమాలాంటి లూజు ప్యాంటూ ... తైల సంస్కారం లేని జుట్టు .... కొద్దిగా మాసిన గడ్డం .... పీక్కుపోయిన దవడలు.....

"వాతావరణంలో ఆక్సిజనుంది వంట్లో హైడ్రోజనుంది. ఆ రెండూ కలిస్తే కంట్లో నీరుంది. బైదిబై ఒక టీ కొట్టించు" అని చొరవగా ఒక కుర్చీలో కూర్చున్నాడు.

రమణకి నవ్వొచ్చింది. తన దగ్గరున్నదే అర్దరూపాయి వదిన్ని అడుక్కొన్నది. అడుక్కొన్న వాడిదగ్గర అడుక్కొనేవాడు.
"కూర్చో" అన్నాడు రమణ.
"కూర్చునే వున్నాను" అన్నాడు. "బైదిబై నీ వయసెంత?"ఇరవై అయిదు ఉండవూ? నాకు డెభ్బై అయిదు. అఫ్కోర్స్ ... అంతలా కనబడననుకో. కానీ నీకన్నా మూడు రెట్లు ఎక్కువ. అందుకని మూడక్షరాలతో పిలువు. 'కూర్చోండి' అను. వెధవ సెల్ఫ్ రెస్పెక్టొకటి ఏడిచింది కదా?"

"సారీ!" అన్నాడు రమణ నొచ్చుకుంటూ. "ఏదో పరధ్యానంలో వున్నాను."

"ఏదైనా లవ్వెఫైరా - లేక ఉద్యోగమా! నీ సమస్య? యూత్ ని బాధిస్తున్నవి అవి రెండే."

"ఉద్యోగం" అన్నాదు రమణ. "ఇప్పుడే ఇంటర్వ్యూ నుంచి వస్తున్నాను"

"ఏమడిగేరు?"

అడిగిన ప్రశ్నలూ.... తను చెప్పిన సమాధానాలూ వివరించేడు. ఒక్కొక్కటీ చెబ్తూంటే అతడు ఆసక్తిగా ముందుకు వంగి విన్నాడు. అంతా విని, "నువ్వు ఆస్ట్రానమీ స్టూడెంటువా?" అని అడిగేడు.

కాదన్నాడు రమణ.

"మరింత కరెక్టుగా సమాధానం చెప్పేవ్?"

"ఈ కాలంలో ఇంటర్వ్యూల కెళ్ళాలంటే ఎన్ సైక్లోపీడియా అంతా కంఠతా వచ్చి వుండాలి" నిర్లిప్తంగా అన్నాడు రమణ.

ఇంతలో టీ వచ్చింది. ఇద్దరూ టీ తాగి బయటికొచ్చేరు.

"నువ్వు నా దగ్గరెందుకు ఉద్యోగం చెయ్యకూడదు? బైదిబై ఒక చార్మినార్ సిగరెట్టుకి డబ్బులుంటే చూడు. టీ తాగిం తర్వాత వెధవది సిగరెట్ ఉండకపోతే ప్రాణం నిలబడదు. అన్నట్టు... ఏం చెబ్తున్నానూ ... ఉద్యోగం గురించి ఎస్. నువ్వు నా దగ్గర ఉద్యోగం ఎందుకు చెయ్యకూడదూ?"

అకస్మాత్తుగా అతది మెదడు గురించి అనుమానం వచ్చింది రమణకి. దాన్ని ప్రదర్శించకుండా "మీరేం చేస్తూ వుంటారు!" అని అడిగేడు.

"ఆకాశంకేసి చూస్తూ వుంటా."
"నేనేం చెయ్యాలి?" నవ్వాపుకొంటూ అడిగేడు.
"జీతం?"
"ఎంత కావాలి గ్రాడ్యుయేటూ?"
"వెయ్యి రూపాయలు" ఎంత ఆపుకుందామన్నా నవ్వాగటం లేదు.
"అంత ఇచ్చుకోలేను. నాలుగొందలు యిస్తాను. ఒక చోటనుంచి రావల్సిన డబ్బు వుంది. అది రాగానే వెయ్యి చేస్తాను."
"ఎక్కడ్నుంచి రావాలి?"
"స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ నుంచి. అల్ఫ్రెడ్ బి నోబుల్ అనే ఆయన పంపాలి."
"ఎంత?"
"లక్ష పౌండ్లు. సుమారుగా ఇరవై లక్షల రూపాయలు."
"నోబుల్ ఫ్రైజా?"
"అంతే....."

తెరలు తెరలుగా నవ్వొచ్చింది రమణకి. ఇక ఆపుకొనే ప్రయత్నం ఏదీ చెయ్యలేదు. నవ్వుతూనే కాంపౌండులోని ప్రవేశించేడు. చాలా పురాతనమైన ఇల్లు అది. బయట బాగా పిచ్చి మొక్కలు పెరిగి వున్నాయి. ప్రహరీ గేట్లు పడిపోవడానికి సిద్దంగా ఉన్నాయి. ఇంట్లోంచి బయటకీ, బయట్నుంచి ఇంట్లోకి గబ్బిలం ఒకటి ఎగురుతూ వుంది. పై కప్పు ఇరవై అడుగుల ఎత్తుంది. సాలెగూళ్ళు వేలాడుతున్నాయి.
"ఎవరిదీ ఇల్లు?" చుట్టూ చూస్తూ అడిగేడు.

"నాదే" అన్నాడతను. "మా అమ్మమ్మ నాన్నకి ఆ కాలపు నవాబు రాసిచ్చేడు. అది నాకు వచ్చింది."

వీధికి చాలా లోపలగా, మూలగా వున్నదా భవనం. నవాబుల ఒకప్పటి రమ్య హర్మ్యాలు యిప్పుడు ఆ స్థితిలో వుండటం అతడికి తెల్సిందే. అందుకే అతడికి ఆశ్చర్యం కలగలేదు. అలాంటి పాడుబడిన ఇళ్ళు రస్తుతం భిక్షగాళ్ళకి నివాస కేంద్రాలు. దూరంగా గ్రౌండులో పిల్లలు ఆడుకొంటున్నారు.

అతడు నడుస్తూ వుంటే కాలికింద దుమ్ము పైకి లేస్తోంది. చాలా పెద్ద ఇల్లు అది. నగరపు నడిబొడ్డులో వుంది. అద్దెకిస్తే నాలుగువేలకి తక్కువ రాదు. అతను ఆలోచనల్లో వుండగానే కాలికేదో తగిలిందీ తీసి చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ కాగితమ్. పన్ను కట్టమని నోటీసు.

"అలాంటి పన్లన్నీ నువ్వు చెయ్యాలి" అన్నాడు.
"నేను మర్చిపోతూ వుంటాను. టీ కొచ్చి డబ్బులు మర్చిపోయినట్టు ..." మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చినట్టు "అన్నట్టూ నీకు అపాయింట్ మెంట్ ఆర్డర్ టైపు చేసి కావాలా, ఓరల్ గా సరిపోతుందా? టైపుది కావాలంటే వెళ్ళి టైపు చేయించి తెచ్చుకో ... ఏది కావాలి?"

"నాకు అడ్వాన్సు కావాలి..." అన్నాడు రమణ.

'ఇంటికెల్లి చేసే పనేమీ లేదు. ఇక్కడ బాగానే ఉబుసు పోతోంది' అనుకున్నాడు.
"అడ్వాన్సు నోబుల్ ఫ్రైజ్ వచ్చాక. ప్రస్తుతం డబ్బంతా ఇన్వెస్టుమెంటుతో వుంది."
"మీ పేరు"
"ప్రొఫెసర్ ఆరోగ్య మరపు ఆనంద మార్గం" అన్నాడు. ఎడమ వైపు గదిలోకి నడుస్తూ "అందరూ ఎ.ఎమ్.ఎ.ఎమ్. అంటారు. చివరద్ 'అయోమయం' అయింది"

రమణ నవ్వుతూ "ప్రొఫెసర్ అయోమయం గారూ...." అంటూ ఏదో అనబోయి చప్పున ఆగిపోయేడు.

అప్పటికి వాళ్ళు ఎడమవైపు గదిలో ప్రవేశించినారు. దానికి పై కప్పులేదు. పెద్ద అద్దం బిగించి వుంది. పెద్ద రివాల్వింగ్ డోమ్ మీద అజిమోటాల్ యాభై మీటర్ల పొడవూ, నలభై అయిదు మీటర్ల డయామీటరూ వున్న టెలిస్కోపు హుందాగా నిలబది వుంది.

ప్రపంచంలోకెల్లా పెద్ద టెలిస్కోపు రష్యాలో వుందని విన్నాడు. కానీ యిప్పుడు చూస్తున్నాడు. అతడు ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే వెనుకనుంచి ప్రొఫెసర్ కంఠం వినిపించింది.

"మీ జనరల్ నాలెడ్జి పుస్తకంలో యిది కనపడదు. జెలింస్క్యా, నార్త్ కేకాసన్లో వున్న స్కోప్ కంటే ఇది పెద్దది. నేనే తయారు చేశాను దీన్ని. బైదిబై ఇంకో సిగరెట్టుంటే యివ్వు. దీన్ని ... ఐ మీన్ యీ స్కోప్ ని తయారు చెయ్యడానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది మా అమ్మమ్మ నాన్నకి ఆ నవాబు యిచ్చిందంతా ఖర్చయింది. దీని బరువు తొంభయి అయిదు టన్నులు, లెనిన్ గ్రాడ్ ఆప్టికల్ ఇంజనీరింగ్ అమాల్గమేషన్ వాళ్ళు దీన్ని చూస్తె మూర్ఛపోతారు. దీన్ని అమ్మితే ఎంతొస్తుమ్దో తెలుసా?__ నీ జీతం అడ్వాన్స్ ఇవ్వలేదని అనుమానపడకు. దీనిని ఉపయోగించిన ఇనుముతో పదకొండు పెట్టెలున్న పాసెంజరు ట్రైను తయారు చెయ్యొచ్చు. జీడీల వాదికి అమ్ముకుంటే రెండువేల మంది జీవితాంతం తినటానికి సరిపొయేటన్ని జీడీలు వస్తాయి. దీని పేరు ఏమిటో తెలుసా? లిప్పర్ షే. టెలిస్కోపు కనుక్కొన్నది గెలీలియో అని మీరందరూ అంటారు. కాదు, లిప్పర్ షే, అసలు మీకు జనరల్ నాలెడ్జి ఏం తెలుసని? ఊరు మధ్యలో వున్న టెలీస్కోప్ సంగతి ఎవరికి తెలియదు. కాలిఫోర్నియా__ మౌంట్ విల్ఫన్ అబ్సర్వేటరీలో వున్న ఫ్రొఫెసర్ ఆడమ్స్ ... ఇప్పుడు లేడులే, పోయాడు. అతని కొక్కడికే తెలుసు. బైదిబై యీ టెలిస్కోపులో ఎంత దూరం చూడొచ్చని నువ్వు అనుకుంటున్నావు?"

నోట్లో తడారిపోతుండగా తెలీదన్నట్లు తల అడ్డంగా వూపేడు.

"పదివేల మిలియన్ ల కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అంటే?" ఆగేడు. "సెకనుకి లక్షా ఎనభై ఆరువేల మైళ్ళ వేగంతో కాంతి ప్రయాణం చేస్తుంది. లెక్కకట్టు సెకన్ లు. అరవై ఇంటూ నిముషాలు అరవై ఇంటూ గంటలు ఇరవై నాలుగు ఇంటూ మూడువందల అరవై ఐదు రోజులు అయితే ఒక సంవత్సర. దాన్ని లక్షా ఎనభై ఆరు వేలమైళ్ళతో హెచ్చిస్తే ఒక కాంతి సంవత్సరం. ఈ టెలీస్కోపు అంత దూరం చూస్తుంది.లెక్కకట్టేవా గ్రాడ్యుయేటూ? ౫౪౧౩౨౯౬౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦ మైళ్ళు. అన్ని మైళ్ళ విశ్వాన్ని రోజూ చూస్తాన్నేను. అజిమొటల్ మౌంటింగ్, అంటే ఆకాశంలో ఏ మూలకైనా తిరుగుతుంది ఇది. కానింకో కోర్కె వుంది. విశ్వం నలుమూలలనుంచి వచ్చే కంటినువమ్ రేడియేషన్ ని పెద్ద 'ఆంటెనా' పెట్తి చూదాలని. తెలుసుగా ఆంటెనా అంటే...."

రమణకి తెలీదు, అయినా తెలుసన్నట్లు తలూపేడు. అతను, తను చూస్తున్నది కల కాదని నమ్మకం కలిగించుకోవడానికే బ్రహ్మ ప్రయత్నం చెయ్యవలసి వస్తోంది.

"చెప్పు గ్రాడ్యుయేటూ.... చేస్తావా నా దగ్గర పని?"
... చప్పున వాస్తవంలోని వస్తే... ఇంటిదగ్గర బీదరికం. మాలతి కళ్ళలో తనపట్ల ప్రేమ. ఆమె తండ్రికి తనపట్ల నిర్లక్ష్యం. నాన్న దగ్గు ... అన్నయ్య చాలీచాలని జీతం చాక్లెట్ల కోసం నోరు తడిచేసుకొనే గోపి. బాధల్ని చిరునవ్వుతొ నొక్కిపట్టే వదిన.

"నా దగ్గర ప్రస్తుతం తక్కువుంది గ్రాడ్యుయేటూ, ఉన్నదంతా... చూసేవుగా, ఖర్చు పెట్టేసేను."

అతది మొహంలో కనబడిన విషాదఛాయకి విచలితుడై "నేనేం చెయ్యాలి?" రమణ అడిగేడు.

"నాతోపాటూ ఆకాశంలోని చూడాలి. కొత్త "ప్లానెట్" దొరకవచ్చు. కొత్త 'గలాక్షీ' కనపడొచ్చు. నోబుల్ ప్రైజు రావడానికి చాలదా? అదిగో , కదలకుండా చూపు ఎడమవైపు తిప్పి చూడు. ఎలుక ఒకటి మనల్ని వెక్కిరిస్తున్నట్లు మీసాల్ని ఎలా తిప్పుతుందో! కనీసం దాని గర్వాన్ని అణచడానికైనా మనం ఒక గొప్ప విషయాన్ని కనుక్కోవాలి. ఏమంటావ్?"

రమణ తలూపేడు చేస్తానన్నట్టు.****************************************************************

జూన్ ఇరవై తొమ్మిది
తెల్లవారుఝాము నాలుగున్నర!

***************************************************************

శాన్ ఫ్రాన్సిస్కో, ప్రకృతి సిద్దంగా ఏర్పడిన ఎయిర్ కండీషన్డ్ వాతావరణం. పసిఫిక్ సముద్రం పక్కగా, కాలిఫోర్నియా దక్షిణప్రాంతపు కొండల్లో వుండటంవల్ల దానికా సౌలభ్యం చేకూరింది. మూడువైపులా సముద్రం. ఒకవైపు కొండలూ ఉండడంవల్ల ప్రపంచపు గొప్ప రేవుపట్టణాల్లో ఒకటిగా పేరు పొందింది. పట్టణంలోకి ప్రవేశించటానికి ముఖ్య ద్వారం గోల్డేన్ గేట్.

రకరకాల వాతావరణం, రకరకాల మనుష్యులూ ఉన్న పట్టణం అవటంచేత దాని పెరుగుదల గమ్మత్తుగా జరిగింది. ఉత్తర ప్రాంతాల్లో రష్యన్లూ.... నాబ్ హిల్ దాటేక ఇటాలియన్ క్వార్టర్లూ... గోల్డెన్ గేట్, ప్రెసీడియోల మధ్యనున్న రిచ్ మాండ్ సెక్షన్ లో ఓల్డు టౌనూ కనిపిస్తాయి.

సముద్రతీరానికీ, మిషన్ స్ట్రీట్ కి మధ్య దక్షిణ దిశగా పారిశ్రామిక వాడలు పెరిగినాయి.

బేషార్న్ హైవేమీద మెక్ కారు దూసుకుపోతున్నది. అకస్మాత్తుగా ఉపద్రవం సంభవిస్తే తప్ప తనకి అంత అర్జెంటుగా పిలుపురాదని అతడికి తెలుసు. దాదాపు ప్రపమ్చం మొత్తాన్ని ఆజ్ఞాపించగల ఒక దేశపు అత్యున్నత పదవిలో వున్న మనిషికి ఫస్టు సెక్రటరీ అతడు. ఎటువంతి ఉపద్రవమ్.....? ఏదయినా కావచ్చు.

ప్రపంచంలో నిముషానికి యాభయి లక్షల ఖర్చు.... ఆయుధాల ఉత్పత్తి గురించి జరుగుతుంది. ఎంత గొప్ప చేదునిజం! ప్రొఫెసరు కాంట్రోఎట్జ్ చెప్పింది నిజమైతే __ ఇంకో అయిదు సంవత్సరాల్లో 'లేజర్ బీమ్' ఆయుధాన్ని రష్యా తయారు చేస్తుంది. కాంతి వేగంతో అవతలి గమ్యాన్ని నాశనం చేసే సాధనం అది.

నిజానికి యుద్దం ఒకటే కాదు ప్రమాదం_
రోజురోజుకీ పెరుగుతున్న జనసామ్ద్రత.
....పూర్వం లేనన్ని వాతావరణ విపరీతాలు, భూకంపాలు, తుఫానులు.... హింసాప్రవృత్తి.... డ్రగ్స్, శాడిజం, పాకిపోతున్న సుఖవ్యాధులూ, వాతావరణం కాలుష్యం.

మానవజాతి మరణించకుండా ఏ శక్తి ఆపగలదు?

.... కారు ఎల్ కామినోరియల్ నుంచి స్కైలైన్ బౌల్ వార్డ్ వైపు సాగిపోతూ వుండగా అతను అనుకొన్నాడు.

ఇంకా తెల్లవారటానికి వ్యవధి వుంది. కొద్దిగా మంచు కురుస్తూంది. థర్ట్ స్ట్రీట్ లో వున్న పెద్ద భవంతి ముందు కాంటెస్సా ఆగింది.
విశాలమైన మెట్లు, కొద్దిగా తెరచి ఉన్న తలుపు. లోపలి యూనిఫారంలో ఉన్న గార్డులు.

ఓవర్ కోటు సవరించుకొంటూ మెక్ లోపలికి ప్రవేశించినాడు.

కారిడార్ లో లైట్లు వెలుగుతున్నాయి. అంతా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా వుంది. అక్కడక్కడా అసిస్టెంట్లు మౌనంగా తిరుగుతున్నారు. పెద్ద తుఫాను రావడానికి ముందున్న వాతావరణం అక్కడ నెలకొని వుంది. పది అడుగులు ఎత్తున్న చెక్క తలుపులు దగ్గరగావేసి ఉన్నాయి. నాబ్ తిప్పి, నెమ్మదిగా తెరిచేడు.. లోపల లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. మద్యలో ఓవల్ షేప్ లో పెద్ద బల్ల వుంది. చుట్టూ కూర్చొని వున్న వాళ్ళని వరుసగా చూసేడు.

అండర్ సెక్రటరీ టు ది డిఫెన్సు మినిష్టరు చార్లెస్ మ్క్డోనాల్డ్, ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్లమెంటరీ కమిటీ జాన్ నికల్సన్, సెక్రటరీ ఆఫ్ మెక్ చూపు పక్కకి కదిలి ఆగిపోయింది. అంత చలిలోనూ నుదిటిమీద చెమట పట్టింది. చేతులు రెండూ వళ్ళో పెట్టుకుని ముందుకు వంగి కాగితాల్ని పరిశీలిస్తూ ఒక వృద్దుడు అక్కడ కూర్చొని వున్నాడు.

అతడు ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ సెంట్రల్ కమిటీ ఆఫ్ కమ్యునిస్టు పార్టీ ఆఫ్ సోవియట్ రష్యా __ బోరిస్. ఎఫ్ కాస్టినోవా.

**********************************************************************

రెండు చేతులూ చెంపల కాన్చుకొని ఆలోచిస్తోంది శైలజ.

ఆమె ముందు ఇంటర్వ్యూ తాలూకు ఫైలూ, అభ్యర్దుల మార్కుల లిష్టూ వుంది.

ఆ రోజు రమణకి ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆమె ఏదో పని వుండి, ఆ రూంలోకి వెళ్ళింది. రమణని చూసి 'ఎక్కడో చూసినట్టు ఉందే' అనుకొంది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రాణి ఫోటో చూపించిన సంగతి.

ఆమె బయటకొస్తూంటే అతనన్న మాటలు వినిపించినయ్.

"ఇలాంటి ఇంటర్వ్యూ లుండవు, ఎయిర్ కండీషన్డ్ రూములుండవు.... ప్రశ్నలుండవు ... సమాధానాలుండవు."

ఆమెకి నవ్వొచ్చింది.

నిజానికి అతడు అంతకుముందు సమాధానాలన్నీ చక్కగా చెప్పేడు అతడి సబ్జెక్టు కాకపోయినా.

కానీ మేనేజిమెంట్ అభ్యర్థి ఇంకొకతను ఉన్నాడు, రికమెండేషనుకేండేటు. అతది నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. ఈ ఇంటర్వ్యూ కేవలం బయటవాళ్ళని సంతృప్తి పరచటానికే.

ఆమె లిష్టు చూసింది.

ఉద్యోగం ఇవ్వాలనుకున్న అభ్యర్థికి నూటికి తొంభై మార్కులిచ్చేరు కమిటీ సభ్యులు. రెండోవాడెవడో రామన్ అట, అతడికి యాభై మార్కులు వచ్చినయ్.

ఆమె రమణ పేరు కెదురుగా చూసింది.
సున్నా ఉంది.

ఆమె పేలవంగా నవ్వుకొంది.
నిజానికి అతను చెప్పిన సమాధానాలకి నూటికి నూరు రావాలి. కేవలం అతడికి ఉద్యోగం ఇవ్వటం ఇష్టంలేక అతణ్ణి రెచ్చగొట్టి, ఆ నెపం మీద సున్నా మార్కులిచ్చేరు.

రికమెండెడ్ కాండేడ్ క్వాలిఫికేషనువైపు చూసింది.

ఇంటర్మీడియట్ __ ఫస్ట్ క్లాస్.

ఆమెకి రమణమీద జాలివేసింది. సర్టిఫికెట్లు సర్దుకొంటూ అతడు నిస్సహాయంగా చూసిన చూపు ఆమెకింకా జ్ఞాపకం వుంది.

కానీ ఏం చేయగలదు__
__ ఫైలు సర్ది లోపలపెట్టి, ఆ రోజు పోస్ట్ తీసింది. ఒక్కో ఉత్తరమే చదవసాగింది.
నాలుగో ఉత్తరం చదువుతూ ఆమె ఉలిక్కిపడింది. ఉద్యోగం వచ్చిన అభ్యర్థి దగ్గర్నుంచి అది. 'ఇంతకన్నా మంచి ఉద్యోగం వచ్చినందువల్ల దీంట్లో చేరలేనందుకు విచారిస్తున్నాను' అని. రికమెండేషను ఉన్న వాడికి ఇంతకన్నా మంచి ఉద్యోగం రావడంలో ఆశ్చర్యం లేదు.

అయితే ఈ ఉద్యోగం ఇప్పుడెవరికి వస్తుంది?
రామన్ అనే మద్రాసీకి.
అంటే కమిటీ మెంబర్లలో ఎవరికీ రెండో కేండేట్ మీద ఇంట్రెస్టు లేదన్నమాట.

ఆమె మనసులోకి తెరలాగా ఒక ఆలోచన వచ్చి సన్నగా వణికింది.

అలా చేస్తే__
ఎవరికైనా తెలిస్తే __
ఎలా తెలుస్తుంది?
అయినా ఎందుకు చెయ్యాలి?
అన్యాయం జరిగిన ఒక యువకుడికి న్యాయం చేకూర్చటం కోసం.
అయినా రిస్కు....
....
పరస్పర విరుద్ద భావాల్తో ఆమె కొంచెంసేపు కొట్టుమిట్టు లాడింది. చివరకు ఒక నిర్ణయానికి వచ్చి కలం చేతిలోకి తీసుకొంది.
రామన్ అన్న ఇంగ్లీషు పేరుకి చివర 'ఎ' అన్న అక్షరం కలిసింది.

***********************************************************

ఒక పెద్దపులి రెండు కాళ్ళతో నడుస్తూ మీద మీదకి వస్తున్నది. మిగిలిన రెండు చేతులూ భయంకరంగా సాచి, గోళ్ళతో చీల్చి చెండాడటానికి ముందుకొస్తున్నది. కేక వేయబోయాడు. నోటి వెంబడి మాట రాలేదు. పరుగెత్తసాగేడు. వెనుకే పులి, ఆగి వెనక్కి చూసి మళ్ళీ పరుగెత్తసాగేడు. ఎంత పరుగెత్తినా అడవి తరగటం లేదు అడవి. అంతా అడవే. పులి వెనుకే వస్తున్నది.

చప్పున ఆగిపోయేరు. ఎదురుగా పెద్ద వాగు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. వెనక పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయి. చుట్టూ చూసేడు. చుట్టూ ఫైళ్ళు. పెద్ద పెద్ద చెట్లలా బీరువాలు, చెట్లకి ఆకులు లేవు. ఫైళ్ళు వేలాడుతున్నయి అర్డినరీ .... అర్జెంట్ .... ఇమ్మీడియట్ ... కాగితాలు లేస్తున్నాయి. దుమ్ము. పేపర్ బాస్కెట్‌లోంచి సుడిగాలిలా లేస్తున్న కాగితాలు
అంతా చుట్టూ చేరింది
వెనుకనుంచి పులి మీదకి దూకింది.
కెవ్వున అరిచేడు.

"ఏవండీ.....ఏవండీ...." అని తట్టి లేపింది జానకి.
ప్రకాశరావు కళ్ళు తెరిచేడు. వళ్ళంతా చెమట పట్టింది. మనిషి వణికిపోతున్నాడు.
"ఏమైందండీ?" అడుగుత్తూంది.

అతడు కొంచెంసేపు మాట్లాడలేదు. తరువాత బలహీనమైన కంఠంతో "మంచినీళ్ళు" అన్నాడు.

ఆమె లేచివెళ్ళి మంచినీళ్ళు తెచ్చి యిచ్చింది. వణుకుతూన్న చేతుల్తో అందుకొని గబగబా తాగేడు.
జానకికి భర్త సంగతి తెలుసు.
"ఏమైందండీ?" అని అడిగింది.
"కల, భయంకరమైన కల" అన్నాడు.
"ఏమిటి?"
కలని వర్ణించి చెప్పేడు.
"పులి రెండు కాళ్ళమీద నిలబడి వుందా?"
"ఆ....."రెండు కాళ్ళమీద మనిషిలాగే వుంది."
"మొహం పులిలాగే వుందా?"
"ఆ, పులిలాగే.... ఉహూ.... కొద్దిగా పులీ....కొద్దిగా మనిషీ.....అలా వుంది."
"మనిషి ఎలా వున్నాడు?"
"మా హెడ్ క్లర్క్ లా ఉన్నాడు"
ఆమెకి అతడిమీద జాలేసింది.
"ఆఫీసులో ఏదైనా గొడవ జరిగిందా....!"
అతనో క్షణం ఆగి అన్నాడు. "ప్రతిరోజూ వుండేదే, నాకు డ్రాఫ్టు వ్రాయటం కూడా సరిగ్గా రాదట. అందరిముందూ పట్టుకొని....నాకన్నా ప్యూన్ దస్తగిరి నయమట."

"లాగి పెట్తి కొట్టలేకపోయారా?"
"అంత ధైర్యమే వుంటే ఇంతవరకు ఎందుకొచ్చేది?"

ఆమెకి విసుగేసింది. "మరేం చేసేరు? చేతులు కట్టుకొని విన్నారా?"

"అతడు మా హెడ్ క్లర్కు!"

"అయితే నేమండి! వాడు మెట్రిక్యులేషన్ అయినా పాసవలేదని మీరే అన్నారు. మీరు యల్లెల్ బ్బీ. నిజంగా మీరు డ్రాఫ్టు చాలా బాగా వ్రాస్తారు. ఎస్సెన్సీ చదివిన నాకే అది ఎంతో ముచ్చటగా వుంటుంది. అటువంటిది మీ క్లర్క్ కి నచ్చలేదంటే అది వాడి ఓర్వలేనితనాన్ని సూచిస్తుందే తప్ప మిమ్మల్నేమీ కించపరచటంలేదు. మీరు చెయ్యాల్సిందల్లా వాడ్ని ఎదుర్కోవడమే. ఒక్కసారి తిరగబడండీ......! అప్పుడు చూడండి ఏమవుతుందో.... ఆఫీసరు కూడా మీ మాటే అవునంటాడు. మీలో మీరిలా కుంచించుకుపోవడం మొదలు పెడ్తే చివరికి మీ ప్యూన్ కూడా మీకు పని చెప్తాడు. కొంచెం బలం తెచ్చుకోండి! మనసు దిటవు పర్చుకోండి. పులి తాలూకు భయం ఎక్కడో లేదండి! మీ మనసులోనే వుంది. అసలే మీ ఆరోగ్యం మంచిది కాదు. దానికితోడు ఈ పాడు ఆలోచనలు ఒకటి, అన్నీ మర్చిపోండి ఇలా నా దగ్గరికి రండి. నా వళ్ళో తల పెట్టుకొని పడుకోండి! ఎందుకండీ భయపడ్తారు? మనం బ్రతుకుతున్నది భయపడటానికి కాదండీ, ఒక మాట చెప్పనా....."

చీకతి నెమ్మదిగా విచ్చుకుంటోంది. దూరంగా ఎక్కడో ఒక కోడి ప్రపంచాన్ని లేపుతుంది.

తూర్పు ఎర్రటి మేలిముసుగు సవరించుకొంటూ సూర్యుణ్ని ఆహ్వానించటానికి ఆయత్తమవుతూంది.
"మనిషి ఒక్కసారే చచ్చిపోతే ఫర్లేదండి. కానీ క్షణం క్షణం మానసికంగా చావకూడదు. మనిషి మాన్ససికంగా చావకూడదండీ."

**************************************************************************
"మనిషి సాంఘీకంగా చావకూడదయ్యా! అట్లా సాంఘీకంగా చచ్చిపోనివ్వకుండా వుండటానికే ఈ న్యాయస్థానాలూ, ఈ చట్టాలు, ఎట్లా దీస్కుంటడట నీ పొలం? చూద్దాం ఎట్లా దీస్కుంటాడో" అన్నాడు రంగారావు. అతడి అసలు పేరు రంగయ్య కొద్దికొద్దిగా రాజకీయాల్లో చేరేక పేరు రంగారావుగా మార్చుకున్నాడు. అతనికి మున్సబుకి పడదు. అందువల్ల రాజయ్యకి దగ్గరయ్యేడు.

"కోర్టులో చిన్న దావా పడేద్దాం. వాళ్ళందర్నీ మూడు చెరువుల నీళ్ళు తాగించే బాద్యత నాది."

"డబ్బున్నోడూ డబ్బున్నోడూ కొట్టుకునేటందుకైతే కోర్టు కావాల బాబూ! డబ్బున్నోడు డబ్బు లేనోడ్ని కొట్టేటంద్కు ఈడి కడుపు సాలు" అన్నాడు చేతులు కట్టుకొని రాజయ్య.

అతడు ఇల్లు కాలిన ఆసామీలా వున్నాడు. "అట్ల వదిలి వ్పెడ్తామంటయ్యా." అన్నాడు వెలిగించుకుంటూ రంగారావు. "యాభయ్ మందిని పోగెయ్యి, పొలంకాడ నిలబెడ్దాం. పంట ఎలా తోల్కెల్తాడో చూద్దాం."

"పోలీసోళ్ళని తీసుకొస్తడు బాబూ"
"న్యాయమనేది వుంది కదయ్యా."
"పోలీసోళ్ళు ఆయనేవుంటారు బాబూ!"

*********************************************************************
ప్రొఫెసరు అయోమయమ్ దగ్గర రమణ చేరి అప్పటికి నెలయింది. అతడి దగ్గర చెయ్యవలసిన పనేమీ లేదు. అతడెప్పుడూ ఏవో లెక్కలు కట్టుకొంటూ కూర్చుంటాడు. ఒక ఫ్లాస్కు నిండా టీ వుంటే చాలు. యింకేమీ అక్కరలేదు. ఆ నెలరోజుల్లోనూ ఒక్కసారి కూడా అతడు బయటికి రాలేదు. కేవలం రమణని కలుసుకోవడం కోసమే అతడి మనసులో ఈ రోజు బయటికి వెళ్ళాలన్న కోర్కె పుట్టినట్టుంది.

గదినిండా కాగితాలే. అంకెలు వేసిన కాగితాలు. స్క్వేర్లూ, రూట్లూ, అన్నీ వేలవేల సున్నాలమీదా, టు ది పవర్ ఆఫ ల మీద ఆధారపడిన అంకెలు అన్ని సబ్జెక్టుల కన్నా ఆస్ట్రానమీ ఎంత యింటరెస్టింగు సబ్జెక్టో అమ్త బోరింగు సబ్జెక్టు.

రమణకి అక్కడ వచ్చేది ఒక్కటే, ఎలుకలు, అవి చాలా సురక్షితంగా పెరుగుతున్నాయి అక్కడ. అప్పుడే రమణ స్నేహం కట్టేసేయి కూడా! ఎలుక దూరంగా నిలబడి పరామర్శిస్తోంది. ఇంకొకటి మీసాలు వూపుతూ వెక్కిరిస్తోంది. వాటికి అక్కడ మనుష్యులున్నా భయం ఏ మాత్రమూ లేదు. ఒకడు ప్రపంచాన్ని పరిత్యజించిన యోగి, మరొకడు ప్రపమ్చం మీద విరక్తి పెంచుకుంటూన్న యువకుడు. అందుకే అవి ఆ పెద్ద భవంతిలో __ రాజ భవనంలో పరిచారికల్లా తిరుగుతూ వుంటాయి.

ఆ ప్రొఫెసరు ఒక్కోసారి ఎంత తెలివిగా లెక్కలు కడ్తూ వుంటాడో, ఒక్కోసారి అంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ వుంటాడు. అతడ్ని చూసిన వాళ్ళెవరూ అతడు ఆస్ట్రానమీలో 'ఒకాయామా ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ' నుంచి సర్టిఫికేట్ పొందాడనీ, హార్ట్లాండు మాగ్నెట్ ఫీల్డులో రాయల్ ఆస్ట్రానమర్ గా నాలుగువేల పౌండ్ల జీతాన్ని వదులుకొని వచ్చి, ఆస్థి సర్వస్వం తగలేసుకొని యిలా మారుమూల ఉండి పోయేడని అనుకోరు. అయితే యింత తెలివైనవాడూ- ఎంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ వుంటాడో తెలియచెప్పటానికి, రమణకి పాత ఫైళ్ళలో దొరికిన యీ ఉత్తరాలు చాలు.

"ప్రియమైన భారతదేశపు ప్రధాని జగదీష్ చంద్రకి"
మీరు ఆరోగ్యంగా వున్నారని తలుస్తాను. మీ పాలనలో దేశమ్ సుభిక్షంగా వుందని కూడా భావిస్తున్నాను. ఈ మధ్య యింటినుంచి బయటకు కూడా కదలకపోవటమ్ వల్ల దాని సంగతి అసలు తెలియటంలేదు.

పోతే ముఖ్యమైన సంగతేమిటంటే నేను ఎల్లుండి డిల్లీ వస్తున్నాను. రెండ్రోజులు వుంటాను. వీలు చూసుకుని ఏదో ఒక సమయంలో మిమ్మల్ని కలుసుకొంటాను.
మిగతా విషయాలు సమక్షంలో.

వినమ్రతతో,
ప్రొ. ఆనందమార్గం.
పి యస్:- నేను అరగంట కంటే ఎక్కువకాలం మీతో గడపలేను, క్షమించగలరు."

__ ఈ ఉత్తరం చూసి రమణకి అరగంటవరకూ నవ్వు ఆగలేదు.

దీనికి జవాబు రానట్టుంది. మళ్ళి ఈయన దగ్గర్నుంచే ఇంకో ఉత్తరం కానీ,

"ప్రియమైన జగదీష్ చంద్రా......
నేను ఇంతకుముందో ఉత్తరం వ్రాసేను. అయితే కవర్ మీద అడ్రసు వ్రాసేనా అన్న అనుమానం వస్తూంది యిప్పుడు. ఏది ఏమైనా, మీ ఆఫీసు ముందున్న సెక్యూరిటీ గార్డులు నన్ను లోపలికి రానివలేదు. ఇక ఆ విషయం అలా పోనివ్వండి. మీరు వూరు వచ్చినప్పుడు నన్ను కలుసుకోండి. తప్పక కలుసుకోండి. అడ్రసు యీ ఉత్తరం కుడివైపునుంది.

అభినందనలతో,
ప్రొ. ఆ. మార్గం.

పి యస్. :- మా యింటి ముందు సెక్యూరిటీ గార్డులు లేరు. అయినా మీ రొచ్చేముందు ఉత్తరం వ్రాయండి. ఎందుకన్నా మంచిది కదా అది."

ప్రధానమంత్రి కార్యాలయంలో ఇలాంటి ఉత్తరాలకి జవాబు యివ్వటం సెకండ్ అసిస్టెంటు పని_ ఏ భాషలో వచ్చిన ఉత్తరమైనా అక్కడ తర్జుమా చెయ్యబడుతుంది. దాదాపు ముప్పాతిక పంతులు అక్కణ్నుంచే క్లియర్ చెయ్యబడతాయి. మిగతావి ఫస్టు సెక్రటరీకి వెళ్తాయి. ప్రధానమంత్రి సంతకాన్ని డూప్లికేట్ చేసే స్పెషల్ సిగ్నేచర్ మెషిన్ లో మిగతా ఉత్తరాలకి జవాబు యివ్వబడుతుంది. ఈ సంతకం అచ్చు ప్రధానమంత్రి స్వయంగా చేసినట్టూ వుంటుంది. అయితే ప్రొఫెసర్ గారి ఉత్తరం మొదట్లోనే ఆగిపోయింది.

ప్రధాన మంత్రి సచివాలయం,
న్యూడిల్లీ

"ప్రియమైన అయ్యా,

మీ ఉత్తరం అందింది. ప్రధానమంత్రి మిగతా ముఖ్య విషయాల్లో నిమగ్నులై వుండటం వల్ల మిమ్మల్ని కలుసుకోలేక పోయేరు.
అభినమ్దనల్తో__

ఇట్లు,
గోపాలకృష్ణ ఎగ్బోటే,
ఇన్ఫర్మేషన్ ఎడ్వైజరు."

**********************************************************

ఈ విధంగా వుంటుంది ప్రొఫెసర్ అయోమయంగారి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ.

రమణ చేరిన మొదటి నాలుగు రోజులూ యీ ఉత్తరాలు, మిగతా పేపర్లూ చదువుతూ కాలం గడిపేడు.

ఈ ఉత్తరం కొంచెం అర్థమై నవ్వు తెప్పించేవి కానీ, మిగతా రాతలు అర్థం లేనట్టు పిచ్చిగా వుండేవి.

అతడి అన్నిటికన్నా నచ్చింది ఈ వృద్దుడి అమాయకత్వం. అతడెంత తెలివైనవాడో అతడి మాటలు అంత అమాయకంగా ఉండేవి. అంత అమాయకుడు కాబట్టే లక్షల ఆస్థిని ఇనుపసామానుగా మార్చుకొని తన భావనాలోకపు ప్రపంచంలో పెట్టుకున్నాడు.

అతది చేతుల్లో చురుకూ, కళ్ళల్లో తేజస్సూ, మాటల్లో మంచితనం రమణని కట్టిపడేసేవి.

అయినా యీ ప్రొఫెసర్ గొడవలో పడి రమణ తన ఉద్యోగం సంగతి మర్చిపోలేదు. కనబడినచోటల్లా అప్లయ్ చేస్తూనే అస్తున్నాడు. అతదు ప్రొఫెసర్ దగ్గర చేరిన యిరవై రోజులకి ఓ సాయంత్రం పత్రికా ఆఫీసునుంచి, వచ్చి ఉద్యోగంలో చేరమని పోస్టులో ఆహ్వానం వచ్చింది.

ఇల్లంతా ఆనందం వెల్లివిరిసింది. ముసలాయన దగ్గుతూనే, ఉద్యోగమ్లో చేరిన కొత్తలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పి, పైన ఏమయినా దొరుకుతుందో లేదో అని ఎంక్వయిరీ చేసేడు. అన్నిటికీ ముక్తసరిగా సమాధానం ఇచ్చేడు రమణ. తండ్రితో ఎక్కువగా మాట్లాడడు రమణ. తండ్రి చరిత్ర అంతా అతనికి తెలుసు. ఎన్నాళ్ళ క్రితం అయితే సిఫిలిస్ అతన్ని పట్టుకుందో తెలియదు. ఈ దగ్గుకి కారణం కూడా అదేనేమో! అతడు గరర్నమెంటు హాస్పిటల్ కి వెళ్ళి ఎంక్వయిరీ చెయ్యలేదు. అతడి దృష్టిలో అతడి తండ్రి నైతికంగా ఎప్పుడో చచ్చిపోయేడు.

ఆ మరుసటిరోజు అతడు తన ప్రొఫెసర్ దగ్గరకు వెళ్ళి పత్రికాఫీసులో ఉద్యోగం వచ్చిన సంగతి చెప్పేడు.

ఆ తర్వాత మాలతి ఇంటికి వెళ్ళాడు.

"అయితే ఉద్యోగం వచ్చిందన్నమాట" అన్నాడు మాలతి తండ్రిపైవు చివర నిసిని చిటికెన వేలితో దులుపుతూ,

రమణ మాట్లాడలేదు.
".....ఎంత జీతం....."
దీనికీ సమాధానం చెప్పలేదు అతడు. అదంత పెద్ద సంఖ్య కాదు. మాలతి తండ్రే కుర్చీలోంచి లేస్తూ అన్నాడు_

మాలతి తండ్రే కుర్చీలోంచి లేస్తూ అన్నాడు.

"రెండొందలు, __ మూడొందలు కాకపోతే ఐదొందలు. అంతేగా, అది మా వంటవాడి జీతం."

రమణ మొహం ఎర్రబడింది.

"ఇంకెప్పుడూ ఇటువైపు రాకు" అన్నారాయన. "మాలతికి సంబంధాలు చూస్తున్నాం. నీ వల్ల దానికేదయినా అపకారం జరిగిందంటే, నీ రక్తం కళ్ళ చూడాల్సి వస్తుంది. " చాలా మామూలుగా సామాన్యంగా అన్నాడు.

అంత వ్యధలోనూ రమణకి నవ్వొచ్చింది. వెళ్ళబోతూ అన్నాడు. "అపకారం చెయ్యలన్న ఆలోచన నాకెప్పుడూ లేదండీ, అదే వుంటే మళ్ళీ యిలా మీముందు నిలబడే అవసరమే వచ్చేది కాడు. మాలతికి మైనారిటీ తీరిపోయిందని నాకు తెలుసు. మేమిద్దరం పెళ్ళిచేసుకోవాలనుకుంటే మీ డబ్బు గానీ మీ వెనుకున్న గూండాలుగాని దాన్ని ఆపుచేయలేరు. అయితే ఈ వివాహం జరగకుండా ఆపుతున్నది__ మనిషి నైతిక విలువలకి నేనిస్తున్న గౌరవం. అంతే....."
అతడు కదిలి బయటకొచ్చేడు.

పోర్టికోలో మాలతి నిలబడి అతడి గురించే ఆతృతగా చూస్తూంది.

ఆమె కళ్ళలో ఏదో చెప్పాలన్న తపన. అతడు ఆగేడు. ఆమె అతడివైపు చూసింది ఇద్దరి కళ్ళూ క్షణంసేపు కలుసుకున్నాయి.

జీవితం క్షణికం అయితే కావొచ్చు గానీ, క్షణం అస్తిత్వం లేనిది కాదు.

అతడు తలవమ్చుకొని ముందుకు నడిచేడు.
మనసంతా వికలమైంది.
చేతులు రెండూ ప్యాంటు జేబుల్లో పెట్టుకొని నడవటం సాగించేడు.
ప్రొఫెసర్ తో కొంచెంసేపు గడపటమే అతదికి ఈ మధ్య సంతోషాన్నిస్తూంది.
ఇంటి ఆవరనంలోకి ప్రవేశించాడు.

గ్రీన్విచ్ - ఉదయం ౬:౩౦

గడియారం పన్నెండు కొట్టింది. కాళ్ళు చాపి, వెనక్కి వాలి కూర్చున్నాడు ప్రొఫెసర్. అతది మొహం వాడిపోయి వుంది.

"అయితే వెళ్ళిపోక తప్పదా గ్రాడ్యుయేటూ?" అన్నాడు.
రమణ మాట్లాడలేదు.
"అవున్లే అక్కడ జీతం వస్తుందిగా, అయితే ఇంతకీ ఎప్పుడు వెళుతున్నావు?"

"ఎల్లుండి చేరదామనుకుంటున్నాను."

"నా దగ్గర పని చేసినట్టు సర్టిఫికెట్టు ఇవ్వమంటావా?"

రమణ నవ్వాపుకొని "వద్దు" అన్నాడు.

ప్రొఫెసర్ లోపల్నుంచి ఓ చెక్కు పట్టుకొచ్చేడు. "ఇంతకన్నా ఏమీ ఇవ్వలేను. ఉంచుకో" అన్నాడు. రమణ ఆ చెక్కుని చూశాడు. "సైన్స్ టు డే" వాళ్ళు పంపిన చెక్కు అది. ఈ మతిలేని ప్రొఫెసర్ కుదురుగా కూర్చొని ఒక రాత్రంతా వ్రాసి సంపాదించిన డబ్బు. తన కోసం.....

అతదికి కళ్ళవెంట నీరొచ్చింది. ఆ క్షణం అన్నీ వదిలేసుకుని ఇక్కడే వుమ్డిపోదామా అనుకున్నాడు. కానీ జీవితం సెంటిమెంట్ల కథ కాదు. ఇంట్లో పరిస్థితి వెన్నుతట్టి లేపుతోంది. మౌనంగా చెక్కు అందుకున్నాడు.

అతడి మనస్సు శూన్యమైంది.

*************************************************************************

శూన్యమైన విశ్వంలో ఇన్ని కోట్ల కోట్ల గ్రహాలూ, నక్షత్రాలూ ఎలా ఏర్పడ్డాయి? అన్న ప్రశ్నకి చాలా మంది శాస్త్రవేత్తలు రకరకాల థియరీలు చెప్పారు. ఏదీ సంతృప్తికరంగా లేదు. ప్రకృతి శోధించటానికి మనిషి మేథస్సు సరిపోవడంలేదు. మనం చూసేది ఒక సూర్యుడ్ని, విశ్వంలో మనకి కనపడని సూర్యుళ్ళు కోట్లు.

మనం 'ఆకాశగంగ' అని పిలిచే నక్షత్రాల సముదాయం కొన్ని లక్షల నక్షత్రాల గుంపు. అందులో దాదాపు రెండు వందల మిలియన్ ల నక్షత్రాలున్నాయని అంచనా.

ఇన్ని కోట్ల నక్షత్రాలూ ఒక బిందువు చుట్టూ పరిభ్రమిస్తున్నయ్ భూమి తన చుట్టూ తిరగటానికి ఒకరోజు పట్టినట్టే, ఇవి ఒకసారి తిరగటానికి రెండు మిలియన్ల సంవత్సరాలు పడుతుంది.

******************************************************************************

రమణకి ఆ ఆవరణలో నచ్చేది అన్నిటికన్నా ఒకటుంది. అది టెలిస్కొప్. చిన్నపిల్లవాడు ఆట వస్తువుతో ఆడుకొన్నట్టూ అతడు తరచు దాన్లోకి చూస్తూ వుండటం అలవాటు చేసుకున్నాడు. ముఖ్యమైన నక్షత్రాలనీ, చంద్రుడితో లెయాబ్ నిట్జ్ కొండనీ గుర్తించటం నేర్చుకున్నాడు.

ఆ రోజు మంగళవారం.

ప్రొఫెసర్ తన మామూలు ధోరణిలో లెక్కలు వేసుకుంటూ కూర్చొన్నాడు. రమణ స్కోప్‌లో చూస్తూ వుంటే ఒక బంతి లాంటి ఆకారం దక్షిణ దిశలో కనబడింది. నారింజపండు ప్రమానంలో వుందది. చాలా వేగంగా ఉత్తర దిశగా సాగిపోతుంది. మామూలు కంటికి కనిపించటంలేదు.

కనిపించని ప్రతి దాని గురించి మొదట్లో అతడు ప్రొఫెసర్ ని అడిగి తెలుసుకొనేవాడు. ప్రొఫెసరికి ఈ విషయాల్లో జ్ఞాపకశక్తి ఎక్కువ. ప్రతి నక్షత్రపు పేరునీ, గ్రహాల పేర్లనీ చెప్పేవాడు. కానీ తన ఈ కుతూహలం ప్రొఫెసర్ పనిని మాటిమాటికీ చెడగొడుతూందని గ్రహించి అడగటం మానుకున్నాడు. ఆ భావంతోనే నారింజపండు ఆకారపు బంతి గురించి అతడు అడగలేదు.

కాని మళ్ళీ మరుసటిరోజు అదే సమయంరోజు అదే సమయానికి అది కనబడింది. ఈసారి అది ఫుట్‌బాల్ సైజులొ వుంది. కానీ టెలిస్కోప్ నుంచి కాకుండా మామూలుగా కనపడటంలేదు. మరింత వేగంతో అది ఉత్తరదిశగా సాగి పోతోంది. ఈసారి ఇక అతడు కుతూహలం ఆపుకోలేక ఫ్రొఫెసర్ ని పిలిచి చూపించాడు.

ప్రొఫెసర్ చాలాసేపు దాన్ని గమనిస్తూ వుండిపోయేడు. అరగంటలో అది ఉత్తర దిశలో అదృశ్యమైపోయింది.

"ఎన్నాళ్ళనుంచి దీన్ని చూస్తున్నావు?" టెలిస్కోప్ ఆవరణలో నుంచి బయటకు వస్తూ అడిగేడు ప్రొఫెసర్. అతడి మొహంలో ఏ భావమూ లేదు.

"నిన్నట్నుంచి, కానీ నిన్న ఇది ఇంకొంచెం ఎక్కువసేపు కనబడింది. కొంచెం చిన్న సైజులో" అన్నాడు రమణ. "ఏమిటది?"

క్షణం మాట్లాడలేదు ప్రొఫెసర్. తరువాత సాలోచనగా అన్నాడు "ప్రాక్సియా సెమ్క్చువరీ....."

రమణకి దాని గురించి తెలుసు. భూమికి దగ్గరగా వున్న నక్షత్రం అది, దగ్గరగా అంటే ... సూర్యుడికీ భూమికీ దూరంగా అంగుళం అనుకొంటే, భూమికీ నక్షత్రానికి మధ్యనున్న దూరం నాలుగు మైళ్ళు. అంత దగ్గర.

"ఇంతకుముందు టెలిస్కోపులో అంత పెద్దదిగా కనిపించేది కాదు, ఇప్పుడెందుకు కనిపిస్తుంది?" అడిగేడు.

"ఇంకో రెండు రోజులు పోతేగానీ ఏమీ చెప్పలేను."

ఆ రెండ్రోజులూ రమణ తన ఆఫీసులో చేరే సన్నాహాల్లో ఉన్నాడు. హెల్తు సర్టిఫికెట్లు, ఒరిజనల్స్ చూసుకోవటంతో కాలం గడిచి పోయింది.
ఆ రోజు రమణ అక్కడ పని చెయ్యడానికి ఆఖరి రోజు.

పదకొండు గంటలవేళ, వ్రాస్తున్న కాగితాలలోంచి తలెత్తి "అర్థమయింది " అని అరిచేడు ప్రొఫెసరు.

రమణ అతడివేపు చూసేడు.

"ప్రాక్సిమా సెంక్చువరీ గురించి" అన్నాదు ప్రొఫెసర్. "భూమికి కొన్ని కోట్ల మైళ్ళ దూరం వున్న ఆ నక్షత్రం నాలుగు రోజుల క్రితం ముప్పై అయిదు నిమిషాలపాటు కనిపడింది. అది కనబడే సమయం రోజుకి నిముషం పాటు తగ్గుతూ వస్తూంది. భూమి డయామీటరు దాదాపు ఎనభై లక్షల మైళ్ళు....." అంటూ తన పేపర్లవైపు చూస్తూ ఆగేడు.

"....దాదాపు ఎనిమిది గంటల కాలం కనబడాల్సిన ఆ నక్షత్రం ఇంత తొందరగా వచ్చి వెళ్ళిపోవటానికి కారణం ఏమిటి?" చాలా సింపిల్ థియరీ. ట్రైన్ లో వెళుతున్నప్పుడు దూరంగా వున్న చెట్టు దగ్గరగా వున్న చెట్టుకన్నా ఎక్కువసేపు కనబడుతుంది అంతే కదా__"

రమణ నవ్వేడు. ఆ నక్షత్రం పూర్వం కన్నా దగ్గరగా వచ్చిందంటారా? అన్నాడు

రావటం కాదు. వస్తూ వుంది. ఇంకా వస్తూ వుంది. రోజుకి నిముషంపాటు అది కనపడటంలో తేడా వస్తూంది కదా! ఎనిమిది గంటలు కనపడేదల్లా అరగంటే కనపడుతూం దిప్పుడు. అంటే చాలాకాలం క్రిందటే అది తన ప్రయాణం ప్రారంభించి ఉండాలన్నమాట. దాదాపు నెల రోజుల క్రితం ప్రస్తుతం భూమి చుట్టూ అది ఇరాఇ అయిదు నిమిషాల్లో ప్రక్షిణం చేస్తూంది. అంటే పదివేల మిలియన్ల మైళ్ళ దూరానికి వచ్చిందన్నమాట."

"ఇంత పెద్ద మార్పుని ఇంతవరకూ ఎవరూ గమనించలేదంటారా?"ఆదిగేడు రమణ.

"ఆ అనుమానం నాకు నిన్ననే వచ్చింది. కొన్ని పాత సామానులుంటే అమ్మేసి, గ్రీన్వీచ్ అబ్జర్వేటరీకి మాంఛెస్టర్ యూనివర్శిటీలో మౌంట్‌కి ఫోన్ చేసేను."

"ఏమన్నారు వాళ్ళు__?"

ప్రొఫెసర్ పై కపుకేసి క్షణంపాటు చూసి కళ్ళు దించుతూ "దాదాపు నెల రోజుల క్రితం అబ్జర్వేటరీస్ అన్నీ మూసెయ్యమని ఆర్డరొచ్చిందంట!" అన్నాడు.

ఇద్దరూ చాలాసేపు మాట్లాడలేదు.

గది అస్తవ్యస్తంగా వుంది. ప్రొఫెసర్ వర్క్ చేసిన కాగితాలు చెల్లాచెదురుగా పడి వున్నాయి. ఎలుక ఒకతి కాళ్ళ సందులోంచి పరుగెత్తుకు వెళ్ళిపోయింది.

నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ప్రొఫెసర్ లేచి "పద, టీ తాగుదాం" అన్నాడు

ఇద్దరూ బయటి కొచ్చేరు. తలుపు లాగగానే ఆటోమేటిక్ లాక్ పడిపోయింది. బయట చిన్న నాబ్ తిప్పి, తలుపు దగ్గరగా వేస్తే లాక్ పడిపోయే ఏర్పాటున్న తలుపు అది.

రోడ్డు నిర్మానుష్యంగా వుంది. బాగా ఎండగా వుంది.

"ఈ మధ్య నాకు మాటిమాటికీ బయటికి రావాలనిపిస్తోంది" అన్నాడు ప్రొఫెసర్. "ఇంతకు ముందు ఆర్నెల్ల కొకసారి ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టేవాణ్ని. ఇప్పుడు చూడు... క్రిందటి నెల వచ్చాను మళ్ళీ ఇప్పుడు రావాలనిపించింది."

"నేను మీకు కలవాలని వ్రాసి పెట్టి వుంది ఆ రోజు. అందుకే వచ్చారు...." అన్నాదు రమణ.

"మళ్ళీ ఈ రోజు నిన్ను సాగనంపటానికి వస్తున్నాను."

రమణ మాట్లాడలేదు.
ఇద్దరూ ఇరానీ హోటల్లో కూర్చున్నారు. రెండు సింగల్ ఛాయలకు ఆర్డరిచ్చేరు. హోటల్ రష్ గాలేదు. నాలుగు రోడ్లు కలిసే చోటులో వున్నా, పక్కనే యింకో పెద్ద హోటల్ వుండటంవల్ల దీనికెవరూ రారు. గల్లా పెట్టె వద్ద కూర్చొన్నవాడు కునికిపాట్లు పడుతున్నాడు. రమణ చుట్టూ చూసి, తల తిప్పేసరికి ప్రొఫెసర్ నీటిచుక్కతో చూపుడు వేలు ముంచి టేబుల్ మీద బొమ్మ వేస్తున్నాడు. ఇంతలో టీ వచ్చింది. ఇంట్లో ఇంకో వేలు ముంచి ఇంకో చుక్క పెట్టేడు. "ఇది భూమి" అన్నాడు.

ప్రొఫెసర్ సంగతి తెలిసిన రమణ మౌనంగా టీ తాగసాగేడు.

"బ్రెస్సెల్ థీయరీ సంగతి తెలుసునా?" అడిగేడు ప్రొఫెసరు, తెలీదన్నట్టూ తల అడ్డంగా వూపేడు రమణ.

"ఒక నక్షత్రం మనకి ఎంత దూరంలో వున్నదీ తెలుసుకోవటానికి అతడు లెక్క చెప్పేడు. ఇదుగో ఈ పచ్చటి చుక్క భూమి అనుకో. ఈ నీటి చుక్క నక్షత్రం. ఈ రోజు అది ఇరవై ఎనిమిది నిమిషాలు కనబడింది. నిన్న ఇరవై తొమ్మిది నిముషాలు. దీని స్థానభ్రంశం, సూర్యుడు భూమికి దూరంగ వున్న రోజు జరిగి వుంటుంది. అంటే ఏ రోజు?"

"జూన్ ఇరవై ఒకటో తారీఖు?"

"కరెక్ట్, ఈ నక్షత్రం దాదాపు ముప్పై అయిదు రోజుల్లో కొన్ని కోట్ల మైళ్ళు ప్రయాణంచేసి ఉత్తరం నుంచి దక్షిణ దిశగా వెళ్తూంది. అయితే ఓ అనుమానం వుంది. మనం మామూలు టెలిస్కోపులో కనుక్కొన్న ఈ విషయాన్ని అంతకన్నా అధునాతనమైన పరికరాలు అంటే అల్ట్రావాయిలేట్, ఎక్ష్రే, రేడియో, టెలీస్కోపులలో మిగతావాళ్ళు ఎందుకు కనుక్కోలేదు....? కొంచెం షుగర్ పట్రా వెయిటర్ బాబూ.... ఇదిగో ఈ నక్షత్రం యీ యాంగిల్ లో వస్తూంది. భూమి యిటు వెళ్తూంది...."

వెయిటర్ పంచదార కప్పు తెచ్చి బల్లమీద పెట్టి వెళ్ళిపోయాడు. నస్యం పట్టినట్టు దాన్ని కొంచెం తీసి బల్లమీద పోసేడు. "ఇది సూర్యుడు ...." అన్నాడు.

ఈ పిచ్చి చేస్టల్ని ఎవరన్నా చూస్తున్నారేమోనని కనుకొలుకుల్లోంచి చుట్టూ చూశాడు రమణ.

" ఈ నక్షత్రం ఇలా వెళ్ళే సమయానికి....." అంటూ ప్రొఫెసరు గీత గీశాడు. "సూర్యుడికి ఈ పక్కగా భూమి వస్తుంది. ఇంకోలా చెప్పాలంటే భూమికి దాదాపు యాభై లక్షల మైళ్ల దురంనుంచి ఈ నక్షత్రం ప్రక్కగా దూసుకుపోయి అనంతమైన విశ్వంలోకలిసిపోతుంది. నెలరోజులు ప్రయాణం చేసిన ఆ నక్షత్రం దాదాపు నాలుగు కోట్ల కోట్ల మైళ్ళు పయనించింది. ఆ వేగం అలాగే కొనసాగితే, అది భూమికి అత్యంత సమీపంలోకి రావడానికి ఇంకా ఇరవై రోజులు- అంటే ఆగష్టు పదిహేడో తారీఖు అవుతుందన్నమాట. నా లెక్క సరి అయితే ... ఈ టీ చల్లారి పోయింది. ఇంకో టీ తెప్పించు... నా లెక్క కరక్టయితే సరిగ్గా ఆ రోజు పదకొండుగంటల పదినిముషాలకి ఈ దూసుకుపోవడం జరుగుతుంది."

వెయిటరు వచ్చాడు "ఇంకో టీ" అన్నాడు రమణ. వెయిటర్ వెళ్ళి పోయాడు.

"ఆగష్టు పదిహేడు. పగలు .... పదకొండు గంటల పదినిముషాల మూడు సెకండ్ల వరకూ ఆ నక్షత్రపు అయస్కాంత ప్రభావం భూమి మీద పడుతుంది."

వెయిటర్ టీ తీసుకొచ్చేడు.

"పడితే ఏమవుతుంది....!" అడిగాడు రమణ.

"ఏమవుతుంది, భూమి ఫెటేలున పేలిపోతుంది... ఇదిగో వెయిటర్ ఇందులోనూ షుగర్ తక్కువగాను వుంది."

రమణకి ఓ క్షణం ఏమీ అర్థంకాలేదు. ప్రొఫెసరు స్పూనుతో టీ కలుపుతున్నాడు. సాయంత్రం సరదాగా వచ్చిన వాడిలా తాపీగా వున్నాడు. రమణకి నవ్వొచ్చింది. బలవంతంమీద ఆపుకుంటూ "అయితే మనందరం చచ్చిపోతామా ప్రొఫెసర్ గారూ! " అని అడిగాడు.

"ఇంకా నిర్ధారణాగా చెప్పలేను" అన్నాడు.
ఇద్దరు లేచి బయటకు వచ్చారు.

"మళ్ళీ ఎప్పుడు కలుస్తావు గ్రాడ్యుయేటూ?" ప్రొఫెసర్ కంఠంలో కనపడిన ఆర్తి అతడ్ని విచలితుడ్ని చేసింది. ఏ ప్రాపంచిక విషయమూ పట్టని ఈ వృద్దుడు, తన మీద అభిమానాన్ని పెంచుకున్నాడంటే అది తన అదృష్టం. ఈ నెలరోజుల సాంగత్యంలో తనకి తెలిస్యని ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. భూమి గురించి, నక్షత్రాల గురించీ....

"తొందర్లోనే మీ ఇంటికి వస్తాను."

"రావాలనే ఆశిస్తాను. వెళ్ళొస్తాను గ్రాడ్యుయేటూ. నీ భావి జీవితం శుభప్రదమగుగాక!" అని తిరిగి వెళ్ళిపోయాడు. చాలా నెమ్మదిగా, బలహీనంగా నడుస్తూ వెళ్ళీపోతున్నాడు ఆ వృద్దుడు. అతడు కనుమరుగయ్యేవరకూ అలా చూస్తూ నిలబడ్డాడు. తరువాత ఇంటివైపు కదిలాడు. అతడు ఇల్లు చేరుకొనేసరికి రాత్రి ఏడయింది. మనసులో ఏదో అసంతృప్తి .

... కాళ్ళు కడుక్కొని భోజనానికి కూర్చొన్నాడు.

"రేపు జాయినవుతున్నావా?" వడ్డిస్తూ అడిగింది జానకి. తలూపేడు.

"ఏమన్నాడు మీ అయోమయంగారు?"

"చాలా బాధపడ్డాడు. మళ్ళీ తొందర్లో వచ్చెయ్యమన్నాడు."

జానకి నవ్వి. "జీతం మాత్రం ఏమీ ఇవ్వడటనా?" అంది. రమణ మాట్లాడలేదు. భొజనం చేసి పుస్తకం చదువుతూ కూర్చొన్నాడు.
దూరంగా తొమ్మిది కొట్టింది.
ప్రకాశరావు ఇంకా రాలేదు. అతడికి బ్రాకెట్ల పిచ్చి వుంది. క్లోజింగ్ వచ్చేవరకూ రాడు.

వేసవికాలం అయిపోయినా ఇంక వర్షాలు కురవటంలేదు. పగలు బాగా ఎండగా వుంటోంది. రమణ పక్క బయతవరండాలో వేసుకున్నాడు. రేపట్నుంచీ తనో ఉద్యోగి, నెలతిరిగేసరికి జీతం అంటే వేలువేలు కాదు. కానీ ఇంత హినంగా బతకక్కర్లేదు. వేన్నీళ్ళకు చన్నీళ్ళు తోడు, మరి మాలతి సంగతి ఏమిటి? ఒక పరిష్కారం ఆలోచించాలి.

తల క్రింద చేతులు పెట్టుకొని వెల్లకిలా పడుకొన్నాడు. చల్లటిగాలి అలలు అలలుగా వచ్చి మనస్సు సేద తీరుస్తోంది. ఆకాశం నిర్మలంగా వుంది. నక్షత్రాలు తళతళా మెరుస్తున్నాయి. కొన్ని మినుకు మినుకు మంటూ, కొన్ని ప్రకాశవంతంగా.

నక్షత్రాలు

కోట్ల కోట్ల నక్షత్రాలు.

అలాగే పడుకొని, తల కొద్దిగా పక్కకి తిప్పి చూసేడు.
ఉత్తర దిక్కుగా మిగిలిన వాటికంటే ప్రకాశవంతమ్గా ఒక నక్షత్రం.
ప్రాక్సిమా సెంక్చువరీ.....!!

***************************************************************************
ఆగష్టు ఒకటి

రమణ ఉద్యోగంలో చేరి అప్పటికి నాలుగు రోజులైంది. ఆరోజు అతనికి నాలుగు రోజులు జీతమూ వచ్చింది. నలభై రూపాయలు. చాలా తక్కువ. అయినా అందులో ఎంత ఆనందం వుందో ఆ మొదటి జీతం అందుకున్న వాళ్ళకే తెలుస్తుంది.

నలభైలో పదిహేను పెట్టి గోపీకి చొక్కా కొన్నాడు, వదినకి ఏం కొనాలో తోచలేదు. స్వీట్లు కొన్నాడు. అతది మొహం ఆనందంతో వెలిగి పోతోంది. ఎవరెస్టు అధిరోహించినంత ఆనందంతో వున్నాడు.

ఇంటికొచ్చి చొక్కా గుడ్డ, స్వీట్లూ ఇచ్చేడు. మిగతా డబ్బులో ఓ అయిదు వుంచుకొని, మిగతావి వదిన కిచ్చాడు.
"నీ దగ్గరే వుంచవయ్యా" అంది జానకి.
"ఎలాగూ బస్సు ఖర్చులకనీ, లంచ కనీ తీసుకుంటాను వదినా!" అన్నాడు. ఆమె నవ్వి లోపలికి వెళ్ళిపోయింది.
సాయంత్రం ఆరయింది.

రమణ బట్టలు మార్చుకొని బయటకొచ్చేడు. జేబులో అయిదు రూపాయలున్నాయ్. హోటల్ కొచ్చేడు. ప్రొఫెసరుని మొదటిసారి కలుసుకున్న హోటల్.
రెండు కేకులు కొన్నాదు.
అవి తీసుకుని ప్రొఫెసర్ పురాతన భవనంవైపు నడిచేడు. అతడు అక్కడికి చేరుకొనేసరికి ఆరుంబావయింది.
తలుపు తీసే వుంది. లోపలికి నడిచి, తలుపు బలంగా వేసేడు. తరువాత జ్ఞాపకం వచ్చింది. తలుపు బలంగా వేస్తే బయట లాక్ పడుతుందని మళ్ళీతిసి చూసేడు, అదృష్టవశాత్తూ లాక్ పడలేదు.

అతడు లోపలికి వెళ్ళేసరికి ప్రొఫెసర్ యథాప్రకారం కాగితాలు ముందేసుకొని కూర్చొనివున్నాడు. రమణని చూసి "రా! గ్రాడ్యుయేటూ... రా!" అని ఆహ్వానించేడు. " ఆ నక్షత్రం గురించి ఇంకా కొన్ని విషయాలు సేకరించేను."

"నక్షత్రాల సంగతి తర్వాత. ముందీ స్వీటు తినండి. నా మొదటి జీతంతో కొన్నది" అని కేకు అందించేడు.

"రెండూ నేనే తింటే నేకేమన్నా అభ్యంతరమా? భోజనం చేసి మూడ్రోజులైంది....."

రమణ చప్పున తల తిప్పుకొని కళ్ళ నీళ్ళ కనబడనివ్వకుండా "తినండి" అన్నాడు రుద్దమైన కంఠంతో.

అతడు ఆత్రంగా తినటమ్ పూర్తి చేసి, "ఊ __ చెప్పు ఏమిటి విశేషాలు?" అని అడిగేడు.

"మీరే చెప్పాలి?"

ప్రొఫెసర్ తన కాగితాల వైపు క్షణం తదేకంగా చూశాడు. "నేను చెప్పేది ఏదైనా వుంటే అది ఆ నక్షత్రం గురించే ...." అన్నాడు. "దాంట్లో వేడి అంతగా లేదన్నది తేలిపోయింది. ఎందుకంటే __ ఏ మాత్రం వేడి వున్నా మనం ఈ పాటికి మసి అయిపోయి వుండేవాళ్ళం. పోతే అయస్కాంత శక్తి సంగతి తేల్చాలి."

రమణ మాట్లాఅలేదు. అతని కిదంతా అర్థరహితంగా కనబడింది. ముందు సంగతి వేరు. అప్పతికి ఉద్యోగం లేదు. కానీ ఇప్పుడు చాలా పనులున్నాయి.
అతడా ఆలోచన్లలో ఉండగానే ప్రొఫెసర్ ఓ కాగితం తీసిచ్చాడు. "నేను వ్రాసిన ఉత్తరానికి ఓ కాపీ వేసి ఉంచాను" అన్నాదు. రమణ దాన్ని అందుకొని చదవసాగేడు."

"ప్రియమైన ప్రధానమంత్రి జగదీష్ చంద్ర గారికి,

నేను క్షేమమే, మీరూ క్షేమనే అని తలుస్తాను. లోగడ నేను మీకో ఉత్తరం వ్రాసి వుంటిని. మీరు ఈ మహ్య ఇటువైపు రాలేదా? పోనీ లెండి. మీకో ముఖ్యమైన విషయం చెబుదామని ఈ ఉత్తరమ్ రాస్తున్నాను. ప్రాక్సిమా సెంక్చువరీ భూమివైపు వస్తున్నది. ఆ విషయమ్ మీకు చెబ్దామని ... మరి వుంటాను.

అభినందనల్తో__
ప్రొఫెసర్ అయోమయం.

పి.యస్. :- ఈ నక్షత్రానికి గానీ ఆకర్షణ శక్తి వున్నట్లయితే భూమ్మీద వస్తువులు వెళ్ళి దానికి అతుక్కుంటాయి.

రమన ఉత్తరం మడిచి ఇచ్చేశాడు. లాభంలేదు ఈ మతి లేని ప్రొఫెఅరు మెదడుని సరిచెయ్యలేరు. పదిహేనేళ్ల అమ్మాయిలు అభిమాన నటులకి వ్రాసినట్టు ఈయన ప్రైమ్‌మినిస్టరు ఆఫ్ ఇండియకి వ్రాస్తున్నాడు. పెర్వర్షన్ అంటే ఇదే కాబోలు.

*************************************************************************

గోపాలకృష్ణ ఎగ్బోటే చేతిలో ఆ ఉత్తరం వుంది. దాన్ని చూసి అతదు చాలాసేపు నవ్వుకొన్నాడు. ప్రధానమంత్రికి చాలా రకాలయిన ఉత్తరాలు వస్తూంటాయి. కొన్ని తిడుతూ, కొన్ని దేశ సమస్యల గురించీ, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్సూ, అభ్యర్థనలూ__ఇలా అప్పుడప్పుడు ప్రేమలేఖలు కూడా.

కానీ ఇలాంటి ఉత్తరాలు రావటమ్ మాత్రం చాలా తక్కువ.

అతడి ముందు 'రాక్' లు చాలా వున్నాయి. ఒకటి ఫస్టు సెక్రటరీకి వెళ్ళల్సిన ఉత్తరాలు. వాటిలో కొన్ని ఏరి, ఫస్టు సెక్రటరీ ప్రధాన మంత్రికి పమ్పుతాడు. రెండో రాక్‌లో తను జవాబు వ్రాయాల్సిన ఉత్తరాలు పడేస్తాడు. మూడో రాక్ లో ఉత్తరాల మీద ఏ చర్యా తీసుకోవల్సిన పని లేదు.


ప్రొఫెసరు ఉత్తరం మూడో రాక్ చేరుకొంది.

మూడు 'రాక్స్'లోకి ఉత్తరాలు విడదీసిన తర్వాత మొత్తం మూడు ఫైళ్ళూ ప్రధానమంత్రికి వెళతాయి. ఫైలు మత్రం ఆయన చుడదలుచుకుంటే పరిశీలించటానికే.

ఈ ఉత్తరాలు చూడటానికే ఆయన దినచర్యలో టైము ప్రొద్దున్న తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకూ.

అగష్టు ఒకటో తారీఖు. తొమ్మిదిన్నరకు ఆయనకి పార్టీ చీఫ్ అవినాష్ తో అప్పయింట్ మెంటు వుంది. అంటే ఉత్తరాలు చూడటం పూర్తి అయ్యేక.

తొమ్మిదిన్నర వరకూ మామూలుగానే ఆయన మొదటి ఫైలు నెట్టేసేడు.

అవినష్ ఇంకా రాలేదు.

సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో రావాల్సిన వాళ్ళ ఆలస్యం ఉండదు. ఒకవేళ అలాంటిదేదయినా ఉంటే, ఇంకో విజిటర్ ని పంపటం జరుగుతుంది. ఈ చిన్న చిన్న విజిటర్లు రెండు మూడు నిమిషాల వ్యవషిలో తమ సంభాషన ముగించాల్సి ఉంటుంది.

అయితే అవినాష్ తో యీ చర్చ దాదాపు గంటసేపు జరగాల్సి వుంది. ప్రతిపక్షం చాలా బలంగా వుంది. పార్టీ ఏ క్షణమైనా మెజరిటీ పోగొట్టుకొనేలా వుంది. అందుకే ఆ రోజు చాలా కీలకమైన చర్చ్ జరగబోతూ వుంది.

పార్టీ చీఫ్ ఇంకా రాలేదు.
తొమ్మిదీ ముప్పై అయిదు.

సాధారణంగా యిలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, ప్రజల ఆసక్తిని పక్కకి మళ్ళించే సంఘటనల్ని ప్రభుత్వం చేపట్టాలి. దాన్ని గురించి చర్చించటానికే చీఫ్ వస్తున్నది.

తొమ్మిదీ నలభై.

ప్రధానమంత్రి విసుగ్గా రెండొ ఫైలు ముందుకు లాక్కున్నాడు. సెకండ్ అసిస్టెంట్ ఆన్సర్ చెయ్యవలసిన ఉత్తరాలు. సావనీరుకి అభినందనలు పంపమనీ__ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రమ్మనీ __ ఇలాంటివి.

ఫైలు పడేసి వెనక్కి వాలబోతూ, మూడు ఫైలు చూసేడు. ఓ కాగితం క్రిందికి జారి, చివర్లో పి.ఎస్. కనబడుతూంది. ప్రధానమమ్త్రికి పి.ఎస్. వ్రాసేదెవరా అని కుతూహలంతో ఉత్తరాన్ని బయటకి లాగేడు. ...." ఆ నక్షత్రానికి ఆకర్షణ శక్తి ఉన్నట్లయితే భూమ్మీద వస్తువులు దానికి వెళ్ళి అతుక్కుంటాయి __"

చాలాసేపు దానివైపే తదేకంగా చూస్తూ ఉండిపోయేడు ఆయన.

ప్రతి ఉత్తరానికీ చివర్లో పి.ఎస్. లు వ్రాసే మతిలేని ప్రొఫెసర్ అలవాటు, ఈ కథని ఇంకో మలుపు తిప్పటానికి ఉపయోగపడింది. చాలా విచారకరమైన మలుపు.

"ఇండియన్ టైమ్స్ " అన్న దినపత్రిక ఆంధ్రప్రదేశం నుంచి వెలుపడుతుంది. చాలా తక్కువకాలంలో అది ఎక్కువ అమ్మకాన్ని సాధించగలిగింది. దానికి కారణం అది ప్రచురించే అతిశయోక్తులు. మామూలు విషయాన్ని కూడా అందంగా, చదివేవారికి కుతూహలం కలిగించేలా ప్రకటిస్తూ ఉంటుంది. నలుగురు చాకుల్లాంటి సబ్ ఎడిటర్లున్నారు. మిగతా దినపత్రికలకి అందని విషయాల్ని కూడ సేకరించి వీళ్ళు ప్రచురిస్తూ ఉంటారు. వాళ్ళలో ఒకామె శైలజ.

రమణ ఆ రోజు మామూలుగా లంచ్ అవర్‌లో టీ తాగి వచ్చి, తన సీట్లో కుర్చొని పనిచేసుకొంటున్నాడు.

అంతలో ప్యూన్ వచ్చి టమ్స్ ఆఫీసులో ఎవరో అతడి గురించి వేచి ఉన్నారని చెప్పాడు.

సాధారణంగా పత్రికాఫీసుల్లో బయటవాళ్ళని లోపలికి రానివ్వరు. సెక్యూరిటీ దగ్గరే ఆపుచేసి, ఫోన్లో కావాల్సిన వాళ్ళని కనుక్కొని, అప్పుడు అంపిస్తారు పాస్ ఇచ్చి.

'వచ్చిందెవరూ' అని కనుక్కుంటే ప్రొఫెసరు.

"వెల్ కం టూ మై ఆఫీస్" ఆనందంగా ఆహ్వానించేడు రమణ.

ప్రొఫెసరు వచ్చి ఎదుటిసీట్లో కూర్చొని చుట్టూ చూసేడు. పెద్ద హాలు. ఎవరి పని వాళ్ళు తలవంచుకొని చేసుకుపోతున్నారు.
"టీ త్రాగుతారా?" అడిగేడు రమణ.

"టీ కాదు ముఖ్యం. నీతో ఓ విషయం చెప్పటానికి వచ్చేను."
"ఏమిటి?"
"మనం సాయంత్రమ్ ఫ్లయిట్ లో డిల్లీ వెళుతున్నాం."


శైలజ జ్ఞాపకశక్తి ఎక్కువ. చాలా సంవతరల తర్వాత చూసిన విషయాల్ని కూడా జ్ఞాపకం కూడా జ్ఞాపకం పెటుకోగలదు. అందుకే ప్రొఫెసరుని గుర్తు పట్టింది.

అతడీ ఆఫీసుకు ఎందుకొచ్చినట్లు?

రమణ ముందు కుర్చీలో కూర్చోవటం చూసి ఆమె అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చింది. అక్కడికి ఆమె చేరుకొనే సమయానికి రమణా ఆయనా ఘర్షణ పడుతున్నారు. సెలవు దొరకదంటున్నాడు రమణ. ఎలాగయినా వీలు చూసుకొమ్మనీ, తనకి అక్కడ అసలేమీ తెలియదనీ ప్రొఫెసరంటున్నాడు.

"హల్లో! " అంటూ చేరుకున్నది ఆమె అక్కడికి. "మీరు ఆనంద మార్గం కదూ?" కుర్చీలో కూర్చొంటూ అడిగింది.

"కాదు, అయోమయం " అన్నాడు ప్రొఫెసర్.

ఆమె నవ్వి, "సరే, మీ మతిమరుపు చూస్తూంటేనే తెలుస్తూంది, మీరు ప్రొఫెసరు ఎ.యమ్.ఎ.యమ్. అని" అంది.

"మీకు తెలుసా?" రమణ అడిగేడు.

"చాలా కాలం క్రితం పేపర్లో ఫోటో చూసేను."

"నీ జ్ఞాపక శక్తి మెచ్చుకోదగిందమ్మాయ్" అన్నాడు ప్రొఫెసర్.
"ఇలా వచ్చారేమిటి?"
వచ్చిన పని చెప్పేడు ప్రొఫెసర్.
"నాకు శెలవు దొరకదు, చేరి నాలుగు రోజులు కాలేదు. అప్పుడే శలవంటే ఇంటికి పంపిస్తారు" అన్నాడు రమణ.

"ఎందుకు డిల్లీ." అడిగింది శైలజ.

"ప్రధానమంత్రి స్వయంగా రమ్మన్నారు...."

అప్పటివరకూ కుర్చీలో వెనక్కివాలి, కబుర్లు చెబుతూన్నదల్లా ఈ మాటతో నిటారుగా అయి, "ప్రధాన మంత్రా?" అంది.
ప్రొఫెసరు ఉత్తరం చూపించేడు.
దాంతో ఆమెకు కుతూహలమ్ పెరిగింది. "అసలు విషయం ఏమిటి? మొత్తం అంతా వివరంగా చెప్పండి" అంది.

నక్షత్రం గురించి__ అది భూమిపై రావటం గురించీ అంతా చెప్పేడు. ఒక క్షణం ఆమె మౌనంగా ఆలోచిస్తూ వుండిపోయింది.

తరువాత, "ఒక షరతుమీద రమణకి లీవు ఇస్తాం" అంది.

"ఏమిటి?"
"ఈ విషయాన్ని డిల్లీలో ఏ పత్రిక్కీ మీరు ముందు చెల్లడి చెయ్యకూడదు."

"సరే దానికేముంది" అన్నాడు ప్రొఫెసర్.

"ఒకవేళ వెల్లడిచేసినా ఎవరూ నమ్మరు. అసలు నేను వ్రాసిన ఓ పిచ్చి ఉత్తరానికి అంత ప్రాముఖ్యత రావటమే నాకు ఆశ్చర్యంగా వుంది. నావన్నీ కాకుల లెక్కలు" అన్నాడు. ఆమె నవ్వి, "మాకు కావలిసినవి అలాటి వార్తలే, లోకులు కాకులు" అంది.

ఆ సాయంత్రం బోయింగ్ లో ప్రొఫెసర్, రమణ డిల్లీ వెళ్ళారు.

*************************************************************************

ఆ మరుసటిరోజు ఇండియన్ టైమ్స్ పత్రికలో ఒక మూల బాక్సు కట్టి ఒక వార్త పడింది ఇలా.
ఆగష్టు నాలుగు, అంతరిక్షం,

భూమి మీద సకల చరాచరాలు నాశనం కాబోతున్నాయా?
ప్రొఫెసర్ ఆనంద మార్గం అంచనా నిజమయ్యే పక్షంలో
ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ప్రాక్సిమా సెంక్చువరీ
అనే నక్షత్రం భూమికి దగ్గరగా దూసుకువస్తోంది. కొన్ని
వేలకోట్ల మైళ్ళ వేగంతో వస్తూన్న యీ నక్షత్రం భూమి
యొక్క పరిధిలోకి ఆగష్టు పదిహేడు ప్రొద్దున్న పదకొండు గంటల
పది నిమిషాలకి ప్రవేశించి, మూడు సెకన్ల కాలం పాటు
వుండి అనంత విశ్వంలోకి వెళ్ళి పోతుంది. అయితే భూమిలో
వుండే పదార్థాలన్నీ పోటీ పడి ఆ నక్షత్రాన్ని చేరుకోవటానికి
తొందరపడడంలో భూమి పేలిపోతుంది. కగితంలో పకోడీలు దట్టంగా
కూరి నొక్కితే పేలినట్టు భూమి పేలిపోతుందా? పదిహేడో
తారీఖు వరకూ వేచి చూద్దాం. ప్రొఫెసరు మాటలేగాని
యదార్థమైతే ఆ తర్వాత చూడటానికి మనం ఎలానూ ఉండముగా

--- మా విలేఖరి.

ఇండియన్ టైమ్స్ పత్రిక అతితొందర్లోనే పైకి రావటం చూసి ఓర్వలేని మరో దినపత్రిక మధ్యాహ్నం ఎడిషన్ లో ఇలా ప్రకటించింది.

"ఒక ప్రముఖ దినపత్రిక ప్రకటించిన అసత్య వార్త వల్ల నగరంలో అలజడి. 'ప్రళయంలో వస్తుంది' అని ఆ పత్రిక ప్రకటించడంవల్ల ప్రజలు భయకంపితులవుతున్నారు. గుండె జబ్బు వున్న వాళ్ళ పరిస్థితి మరింత ప్రమాదకరమయింది. ఈ వార్త మూలాన తన ఆరోగ్యం దెబ్బ తిన్నదనీ, దానికి నష్టపరిహారంగా యాభైవేల రూపాయలకి దావా వెయ్యబోతున్నాననీ హైకోర్టు న్యాయవాది ఒకరు ప్రకటించారు"

ఈ వార్త చూసి, ఇండియన్ టైమ్స్ ఎడిటర్ కంగారు పడ్డాడు. అనవసరమైన చిక్కుల్లో యిరుక్కోవటం యిష్టంలేదు. శైలజ చీవాట్లు పెట్టేడు.
మనిషి మనుగడమీద జూదం మొదలయింది.

****************************************************************************

ఆగష్టు నాలుగు - డిల్లీ

పదకొండు గంటలకి అప్పాయింట్ మెంట్.


తొమ్మిది గంటలకి సెక్రటేరియట్ కి చేరుకున్నరు యిద్దరూ. రమన గుండె వేగంగా కొట్టుకొంటోంది. ప్రధానమంత్రితో తను స్వయంగా మాత్లాడబోతున్నాడు. కలలో కూడా వూహించలేని విషయం అది.

పావుతక్కువ పదింటికి అప్పాయింట్ మెంట్ ఆర్డర్ వెరిఫికేషన్ జరిగింది. ప్రోగ్రామ్ షీట్ లో పేరు వ్రాయబడింది.

పావు తక్కువ పదకొండుకి విజిటర్స్ ఛాంబర్ లోకి ప్రవేశం లభించింది. ఆ చాంబర్ లోకి వెళ్ళాలంటే కారిడార్ లోంచి నడవాలి. అక్కడే విజిటర్లు ఏమయినా ఆయుధాలు ధరించిందీ లేనిదీ పరిక్ష జరుగుతుంది.

పదకొండు కొడ్తూ వుండగా డ్రాయింగ్ రూమ్‌లోకి ప్రవేశించారు. జగదీష్ చంద్ర వీళ్ళని చూసి కూర్చోమన్నాడు. రమణ ఎగ్జైట్మెంట్తో వూపిరి బిగపట్టేడు.

వాళ్ళకి యివ్వబడిన సమయం అయిదు నిమిషాలు.
"మీరేనా ప్రొఫెసర్?"
తలూపేడు. నిమిషంపాటు మామూలు సంభాషణ.
"నక్షత్రం ఒకటి భూమివైపు వస్తుందని ఎందుకు భావిస్తారు మీరు?"విషయం కదుపుతూ అన్నాడు.
"చూసేను కాబట్టి"
"ఎక్కడ?"
"నా టెలీస్కోపులో."
"మీ దగ్గర టెలిస్కోప్ వుందా?"
"ఉంది."
"మనదేశంలో వున్న మిగతా అబ్జర్వేటరీస్ కనుక్కోలేని విషయాన్ని మీరు ఎలా కనుక్కొన్నారు?"
"మనదేశంలో ఎక్కడా నా దగ్గరున్నంత పెద్ద టెలిస్కోప్ లేదు. మనదేశంలోనే కాదు. ప్రపంచంలోనే లేదు."
జగదీష్ చంద్ర, అవినాష్ అతడివైపు చిత్రంగా చూసేరు. కొంచెంసేపు ఎవరూ మాట్లాడలేదు.

"ఆ నక్షత్రం భూమివైపే వస్తుందని ఎందుకనుకొంటున్నారు? ఒక వేళ వచ్చినా అది పదిహేడో తేదీనాడే వస్తుందని నమ్మకం ఏమిటి?"
"లెక్కలు కట్టేను"
"మీ దగ్గర కంప్యూటరుందా?"
"నా మెదడే కంప్యూటరు"
"ఎనభై ఎనిమిది తొంభై మూళ్ళెంత?" అవినాష్ నవ్వుతూ అడిగేడు.
"ఎనిమిదివేల నూట ఎనభై నాలుగు"
మళ్ళీ కొంచెం నిశ్శబ్దం.

"ప్రపంచంలో ఏ ఆస్ట్రానమిస్టు కనుక్కోలేనిదాన్ని మీరు ఏ పరికరమూ లేకుండా కనుక్కున్నానంటారా?"
"నేను కనుక్కున్నది నిజమవనూవచ్చు. కాకపోనూవచ్చు. ప్రపంచం సంగతి నాకు తెలీదు. ఏ అబ్జర్వేటరీ పని చెయ్యటంలేదు."
జగదీష్ భృకుటి ముడిపడింది. "పని చెయ్యటంలేదా?" సాలోచనగా అన్నాడు.

అయిదు నిమిషాలైపోయినట్టు సంకేతం. మరికొంత పొడిగించబడింది.

జగదీష్ అన్నాడు. "ఆ నక్షత్రానికి మీరన్నట్టు ఆకర్షణ శక్తిగాని వుంటే, వస్తువులే కాదు, అన్ని పదార్థాలూ దాన్ని చేరుకుంటాయి కదా."

"అది ఆ నక్షత్రపు ఆకర్షణ శక్తిని బట్టి ఉంటుంది."

"అంటే....."

"ఒక అయస్కాంతం ఇనుప ముక్కని ఆకర్షిస్తుంది. ఆ నక్షత్రంలో వుండే అయస్కాంతం బంగారంమీద ఎక్కువ ప్రభావాన్ని చూపించగలిగితే.... అన్నిటికన్నా ముందు బంగారం భూమినుంచి వెలుపలికి వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తుంది"

" ఏ గ్రహపు ప్రభావం ఏ యే లోహాలమీద ఎక్కువగా వుంటుందని మీరనుకుంటున్నారు?"

"క్షమించండి, నేను ఆస్ట్రానమిస్ట్ ని, జియాలజిస్ట్నికాను" అన్నాడు ప్రొఫెసర్. ఏదిఏమైనా, పదిహేడో తారీఖు పదకొండింటికి ఇక అత్యంత సమీపంగా వస్తుంది కదా, అప్పుడు అన్ని వస్తువులూ దానివైపు ఆకర్షితమవుతాయి"

"నా ప్రశ్నని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు" అన్నాడు జగదీష్. "ఆ నక్షత్రం దేన్ని బాగా ఆకర్షించగలదో అది భూమిని వీడి తొందరగా అటువైపు వెళ్ళిపోతుంది. ఉదాహరణకి అది ఇనుముని బాగా ఆకర్షిస్తుందనుకోండి. పదకొండు గంటలా పదిహేనునిమిషాలకి ముందే భూమి యొక్క లితోస్పియర్ లో వుండే ౧౯% ఇనుము అటు వెళ్ళిపోతుంది అంటే భూమి బ్రద్దలవటం ప్రారంభిస్తున్నదన్నమాట. అవునా?"

ప్రొఫెసరు ఒక క్షణం ఆలోచించాడు. "అలా అవటం సాద్యమై వుంటే ఆ కదలిక ఏదో ఒక పదార్థంలో తొందర్లో మొదలవుతుంది" అన్నాడు.

"తొందర్లో అవటం కాదు. అయింది" నెమ్మదిగా స్ఫుటంగా అన్నాడు జగదీష్. శ్రోతలు ఉలిక్కిపడ్డాఅరు. గదిలో సూది పడ్తే వినపడేటంత నిశ్శబ్దం.

"....నేను స్వయంగా చూసేను. నెలరోజుల క్రితం ఒక పెద్ద రాయి గాలిలో ఎవరో లేపినట్టు పైకి లేచి క్రిందకి పడిపోయింది. నా ఉద్దేశం ఆ రాతిలో వున్న పదార్థం ఆ రోజు ముందుగా ఆకర్షణ శక్తికి లోనవుతుందన్నమాట" అంటూ లేచాడు. ఆ పదార్థం ఏమిటో కనుక్కోండి. దానివల్ల మీ థియరీకి ఏదయినా లాభం కలుగుతుందేమో చూడండి. మీ రిపోర్టు నాకు పంపండి__"

ఇద్దరూ షేక్ హ్యాండిచ్చి బైటకొచ్చారు.

"ఏమిటిదంతా?" అవినాష్ అడిగేడు వాళ్ళు వెళ్ళేక.

"మానవుడి జీవితానికి ఆఖరి రోజు వచ్చిందని యీ ప్రొఫెసర్ అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో తెలీదు. అదే నిజమై ఈ మానవ జాతి అంతరించిపోతే.....అప్పుడు యీ రాజకీయాలుండవు_ మనిషీ మనిషీ డబ్బు కోసం, కీర్తికోసం, పదవికోసం కొట్టుకొని చావటం వుండదు. ఒకవేళ అది నిజం కాకపోతే __ అదీ మనకి లాభమే. ప్రజల దృష్టి అటు మళ్ళుతుంది. మనిషికి ప్రాణం కన్నా తీపి యింకొకటిలేదు. నెలరోజులపాటూ దేశంలో ఏ నోట విన్నా అదే సమస్య వినిపిస్తుంది. ప్రతీ పేపరు ఎక్కువ స్థలాన్ని ఆ విషయం రాయడానికె కేటాయిస్తాయి. ఈ లోప్లో మనం బలం పుంజుకోవచ్చు. మన స్థానాన్ని సుస్థిర పర్చుకోవటానికి ఈ పది పదిహేను రోజులూ చాలు. ప్రజల దృష్టి డైవర్ట్ చెయ్యటానికి ఇంతకన్నా మమ్చి విషయం ఇప్పట్లో ఇంకొకటి వుంటుందని నేను అనుకోను."

పార్టీ చీఫ్ నవ్వేడు. మనిషి మనుగడమీద రాజకీయ చదరంగం ప్రారంభమైంది.

*********************************************************************************
డిల్లీ ఆగష్టు నాలుగు రాత్రి,

చేతులు రెండూ తలక్రింద పెట్టుకొని వెల్లకిలా పడుకొని ఆకాశం కేసి చూస్తున్నాడు ప్రొఫెసరు. పక్కనే ఇంకో పక్కమీద రమణ.
టైమ్ తొమ్మిదయింది. ప్రధానిని కలుసుకొని అప్పటికి పదిగంటలు కావొస్తూంది.
"రాయి గాలిలో లేవటం చిత్రంగా వుంది?" అన్నాడు రమణ.
"అందులో చిత్రం యేముంది?" అందులో ఒక పదార్థం ఏదో ఆకర్షణకి లోనై వుంటుంది."

"ఆ విషయం ప్రధాని ఎందుకు ఆ రోజు వెల్లడి చేయలేదు?"

"ఏవమి వెల్లడి చేస్తారు? అర్థరాత్రి తాను ఓ రాయి గాలిలో లేవటం చూశాననా? అలా చేస్తే ప్రతిపక్షం వాళ్ళు బ్రతకనిస్తారా? ప్రధానికి మతి పోయిందని పచారం చెయ్యరూ__"

నిజమేనన్నట్టు రమణ మాట్లాడలేదు.

"ఏ లెవల్ లో వుండే కష్టాలు ఆ లెవల్లో వుంటాయి. బైదిబై నీకు పెళ్ళయిందా?"
రమణ నవ్వేడు. "కాలేదు."
మరి ప్రపంచం ఆఖరయిపోతే ఏం చేస్తావ్?
"బ్యాచెలర్ గానే చచ్చిపోతాను."
"లేదు లేదు. విషయం అంతవరకూ వస్తే ఈ పదిరోజులూ బాగా ఎంజాయ్ చెయ్యి. రేపే పెళ్ళి చేసుకో!"
రమణ మాట్లాడలేదు.
"పది రోజులకోసం ఎలాంటి అమ్మాయి అయితేనేం? అమ్మాయి అయితే చాలు."
"అలా అనకు. కళ్ళు తామరపూవుల్లా వుండాలి."
"మెడ శంఖంలా వుండాలి" నవ్వాడు. అతడికి మాలతి జ్ఞాపకం వచ్చింది.
"పెదవులు తమలపాకుల్లా వుండాలి."
"మీకు కవిత్వం వచ్చే__"
"చెక్కిళ్ళు దానిమ్మపళ్ళలా వుండాలి."
"పలువరస బియ్యపు గింజల్లా వుండాలి."
"ముక్కు సంపెంగ__"
"జడ మిన్నాగు__"
"బొట్టు, దోసగింజంత సింగారం."
"కట్టు, పోత పోసిన బంగారం."
"అన్నీ కలిసిన మొహం చంద్రబింబం."
"మామూలు చంద్రబింబం కాదు. పౌర్ణమి నాటి చంద్రబింబమ్....."
"ఆహా .... నిండు అమావాస్య" అన్నాడు రమణ.
"ఆస్ట్రానమిస్ట్కి అమవాస్య ఏదో పౌర్ణమేదో చెపుతున్నావా_ ఆగష్టు నాలుగు _ ఈ రోజు పౌర్ణమి ."
"మరి చంద్రుడేడి?"
"ప్రొఫెసర్ ఆకాశంవైపు చూసేడు."
నక్షత్రాలు మిల మిల మెరుస్తున్నాయి. ఎక్కడా చిన్న మబ్బు తునక కూడా లేదు. ఆకాశం నిర్మలంగా వుంది. చంద్రుడు మాత్రం లేడు.
ఇద్దరూ మొహమొహలు చూసుకొన్నారు.
"ఆరింటికి రావలసిన శశాంకుడు ఏ తారతో సరసమాడటానికి వెళ్ళేడు?" ప్రొఫెసరు నవ్వుతూ అన్నాడు.
రమణ నవ్వలేదు.
ఇప్పటివరకూ అంతా నవ్వులాటగా__ ఏదో కలలాగా జరిగిపోయింది. కానీ ఒక్కొక్క విపరీతమే చూస్తూ వుంటే ఆ భావన వచ్చేసరికి ఒళ్ళు గగుర్పొడిచింది. సన్నగా వణికేడు.
"చం .... చంద్రుడేమయ్యాడు?"
"చూద్దాం" అంటూ కళ్ళు మూసుకున్నాడు. అతడి పెదవులు అస్పష్టంగా కదలసాగాయి. రెండు నిముషాల తర్వాత కళ్ళు తెరచి "పదిన్నర ..." అన్నాడు. "... నా లెక్క కరెక్టయితే ఈ రాత్రి పదిన్నర వరకూ చంద్రుడు రాడు__"

ఇంతలో క్రింద చప్పుడయింది.
ఫోను.....
భూగర్భ శాస్త్రజ్ఞుడు భట్ ఫోన్ చేసేడు.
"యస్ భట్!"
"మీరు అర్జంటుగా రాగలరా?"
"ఆ రాయి పరిక్ష చేసేరా."
"ఆ విషయమే మాట్లాడాలి. వస్తారా?"
"ఇప్పుడే వస్తున్నాను."
రమణా, ప్రొఫెసర్ లాబుకు వెళ్ళేసరికి పది అయింది.
భట్, వాళ్ళకోసమే ఎదురు చూస్తున్నాడు. వాళ్ళని లోపలికి తీసుకెళ్ళేడు.
"ఏ యే ఎలిమెంట్సు వున్నాయి ఆ రాతిలో?"
"చాలా చిత్రం __ "
"చెప్పండి."
"భూమ్మీద వున్న ఎలిమెంట్సు __ ఇనుము, రాగి, ఇత్తడి ఇలాంటివేమీ అందులో లేవు. ఏ లోహమూ లేదు. అందులో ఉన్న పదార్థం...."
"ఊ ... పదార్థం __"
"క్షమించండి, నా ముప్పై సంవత్సరాల అనుభవంలో ఆ పదార్థం ఏమిటో నేను కనుక్కోలేకపోయాను. భూమ్మీద దొరికే అన్ని రకాల ఎలిమెంట్సుతోనూ, లోహాలతోనూ పరిశీలించి చూసేను. నాకు అంతుబట్టలేదు."

ఎవరూ మాట్లాడలేదు చాలసేపు.

ప్రొఫెసరు బలంగా శ్వాస వదిలి, "టిటానియం ఎమో చూశావా" అన్నాడు.

"సారీ ప్రొఫెసర్ కాదు" అన్నాడు భట్.
"పరిశీలించండి నేనూ ఆలోచిస్తాను" బయటికి వస్తూ అన్నాడు.
మెట్లెక్కి పైకి వస్తుంటే, "టై మెంతయింది?" అడిగేడు ప్రొఫెసర్.

"పదిన్నర"
"వచ్చేడా చంద్రుడు?"
చప్పున తలెత్తి చూసేడు రమణ.
.... ఆకాశం నిర్మలంగా వుంది. నక్షత్రాలు మిల మిల మెరుస్తున్నాయి. ఒక మూల నుంచి నెమ్మదిగా వస్తున్నాడు చంద్రుడు.
ఏదో ఆలోచన స్ఫురించి ప్రొఫెసర్ సన్నగా వణికేడు.

****************************************************************

ఆ మరుసటి రోజు తెల్లవారుఝామున అయిదింటికి మెలకువ వచ్చింది రమణకి. కళ్ళు విప్పగానే పచార్లు చేస్తున్నప్రొఫెసరు కనిపించాడు. పక్కనిండా గాలికి చెల్లాచెదురైన కాగితాలు, కాగితాల్నిండా లెక్కలు.
రమణ లేవటం చూసి, అతడు ఆగి, "ఈ రోజు మనమో దొంగతనం చెయ్యాలి!" అన్నాడు.
"ప్రొద్దున్నే మాట్లాడటానికి ఇంతకంటే మంచి కబుర్లు దొరకలేదా?" అన్నాడు అతడ్ని తేరిపార చూస్తూ.

"జోకు కాదు నిజమే!"
"ఏం దొంగతనం చెయ్యాలి?"
"చంద్రశిల...."
రమణ తల విదిలించేడు,
ప్రొఫెసర్ అన్నాడు. "నీకు జ్ఞాపకం వుందా? చాలా రోజుల క్రితం__ ఐ మీన్ కొన్ని సంవత్సరాల క్రితం ఆర్ముస్ట్రాంగు అనే అతను చంద్రుడి రాళ్ళను తెచ్చేడు. ఆ తెచ్చిన రాళ్ళలో ఒక్కో దేశానికి ఒక్కో పౌండు బరువున్న శిలని అమెరికా బహుమతిగా ఇచ్చింది...."
తెలుసన్నట్టు తలూపాడు రమణ.

"చంద్రుడి నుంచి తెచ్చిన ఆ శిలల్లో భూమికి వినాశకరమైనదేమన్నా వుందేమోనని చాలా భద్రంగా వుంచింది ప్రతి దేశమూ దాన్ని మనం సంపాదించాలి."

"ఎందుకు?"
"ప్రశ్న లెయ్యకు. నిజానికి ఎందుకో తెలీదు."
..............

ఆ రోజు పదింటికి ఇద్దరూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ మ్యూజియంలో వున్నారు. ప్రధాని తాలూకు అతిధులుగా వాళ్ళకి ప్రత్యేక స్వాగతం లభించింది. తిరిగొచ్చేటప్పుడు ప్రొఫెసర్ పొడవాటి తన కోటు వెనక నుంచి చంద్ర శిల తాలూకు ఓ చిన్న ముక్క తీసుకువచ్చాడు.
పదకొండింటికి ఇద్దరూ జియాలజిస్ట్ భట్ లేబరేటరీలో వున్నారు.
"ఇదిగో ఇది చూడండి" అంటూ శిలని అందించేడు ప్రొఫెసర్.
"ఎక్కడిదీ రాయి?" అందుకొంటూ అడిగాడు భట్.
"మా ఇంట్లో పెరట్లోది. దీన్ని పరీక్షించి ఇదీ, ఆ రాయిలో వున్నదీ ఒకే లోహం అవునో కాదో చెప్పండి." అన్నాడు ప్రొఫెసరు.
భట్ లోపలికి వెళ్ళాడు.
"ఏమిటిదంతా?" అడిగేడు రమణ.
"చంద్రుడి శిల నుండి తెచ్చిన శిలల్లో ఒక కొత్త రకం అదార్థం వుంది. ఆ పదార్థం భూమ్మీద లేదు. మన సైంటిస్టులు దానికి అర్మాల్ కొలైట్ అని ఏరు పెట్టారు. అంటే ఏమిటో తెలుసా?"
"ఊహూ.."
"చంద్రుడి నుంచి శిలల్ని తెచ్చిన వాళ్ళెవరు?"
"నీల్ ఆర్ముస్ట్రాంగు, ఆల్డ్రిన్, కొలెన్స్ అనే ముగ్గురు"
"వాళ్ళ పేర్లు కలిసొచ్చేలా ఆ కొత్త పదార్థానికి ఆ పేరు పెట్టారు. ఈ రాయిలో గాని ఆ కొత్త పదార్థం వుంటే..."
"ఉంటే ... " అర్థం కాక అడిగేడు.
ప్రొఫెసరు మొహం వాడిపోయింది. "రేపు రాత్రే చంద్రుడికి ఆఖరి రోజు. ఎల్లుండి రాత్రి పన్నెండు గంటలకి ఆ నక్షత్రమ్ వైపు వెళ్ళి స్మాష్ అయిపోతాడు."

"ఎలా?"
"ఎంతో దూరం నుంచే ఆ నక్షత్రం భూమ్మీద వున్న రాయిని ఆకర్షింఇంది. అయితే ఆర్మాల్ కొలైట్ ఆ రాతిలో తప్ప ఇంకెక్కడా లేదు. కాబట్టి ఎలుండి ఫర్వాలేదు. కానీ ఈ పదార్థం __ ఐ మీన్ __ అర్మాల్ కొలైట్ చంద్రుడిలో వుంది కాబట్టి..." ప్రొఫెసర్ ఆగేడు.

".... ఎల్లుండి చంద్రుడికి ఆఖరి రోజు. మనం తెల్సుకోవల్సిందల్లా ఆ రాతిలోను, చంద్రుడిలోనూ వున్నది ఒకే పదార్థమా అని. అలా గానీ అయితే ఎల్లుండి చంద్రుడికి చివరి రోజు. అదే ప్రళయానికి నాంది."

అంతలో లోపల చప్పుడయిమ్ది. భట్ బయటకొచ్చేడు. అతడి మొహం ఆనందంతో వెలిగిపోతుంది.

"రెండు శిలల్లో లోహం ఒకటే ప్రొఫెసర్" అన్నాడు ఉత్సాహంగా.

******************************************************************************

ఇండియన్ టైమ్స్ పత్రికలో పడిన ఆ చిన్న వార్త చాలా సంచలనాన్ని కలిగించింది. భూమి ఆఖరవుతుంద? అన్న ఉత్తరాలూ, "చివరి రోజు? మీద వ్యాసాలూ, మరుసటి రోజుకే పత్రికా కార్యాలయానికి వచ్చి చేరుకున్నాయి.

ప్రాణం మీద మనిషి కెంత తీపో తెలిపేటందుకు నిదర్శనంగా ఆ వార్త నిజానిజాలడుగుతూ ఫోన్ కాల్స్.

ఈ వార్తని వెల్లడించిన ప్రొఫెసర్ క్వాలిఫికేషన్లు సామాన్యమైనవి కావు. ఈ విషయం ఎంక్వయిరీ చేసిన ఎడిటరు శైలజని వెంటనే డిల్లీ పంపేడు.

ఇలాంటి వార్తలే పత్రిక సర్క్యులేషన్ పెంచేవి. అందులోనూ ఏ పత్రికా వెయ్యని వార్త అది.
తను కనుక్కొన్న దానిమీద ఎడిటర్ ఉత్సాహం చూపించటంతో శైలజ సంతోషం పట్టశక్యం కాలేదు. ఆ రోజు ఆమె డిల్లీ వచ్చేసింది.
ఆమె ప్రొఫెసరుని కలుసుకొనే సమయానికి భూమియొక్క ఆఖరి క్షణం ఎప్పుడూ అన్నది కరెక్టుగా లెక్క కట్టేడు. అలాగే చంద్రుదు తన పరిధి నుంచి తప్పుకొని ఎప్పుడు స్మాష్ అయిపోతాడూ అన్న విషయం కూడా.

మొదటిది ఆగష్టు పదిహేడు, రాత్రి పదకొండు గంటలా మూడు నిముషాల అయిదు సెకన్లకి.
రెండోది ఆగష్టు ఆరో తారీఖు, రాత్రి పన్నెండు గంటలా మూడు నిముషాల అయిదు సెకన్స్లకి.

ప్రధాన మంత్రికి అందించటం కోసం రిపోటు తయారు చేస్తూండగా శైలజ ఆ గదిలోకి అడుగుపెట్టింది.

రమణ సంభ్రమాశ్చర్యాల్తో "ఇదేమిటి, మీరిక్కడికి వచ్చేరు?"
ఆమె నవ్వి వూరుకుంది.
ప్రొఫెసరు కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రంతా నిద్రలేదతనికి. ఆ రాతిలో వున్న లోహమూ చంద్రశిలలో వున్న లోహమూ ఒకటేనని తెలిసిన దగ్గర్నుంచి అతడి మొహంలో నవ్వు మాయమైంది. అయితే అతనిది ప్రాణభయం కాదు. అతడికి తెలుసు, భూమి నాశనం కాబోతోందనీ, దేవుడనేవడే వుంటే, వాడు కూడా దాన్ని రక్షించలేడనీ.
కొత్త విషయాన్ని కనుక్కొనే ఉత్సాహంతో యింతవరకు ముందుకు సాగేడు. కానీ చివరికి అంతా కనుక్కొని వెనుదిరిగి చూసుకొంటే..... తను సాధించినదేమిటి?
డిస్ట్రక్షన్- సర్వనాశనమ్!!

అతడికి నవ్వూ, ఏడుపూ, ఒకేసారి వచ్చినాయ్. అన్నీ ఫీలింగులకూ అతీతుడైన ఆ వృద్దుడి మనసులో కలవరం మొదలయింది.
"ఏం కనుక్కొన్నారు?" శైలజ అడిగింది.
"చాలా గొప్ప విషయాన్ని కనుక్కొన్నాం!" అన్నాడు రమణ ఉరకలేస్తున్న ఉత్సాహంతో, "రేపు రాత్రికి ...."
"ఆగు....!" అరిచేడు ప్రొఫెసర్,
రమణ చెబుతున్నది ఆపి, చిత్రంగా అతడివైపు చూసేడు "ఈ విషయం వెల్లడి కావటానికి వీల్లేదు" అన్నాడు. అతది ముడతలుపడ్డ చెక్కిళ్ళు ఆవేశంతో బిగుసుకున్నాయి. కళ్ళు తీక్షణంగా వెలుగుతున్నాయి. మనిషి ఆవేశంతో వూగిపోతున్నాడు. పిడికిళ్ళు బిగించి "ఈ విషయం వెల్లడించటానికి వీలులేదు. ముఖ్యంగా పత్రికల వాళ్ళకి_"అన్నాడు. ఇన్నాళ్ళూ మిగతా అబ్జర్వేటరీస్ అన్నీ యీ విషయాన్ని యెందుకు వెల్లడి చేయలేదు? అమెరికా, రష్యాలు ఎందుకు చెప్పలేదు? ప్రొఫెసర్ కి యిప్పుడు అర్థమయింది... ఈ విషయం వెల్లడి చేయటం వల్ల వచ్చే లాభం ఏమిటి? కేవలం ప్రజల్లో భయోత్పాతం తప్ప. చావు ఎలానూ తప్పనప్పుడు అది తెలియకుండ చావటమే మంచిది. అంతా నిశ్శబ్దంగా జరిగిపోవాలి. తమ పరిశోధన తమతోనే అంతం అయి పోవాలి... ఈ ఆలోచనలతోనే అతడు చెప్పొద్దన్నాడు.

రమణ అతనివైపు నిదానంగా చూసేడు.
రమణ ఆలోచన్లు వేరు. ఇంకోలా అర్థంచేసుకొన్నాడు.
ప్రపంచం ఇక పన్నెండు రోజుల్లో ఆఖరవబోతుంది. ఆ విషయం అందరికీ తెలిస్తే.... దీన్ని యీవిపత్కర పరిస్థితినుంచి రక్షించటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. ప్రతి సైంటిస్టూ ప్రాఆలు ధారపోసి దాన్ని ఆపటానికి పరిశోధనలు మొదలుపెడ్తాడు. ఈ వృద్దుడు ఎందుకు తనని చెప్పొద్దంటున్నాడు__?
అతడికి చప్పున ఓ విషయం అర్థమయింది.
నోబుల్ ఫ్రైజ్!
అవును. నోబుల్ ఫ్రైజ్!
ఈ పదిరోజులు ఏదయినా కృషిచేసి, దీన్ని తనే సాధించాలని ఈ ప్రొఫెసర్ ప్రయత్నం. ఒకవేళ తను సాధించలేకపోతే ఈ ప్రపంచం నాశనమైనా దానికి సిద్దపడ్తాడు కానీ, యీ అవకాశం మరొకరికి దక్కనివ్వడు.
'మనిషెంత స్వార్థపరుడు?' అనుకున్నాడు రమణ.
ఒకవైపు కొంపలంటుకుపోతూ వుంటే, ఇంకోవైపు అందులో తనకేం దొరుకుతుందా అని వెతుకుతున్నాడు ప్రొఫెసర్.
అతడో నిర్ణయానికి వచ్చేడు. ప్రొఫెసర్ వైపు సూటిగా చూసి "నేను చెప్పాలి. చెప్పకుండా నన్నెవరూ ఆపుచెయ్యలేరు" అన్నాడు. అని, ఆమెవైపు తిరిగి, "రేపు రాత్రి పన్నెండుగంతలకి...." అంటూ ఏదో చెప్పబోయాడు.
ప్రొఫెసరు కదిలేడు. నరనరాల్లో వున్న బలం అంతా చేతుల్లోకి తెచ్చుకొని, రమణ నోరు ముయ్యటానికి ప్రయత్నించేడు. కానీ అతని బలం చాలేదు. ఒక్క విసురుతో పడిపోయాడు.

రమణ ఆమెవైపు తిరిగి, "మన పత్రికకి ఒక న్యూస్! ఎవరూ నమ్మలేనిది. కానీ పచ్చినిజం. ఎవరూ నమ్మకపోయినా అది నిజం! ఈ ప్రొఫెసర్ ఎంత గొప్పవాడో నాకు తెలుసు. కేవలం స్వార్థంవల్ల ఇలా అయ్యేడు కానీ నిజంగా గొప్పవాడు. అతడి లెక్క తప్పటానికి వీల్లేదు. శైలజగారూ వినండి! తేపు చంద్రుడికి ఆఖరు రాత్రి. స్మాష్..... చంద్రుడు స్మాష్ అవబోతున్నాడు. ప్రకటించండి. మన పత్రికలో పెద్ద అక్షరాలతో ప్రకటించండి. ప్రపంచపు భవితవ్యం రేపు రాత్రి పన్నెండు గంటలకి తేలిపోతుంది. అందర్నీ చూడమనండి. ప్రపంచాన్ని రక్షించటానికి అందర్నీ నడుం కట్టమనండి...."

శైలజ వడివడిగా బయటకు వెళ్ళిపోయింది. సంభాషణ వింటున్న ఒక స్వీపరు అక్కడ్నుంచి తప్పుకొన్నాడు.
గదిలో నిశ్శబ్దం ఆవరించింది.

ఒక మూలగా పడిపోయిన వృద్దుడు మోచేతులమీద బలంగా లేవటానికి ప్రయత్నం చేస్తూ, "ఎంత పని చేశావురా మూర్ఖుడా!" అన్నాడు. "ఈ విషయం అందరికీ తెలిస్తే ఎంత కల్లోలం! ఇది మిగతా సైంటిస్టులకు తెలియకనా వాళ్ళు ఊరుకొన్నది! ఈ పదకొండు రోజులు ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది. భగవంతుడా ఎలా ఇప్పుడు....??"


*********************************************************************
పదిహేను రోజులు వెనక్కి.
శాన్ ఫ్రాన్సిస్కో:

"ఈ విషయం అందరికీ తెలిస్తే...." అన్నాడు విలియం రోగర్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్.

ఎవరు మాట్లాడలేదు.

మెక్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. జాన్ కళ్ళతోనే విష్ చేశాడు. అతడే అందర్లోకి యువకుడు.
తెలతెలవారుతోంది.
"ఏమిటీ సంగతి...? " కంఠం తగ్గించి అడిగేడు మెక్.

అందరి మొహాలూ సీరియస్సుగా ఉన్నాయి. జాన్ మౌనంగా ఓ కాగితాల కట్ట అందించేడు. దాదాపు పది పేజీలున్న రిపోర్ట్ అది. ఒక మూలగా 'మౌంట్ పలామోర్ అబ్జర్వేటరీ, కాలిఫోర్నియా' అని వుంది. తొందర తొందరగా కళ్ళతో చదవసాగేడు.

పూర్తి చేయడానికి అయిదు నిమిషాలు పట్టింది.

ప్రాక్సిమా సెంక్చువరీ అనే నక్షత్రం భూమివైపుకు వస్తున్నది అన్న విషయాన్ని ముందు కనుక్కొన్నది రాయల్ అబ్జర్వేటరీ. వెంటనే గ్రీన్ విచ్ ని కాంటాక్ట్ చేసేరు వాళ్ళు. రేడియో ఆస్ట్రలాజికల్ పరికరాల ద్వారా అది ఎంత వేగంతో వస్తున్నదీ, ఆ దిశగా వస్తున్నదీ కనుక్కోబడింది.

ఈ విధంగా ప్రొఫెసర్ ఆనందమార్గం కనుక్కొన్న విషయం అంతకు పదిహేను రోజుల ముందే సరి అయిన తేదీ, సమయంతో సహా గ్రహించబడింది.

ఆగష్టు పదిహేడు, పదకొండు గంటలా పది సెకన్లకి ఆ గ్రహం భూమి ఆకర్షణ పరిధిగుండ మూడు సెకన్లకాలం పయనిస్తుంది. భూమి అడుగుపొరల్లో వుండే ఇనుము, లావ దాని ఆకర్షణ శక్తికి లోనై పెల్లుబుకుతాయి!

మిలియను సంవత్సరాల వయస్సున్న యీ భూమ్మీద చరాలన్నీ గుర్తుకూడా మిగలకుండా నాశనమైపోతాయి. విశ్వంలో వున్న కోట్ల కోట్ల గ్రహాల మాధిరిగానే భూమి కూడ నిస్తేజమైపోతుంది.

సముద్రాలు ఇంకిపోయి వాటిమీద లావా గట్టిపడుతుంది.

రెండు పరమాణువులున్న్ ఆక్సిజన్ మూడో దాన్ని చేర్చుకొని ఓజోనుగా మారుతుంది.

భూమ్యాకర్షణ పరిధిలోకి ఆ నక్షత్రం రాగానే ఆ కుదుపుకి భూకంపం కలుగుతుంది. అగ్నిపర్వతాలు బ్రద్దలవుతాయి....

ఇక చదవలేదు అతడికి పరిస్థితి అర్థమయింది.

ఆయితే అది నిజమని నమ్మటానికే కొద్ద్దిగా సమయం పట్టింది. ఎక్కడో లాస్ ఏంజిల్స్ లో వెచటి రగ్గుకింద పడుకున్న వాణ్ని లేపి ఇంకో రెండు నెలల్లో ప్రపంచం నాశనమైపోబోతూంది అని చెప్తే అంత తొందరగా నమ్మబుద్దికాదు. కల అయితే బావుణ్ను అన్న భావన.

"ఇదంతా నిజమా_ నిజంగా ఇలాగే జరుగుతుందా? ఆ నక్షత్రం తనదారి మార్చుకొనే వీలే లేదా_? ఈ ప్రశ్నలన్నీ రిపోర్టు చదవగానే నా కొచ్చినయ్" అన్నాడు రోగర్స్ . "దీనికి సమాధానం ఆగష్టు ఆరో తారీఖున తెలుస్తుంది. ఎలా అని ప్రశ్నించకండి. ఈ ఒక్క్ అవిషయమూ రహస్యంగా ఉంచబడింది. అయితే అంతకన్నా ముఖ్య సమస్య ప్రెస్. ఈ విషయం బయటకు పొక్కగానే పత్రికలు దీన్ని తమ సర్క్యులేషన్ పెంచటానికి సాధారణంగా ఉపయోగించుకుంటాయి."

"అందరికీ తెలిస్తే ఏమవుతుంది?" ఫిన్చ్ అడిగాడు.

అప్పటివరకూ మౌనంగా కాగితాలు పరిశీలిస్తున్న కాస్టనోవా తలెత్తి నెమ్మదిగా అన్నాడు. "ఏమవుతుంది అని అడుగుతున్నావా మిస్టర్ పిన్చ్, ఈ నలభయి రోజుల్లోనూ ఘాతుకాలు జరుగుతాయి. ప్రాణం ఎలాగూ పోతున్నదని తెలిసినప్పుడు మనిషి పనిచెయటం మానేస్తాడు. ఎఫ్.బి.ఐ. వుండదు. ప్రాణమే పోతున్నప్పుడు నైతిక విలువలెందుకని మనిషి వాటిని వదిలేస్తాడు. పోలీస్ వుండడు.

గత పదకొండు సంవత్సరాలుగా వాషింగ్టన్ లో అయిదు వందల శాతం నేరాల సంఖ్య పెరిగింది. ఈ నలభై రోజుల్లో అవి పదిహేను వందల శాతం అవుతాయి. రోజుకి ఎనభై రాబరీలవుతున్నాయి. అవి ఎనిమిది వందలు అవుతాయి. రేప్ లు మనం అంచనా కట్టలేనంతగా పెరిగి పోతాయి. ఏం అవుతుందని అడక్కండి. ఏం ఆవదని అడగండి. మనుషుల బలహీనతలు మనకు తెలుసు. వచ్చే ప్రళయం ఎలానూ తప్పనప్పుడు దాన్ని ముందుగా వెల్లడించి కల్లోలం సృష్టించటం అవివేకం. ఆపటానికి శాయశక్తుల కృషిచేద్దాం కానీ ఆపగలమని అనుకోను. ప్రకృతిముందు మనిషెంత....? మనం చెయ్యగలిగిందొక్కటే, మన ప్రయత్నాలు మనం చేస్తూ ప్రపంచానికి యీ విషయం తెలియకుండా ఆపుచెయ్యటం. అబ్జర్వేటరీస్ అన్ని మూసెయ్యాలి. ఏదో మిషమీద ఆస్ట్రానమిస్ట్ ల నందర్నీ అరెస్ట్ ... నా ఉద్దేశ్యం జైలు కాదు.... అరెస్ట్ చెయ్యాలి. రాబోయే చావుని తల్చుకొని మనిషి చచ్చిపోవచ్చు _ లేదా మనిషిలో రాక్షసుడు విజృంభిమ్చవచ్చు. ఈ రెంటినీ మనం సాధ్యమైనంత కాలం ఆపు చెయ్యాలి.... రాక్షసుడు పుట్టకుండా మనిషి చావకుండా మనం ఆపు చెయ్యాలి"

అందరూ లేచారు.
సమావేశం ముగిసింది.

*************************************************************************************

కొన్ని దినపత్రికలు ముఖ్యమైన ప్రదేశాల్లో రోజువారీ కూలీమీద మనుషుల్ని తమకి సమాచారం అందించే పనిమీద నియమిస్తాయి. వీరందించే సమచారాన్ని బట్టి పారితోషికం నిర్ణయింపబడుతూ వుంటుంది. ఉదాహరణకి ఉస్మానియా హాస్పిటల్ లో "టీ" అందించే కుర్రవాడు ఒక ముఖ్య దినపత్రికకి ఇన్ఫార్మర్. ఎవరు ఎక్కడ కొట్టుకు చచ్చినా, చావబోతున్నా అక్కడికే రావాలి కదా. అప్పటికప్పుడు ఫస్ట్ హాండ్ ఇన్ఫర్మేషన్ సేకరించి పత్రిక్కి అందిస్తూ వుంటాడు. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషనులో మూటలెత్తే కూలీ.

దినపత్రికల్లో పడాల్సిన వార్త గంట ఆలస్యం అయితే చచ్చిపోతుంది. మరుసటిరోజుకు ఏ విధంగనూ పనికిరాదు.

ఇండియన్ టైమ్స్ సబ్ ఎడిటర్ శైలజ తనకు దొరికిన సమాచారాన్ని తన పత్రికకి పంపుతున్న సమయంలోనే నౌకరు రూపంలో గెస్ట్ హౌస్ లో వున్న ఇన్ఫార్మరు ద్వారా యీ సమాచారం మిగతా పత్రికలకి తెలిసిపోయింది. ప్రపంచంలో అన్ని అబ్జర్వేటరీలూ మూయబడి వుండటం, ఆస్ట్రానమిస్ట్లతో ఇంటర్వ్యూలు దొరక్కపోవటంతో సమాచారమ్ నిజం అన్న నిర్దారణకి వచ్చేయి పత్రికలు.

పత్రికల వాళ్ళకి మోరల్స్ వున్నమాట నిజమే కానీ, మిగతా వాళ్ళందరూ ప్రచురించి తాము ప్రచురించకపోతే ఎలా_ అన్న ఉద్దేశ్యంతో అందరూ ప్రకటించేరు!

కొన్ని పత్రికలు తాటికాయలంత హెడ్ లైన్సుతో "చంద్రుడు శాశ్వతంగా అస్తమించబోతున్నాడా?" "చంద్రుడిక లేడా?" అని వేస్తే మరికొన్ని పత్రికలు __ మరొక పదిరోజుల్లో భూమికి రాబోతున్న విపత్తు గురించి వర్ణించేయి. పగులుతున్న అగ్ని పర్వతాలు ఫోటోలూ, హృదయవిదారకంగా ఏడుస్తూన్న పిల్లల ఫోటోలూ వేసేయి.

నిజంగా పదిరోజుల్లో యిదంతా జరగబోతుందని అందరికి పరిపూర్ణంగా నమ్మకం చిక్కుటలేదు. ఆ ఆత్మవంచన ఆనందాన్ని యిస్తున్నప్పుడు దాన్ని ఎవరూ వదులుకోవటానికి ఇష్టపడడం లేదు.

ఎక్కడ చూసినా ఆ కబుర్లే. దాని గురించి ప్రసక్తే. అవుతుంఅని కొందరు కాదని కొందరు వాదనలు. పైకి మాత్రం నవ్వు. నవ్వు వెనుక ఆందోళన. 'అలా కాదులే' అన్న ధైర్యం. మళ్ళీ ఏమవుతుందో అన్న దిగులు.

సమయం గడుస్తూనే వుంది.
సాయంత్రం అయింది.
రాత్రయింది.
ఆఫీసుల్లో ఎవరో ఆ రోజు పనిచెయ్యలేదు.
అందులో ప్రధాని స్వయంగా చూసిన వింత ముఖ్యాంశము__ దానికి తోడు కొన్ని కల్పనలు, భూమి బీటలువారింది వగైరా.
పదకొండయింది.
ఈ విషయాన్ని నమ్మనివారు హాయిగా నిద్రపోతున్నారు.
లోపల నమ్మి, పైకి నమ్మనట్టు నటించేవారు ఏదో పనున్నట్టు బయటకొచ్చి ఆకాశంవైపు చూసి వెళుతున్నారు.
వివిధ దేశాల శాస్త్రజ్ఞులు శ్రీలంక చేరుకున్నారు.
పావు తక్కువ పన్నెండు....
అందరి మనసుల్లోనూ టెన్షన్.

టెలిస్కోప్ పక్కన ప్రొఫెసర్ మొహంలో ఏ భావమూ లేకుండా నిలబడి వున్నాడు.
మోచేతుల్లో మొహం దాచుకొని మౌనంగా కూర్చొని వున్నాడు రమణ. అతడెంత తప్పుచేశాడో అర్థమయిన తర్వాత... అప్పటివరకూ మాట్లాడలేదు అతడు.

ఐదు నిమిషాలు తక్కువ పన్నెండు.

పది నుంచి ముపై లాంగిట్యూడ్ మీద __ పన్నెండు గంటలా మూడు నిమిషాలకి__
పన్నెండు కావస్తుండగా జనం. ఎక్కడ చూసినా జనమే. తలలు ఆకాశానికెట్టి.. నిశ్శాబ్దంగా ఆత్రంగా....నమ్మకానికీ, అపనమ్మకానికీ మధ్య ఘర్షణతో.
పన్నెండు.
రాజయ్య తలెత్తి చూసేడు.
ముసలాయన కిటికీ చూస్తున్నాడు.
ప్రకాశరావు పాలిపోయిన మొహంతో నిలబడి వున్నాడు.
పన్నెండు గంటలా రెండు నిమిషాలు, నాలుగు నిమిషాలు, ఐదు నిమిషాలు.....
రమణ ఆనందంతో అరిచేడు. "చంద్రుడు కదల్లేదు" అని. "ది మూన్ హాజ్ నాట్ మూవ్డ్...." అతడి గొంతు గాలిలో ప్రతిధ్వనించింది.

ప్రొఫెసర్ మాట్లాడలేదు. దూరం నుంచి జనం నవ్వులు! ఆనందం. రిలాక్సేషన్ కలిసిన నవ్వులు. రమణకే అనుమానం వేసింది. మళ్ళీ ఆకాశం కేసి చూశాడు. చంద్రుడు అలాగే వున్నాడు.

కానీ....కానీ.... పెద్ద ఫుట్‌బాల్ బంతిలా నిండుగా వుండవలసిన వాడు చిన్న టెన్నీస్ బంతిలా అయిపోతున్నాడు. ఇంకా ఇంకా కుదించుకు పోయి ... క్షీణమవుతున్నాడు.
రమణకి విషయము అర్థమైంది.
పక్కకి కాకుండ వెనక్కి, వెనక్కి వెళ్ళిపోతున్నాడు... నక్షత్రంవైపు ... చంద్రుడు వెళ్ళిపోతున్నాడు.

దాదాపు ఇరవై అయిదు మిలియను సంవత్సరాల నుంచీ, భూమిని అంటిపెట్టుకొని తిరిగిన చంద్రుడు .... ఎంతోమంది ప్రపంచ కవులకీ, గాయకుల భావాలకి వూపిరిపోసిన చంద్రుడు... ఎంతో మంది పాపలకి తల్లులు ఆటబొమ్మగా చూపెట్టిన చంద్రుడు... నెమ్మది నెమ్మదిగా అనంత విశ్వంలోకి అదృశ్యమైపోతున్నాడు.

హాహాకారాలు__

ఎవరో భయంతో అరుస్తున్నారు.
పోలీస్ వ్యాన్ సైరన్ మోగిస్తూ తిరుగుతూంది.
పత్రికా విలేఖరులు విదేశాలకి వార్తల్ని పంపుతున్నారు.
జనం మొహాల్లో భయం, వేదన.
ఒక స్త్రీ మూర్చపడిపోయింది. ఒక కుర్రవాడు గుక్కపెట్టి ఏడుస్తున్నాదు. చూసిన దృశ్యాన్ని నమ్మలేక చాలా మంది స్థంభించిపోయేరు.
ఆకాశం చీకటిని పులుముకొంది. బొట్టులేని స్త్రీ మొహంలా కళావిహీనమైంది. కళకళలాడే చమ్ద్రుడిక లేదు.
పదిరోజుల్లో భూమి కూడా వుండడు.
ఎవరో బిగ్గరగా రోదిస్తున్నాడు.
ప్రళయం ప్రారంభమైంది.

ఆగష్టు ఆరు

ఆగష్టు ఆరో తారీఖు రాత్రి పన్నెండు గంటలకి చంద్రుడిని ప్రాక్సిమా సెంక్చువరీ ఆకర్షిస్తున్న సమయాన భూమ్మీద ఒక ప్రదేశంలో బ్రహ్మాండమైన్ అవిస్ఫోటనం జరిగింది మిండనోవా డీప్‌లో. అయితే అది మరుసటిరోజు కాని వెలుగులోకి రాలేదు.

ఒక థియరీ ప్రకారం చంద్రుడు ఒకప్పుడు భూమిలో ఒక భాగమే. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రమ్ వున్న ప్రాంతం నించి విడిపోయేడు. ఆ ప్రదేశాన్నే మిండనోవా డీప్ అంటారు. చంద్రుడిలో వున్న అర్మాల్ కొలైట్ అన్న పదార్థం పసిఫిక్ సముద్రాంతర్బాగములో ఇంకా కొద్దిగా వుంది కాబోలు అదే సమయానికి చంద్రుడితోపాటూ అదీ ఆకర్షితమై పైకి లేచింది. ఫలితంగా ఆ సముద్ర గర్భములో కనీ వినీ ఎరుగనంత పెద్ద ప్రేలుడు సంభవించింది.

'మౌంట్ విసాలిన్' అన్న అగ్నిపర్వతం ప్రేలినప్పటి ప్రమాదమ్ కన్నా ఇది రెండు రెట్లు పెద్దది. ఎర్రమంటలు సముద్రం మధ్య లేచినయ్. ఆ ద్వని కొన్ని వందల మైళ్ళ దూరం వరకూ వినిపించింది. ఆ రాత్రంతా పొంగే లావాకీ, సముద్ర జలాలకి మధ్య ఘర్షణ జరుగుతూనే వుంది.

ప్రేలుడు సంభవించగానే నీరు ఆవిరై మేఘంగా పైకి లేచింది. జలచరాలు చచ్చి తెప్పలా పైకి తేలాయి. ఆవిరైన నీరు మేఘమ్లా మైళ్ళ దూరం వ్యాపించింది. ఆ ఆవిరి వేడి ఆస్ట్రేలియా వరకూ సోకింది. చచ్చిన జలచరాలు న్యూజిలాండ్ తీరంవరకూ కొట్టుకొచ్చేయి.

అన్నిటికంటే హృదయవిదారకమైన దృశ్యమ్ ఏమిటంటే ... ఆ అగ్నిపర్వత విస్ఫోటనానికి టహుటీ, హనలులూ, హవాయి, సాలమన్, ద్వీపాల్లో వున్న ప్రజలు కనీసం కెవ్వున కేకవేయడానికి కూడా సమయం చిక్కినంతటి వ్యవధిలో శలభాల్లా మాడిపోయారు.

ఈ వార్త మరుసటిరోజు కార్చిచ్చులా ప్రపంచం అంతా వ్యాపించింది. ప్రజలు నిర్వీర్యులయ్యేరు. ప్రళయం అనివార్యం.

ప్రాక్సిమా సెంక్చువరీ భూమివైపు దూసుకొస్తూనే వుంది.
ఇంక పదిరోజులు... పదిరోజులే....!
మరనం తప్పదని తెలిసిన మనిషి ఏం చేస్తాడు.....?

*************************************************************************
ఏడు: ఇల్లు:

రేడియోలో వార్తలు రావటం పూర్తయింది. ముఖ్యంగా చంద్రుడి గురించీ, పసిఫిక్ లో జరిగిన ప్రళయం గురించీ విని... "ఇంతకీ దాన్ని ఆపటనికి మనవాళ్ళేం చేస్తున్నారో చెప్పరేం" అన్నాడు ముసలాయన విసుగూ, ఆత్రం నిండిన కంఠంతో.

"మన వాళ్ళేం చేస్తారు? అదేమన్నా రోగం అయితే ముందు కనుక్కుంటారు. యుద్దం అయితే శాంతి సంప్రదింపులు పెడ్తారు. కానీ వస్తూన్న బ్రహ్మాండమైన నక్షత్రాన్ని ఎలా ఆపగలరు? అసలా నక్షత్రమ్ భూమి కంటే కొన్ని వందల రెట్లు పెద్దదట...." అన్నాడు ప్రకాశరావు. అతది మొహం భయంతో పాలిపోయింది. నిద్రలేక కళ్ళు పీక్కు పోయాయి.
ఇంతలో లోపల్నుంచి జానకి వచ్చింది.
కట్టెలు మండక ఆమె కల్ళు పొగకి ఎర్రగా వున్నాయి. మాసిన చీరె, అలసిన మొహం.

"పని మనిషి రాలేదా?" ముసలాయన అడిగేడు. లేదని చెబుతూ బయటికి వెళ్ళింది. "అసలు చస్తుంటే ఇదొకటి" ముసలాయన గొణుగుతున్నాడు. ఏదో ఒకటి మాట్లాడకపోతే నిశ్శబ్దం మరింత భయంకరంగా వుంది.

ఎప్పుడూ సైకిళ్లతోనూ మోటారు శబ్దాలతోనూ నిండివుండే రోడ్డు నిర్మానుష్యంగా వుంది.

"ఒకసారి అష్టగ్రహ కూటమి అని, నీ చిన్నప్పుడు వచ్చింది" అన్నాడు ముసలాయన. ఇంతలో రమణ వచ్చేడు. చేతిలో సంచినిండా సామానులు_ బియ్యం.
"ఎందుకివన్నీ...."
"ముందు ముందు దొరుకుతాయో లేదో" అన్నాడు రమణ.
ఎవరూ మాట్లాడలేదు
పక్కింటివాళ్ళు ఖాళీ చేస్తున్నారు పుట్టింటికి వెళ్ళడం కోసం. వీధి చివర ఎవరో వస్తున్నట్టు కనబడి, కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకొని చూసింది జానకి, పనిమనిషి మంగి.
దాటుకొని వెళుతుంటే ఆపింది.
"ఏమే! పనికి రాలేదు"
"ఇంకా పనేటి అమ్మగారూ, పది రోజుల్లో పెళయం వత్తూంటే...." అందది.
"అందుకని రావా?"
"అప్పుడు చూసుకుందాం లెండి, బతికుంటే...."
దాని మాట్లకి నవ్వొచ్చింది జానకికి. "ఇదిగొ యిది చూసేరా" అంటూ లోపలికి వెళ్ళీంది ఇంట్లో వాళ్ళకి చెప్పటానికి.
అది అంత నవ్వుకోవలసిన విషయం కాదనీ....
పనిచేయడానికి పనిమనిషి తిరస్కరించటం మనిషి తన వ్యవస్థ కట్టుబాట్లని ఛేదించే మొదటి ప్రయత్నం అని జానకికి ఆ క్షణం తెలీదు.

*******************************************************************************

పల్లె:

స్వామీ బుద్భుదానందబాబా నవ్వేరు.
"ఈ ప్రపంచాన్ని నేను రక్షిస్తాను" అన్నాడు.

".... మొన్న భగవాన్ నా కలలొ కనబడి, ప్రపంచం అంతం అవటం గురించి చెప్పేరు. 'అప్పుడే ఎందుకు స్వామీ' అన్నాను.
'పాపాలు ఎక్కువైపోయాయి. కల్కిపుట్టే సమయం ఆసన్నమయింది' అన్నారు. ఆ కల్కి ఆకాశంలోంచి దిగుతాడట. నీళ్ళని శంఖంగా_ చంద్రుడిని చక్రంగా ధరిస్తాడట. అందుకే ఆ రోజు సముద్రం పేలిపోయింది. స్వామివారి చక్రంగా మారడానికి చంద్రుడు వెళ్ళీపోయేడు. ఇక కల్కి రావడమే ఆలస్యం...."

భక్తులు భయంతో వణికిపోయేరు.
"ఎలా స్వామీ?" అన్నది హైమావతి.

"నాకీ సంగతి అంతా సంవత్సరం క్రితమే తెల్సు. అయినా భయపడ్తారని చెప్పలేదు" స్వామివారు నవ్వేరు. "నేను మిమ్మల్ని రక్షిస్తాను."

"శ్రీ బుద్భుదానందస్వామి బాబాకి...." అరచింది హైమావతి భక్తి పారవశ్యంతో.
"జై...." అన్నారు భక్తూ ముక్తకంఠంతో.

పల్లె పల్లె అంతా అక్కడుంది. కరనం ముస్నబు, రాజయ్య రంగారావు, కరణంగారి కోడలు హైమావతి, తల్లి భాగీరథి _ అందరూ.

బాబాగారు బూడిదని అందరికీ పంచుతూ అన్నారు. "నేనే భగవంతుడ్ని. భగవత్ స్వరూపాన్ని. నేను మిమ్మల్ని రక్షించటానికే పుట్టేను. నిజంగా నన్ను నమ్మిన వాళ్ళని నేను రక్షిస్తాను. మీ చేతులకి తాయెత్తు కడతాను. ఇంకో నాలుగు రోజుల్లో నా నిజమైన భక్తుల చేతులకి తాయెత్తు కట్టబడుతుంది."

"ఇదంతా మోసం" అని బిగ్గరగా అరవాలన్న కోర్కె బలవంతం మీద ఆపుకున్నాడు డాక్టర్, ఆవూరికి కొత్తగా వచ్చినవాడు.

అరిస్తే పల్లె మొత్తం ఏకమై తనని హాస్పిటల్ పంపిస్తుంది. అజ్ఞానం రాజ్యమేలుతున్న దేశంలో జ్ఞానం గురించి మాట్లాడటం కన్నా మౌనంగా వుండటమే మంచిది.

లేచి బయటికి వచ్చేడు.
"..... స్వామీ అయ్యప్ప సన్నిధి... అదే మాకు పెన్నిధి....." అని సినిమా స్టయిల్లో పాడుతున్నరు భక్తులు.

డాక్టర్ మౌనంగా సాగిపోతున్నాడు.
"ఎల్లిపోతున్నారే స్వామీ?" వెనుకనుంచి రాజయ్య అరిచేడు.
"ఉండీ చేసేది ఏముంది?"కోనేటి ప్రక్క చీకట్లో కలిసి పోయేడు.

వర్షం పడి పదిరోజులైనట్టుంది.

నాలుగు నీటిచుక్కలు పడగానే లేచిన కుక్క గొడుగులు.

****
దేశం
*****

ఆగష్టు ఆరవ తారీఖు రాత్రి హాయిగా నిద్రపోయింది అవినాష్ ఒక్కడే. హాయిగా నిశ్చింతగా నిద్రపోయేడు.
చాలు....
ఈ చంద్రుడి గొడవతో ప్రజలదృష్టి అటుమళ్ళుతుంఇ. ప్రళయం పేరిట భయంతో..... రజకీయాలపట్ల ఆసక్తి తగ్గుతుంది. ప్రలయం వస్తుందా రాదా అన్నది వేరే సంగతి. వచ్చినా రాకపోయినా అంత పెద్ద ప్రమదమేమీలేదు. రాజకీయాల్లో ప్రతిక్షణమూ ప్రళయమే. ఎవడు ఏ క్షనం పార్టీ మార్చేస్తాడో తెలియదు. దక్షిణాదివడు ప్రధాని కావాలని ఒకవైపు గొడవ. పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం ఒకవైపు అన్నిటి కన్నా పెద్ద ప్రమాదం....

తమ పార్టీ పదవిలోకి వచ్చేక దేశపు కరెన్సీ విలువ ఇంటర్నేషనల్ మార్కెట్ లో రోజురోజుకి పడిపోతూంది. ఏదో అద్భుతం జరిగి తేనే తప్ప దేశాన్ని ఎవరూ రక్షించలేరు. ఇప్పతివరకూ దేశం నాశనమై పోతుందని బాధ. ఇప్పుడు మనతోపాటూ అందరూ పోతున్నారన్న తృప్తి.

ఇంతలో ఫోను.
సెక్రటరి ప్రధాని వస్తున్నారని వార్త.
మరుసటి నిముషంలో జగదీష్ హడావుడిగా ప్రవేశించాడు. "రండి! మనం అర్జంటుగా ప్రెసిడెంటు దగ్గరకి వెళ్ళాలి"

"ఎందుకు?"

"దరిలో మాట్లాడుకుందాం"

అతడి మొహం చూసి ఏదో ఉపద్రవం జరిగి వుంటుందనుకున్నాడు అవినాష్.
ఇద్దరూ కారులో కూర్చున్నాక కారు కదిలింది. లోపల ట్రాన్సిష్టర్ వినిపిస్తుంది.

__ ఒక ముఖ్య ప్రకటన. ఆగష్టు పదిహేడున జరగబోయే ప్రమాదాన్ని ఊహించుకొని ఇప్పటినుంచి భీతి చెందవద్దని ప్రజల్ని ప్రధానమంత్రి కోరేరు. తమ తమ పన్లని విడిచిపెట్టి, ఈ ఆలోచనలతో మరింత కల్లోలాన్ని సృష్టించవదని హెచ్చరిస్తున్నారు. బి.బి.సి. రేడియో కేంద్రం_ ఇప్పట్నుంచి ప్రతి మూడు గంటల కొకసారి___

టప్ మన్న చప్పుడుతో ఆగిపోయింది రేడియో.

ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు.
"ఏమైంది?"
"ఏమవుతుంది?"
చాలా చిన్న విషయం'
రేడియో స్టేషనులో డ్యూటీ ఆఫీసరుకి ఆరుగురు పిల్లలు. అతదు గోవాకి చెందినవాడు. రేడియోలో ఈ వార్త వస్తూవుండగా అతడికి అకస్మాత్తుగా తన పిల్లల్ని చూడాలని బుద్ది పుట్టింది. క్షణాల్లో ఆ కోర్కె బలీయమైంది.

దేని కోసమ్ విధి నిర్వహణని నమ్ముకొని వుండాలి? వెళ్ళిపోతే....!

".... ఉద్యోగం పోతుంది. అంతేగా?"
ప్రాణమే పోయేటప్పుడు ఈ ఉద్యోగం పోతే మాత్రమేం?

అతడి కళ్ళముందే ఆరేళ్ళ చిన్న కూతురు జాలిగా మొహం పెట్టి 'రావా నాన్నా' అంటున్నట్టు అనిపించింది/

వెంటనే అతడో నిర్ణయానికి వచ్చినట్టు రిసీవర్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి బయటి కొచ్చేశాడు/

ఆ క్షణం నుంచీ రేడియో ప్రసారాలు ఆగిపోయాయి/
జగదీష్ ఆందోళనగా అవినాషువైపు చూసేడు/ అతడు తల వంకించాడు/
ఇద్దరి మధ్యా మౌనంగా రాజ్యమేలింది/
జరుగుతున్నది చూస్తూ జరగబోయేది ఊహించుకోగలరు వాళ్ళు/
నిజానికి జగదీష్ భార్యకూడా ఈ చివరి రోజుల్లో తమవాళ్ళతో పల్లెల్లో గడపాలని కోరింది/ కానీ 'ఏమీ జరక్కపోతే' ఆ తర్వాత ప్రతిపక్షాల హేళనకు గురికావల్సి వస్తుందని భయపడ్డాడు/

"ప్రాణమే పోతున్నప్పుడు ఎందుకీ పదవి?" అని అడిగిందామె/

నిజమే పేరుకి ప్రధానమంత్రి/ కానీ బ్యాంకులో ఐదువేలకన్నా ఎక్కువలేదు/ నెలరోజుల క్రితం తన భార్య దక్షిణభారతదేశపు కంచి పట్టుచీర అడిగితే, తను పొదుపు గురించి ఉపన్యాసం ఇవ్వడం జ్ఞాపకం వచ్చింది/ ప్రధానమంత్రిగా రిటైరయ్యాక వచ్చే నెలసరి ఆదాయం కూడా పెద్ద ఎక్కువేమీ కాదు/

ఏ బ్యాంక్ అయినా ప్రధానమంత్రికి పెర్సనల్ లోన్ యివ్వటానికి వెనుదీయదు/ ఉవ్వుళ్ళూరుతుంది కూడా/ కానీ తీర్చటం? (కావాలనుకుంటే తీర్చనక్కరలేదు కూడా/ అది వేరే సంగతి) చచ్చినా తను అలా చేయలేడు/

ఆలోచన మళ్ళీ చావు దగ్గిరకు వచ్చేసరికి అతడు కొద్దిగా కదిలేడు/
చేతికి ప్రక్కనే వున్న పేపర్లు తగిలినయ్/
కారు వెళ్తూనే వుంది/
అతను చదవసాగేడు/
పేపర్లు రకరకాలుగా వార్తల్ని ప్రచురించినయ్/ రేపట్నుంచి ఆ పేపర్లు కూడా రావేమో/ ప్రపంచం స్థంభించిపోవటం అంటే అదే/
"ఆయుర్దాయం ఇక ఐదురోజులే" అన్న హెడ్డింగ్ తో వార్త పెద్ద పెదద అక్షరాల్లో పడింది/ దానిక్రింద "డిల్లీలో అధికారుల సమావేశం" అని వుంది/

అతనికి నవ్వొచ్చింది/
ప్రపంచ ప్రళయాన్ని ఆపటానికి డిల్లీలో అధికారులు ఏం చెయ్యగలరు?

ప్రతీ చిన్న విషయాన్నీ గోరంతలు కొండంతలు చేసి సర్క్యులేషను పెంచుకొనే ఒక తెలుగు దినపత్రిక ప్రళయం రకరకాల వార్తల్తో పేపరంతా నింపింది/ పవిత్రమైన హెడ్డింగులు//// దానికింద చిత్రమైన వార్తలు/

భగవంతుడే శరణ్యం

__రోజులు గడిచేకొద్దీ మృత్యువు ముంచుకొస్తున్నదని ప్రజలు గజగజ వణికిపోతున్నారు/ గుండెబలం లేనివాళ్ళు రోజూ చస్తూ బ్రతుకుతున్నారు/

ఇంకోచోట ఇంకోవార్త/

రామనామతారకం

__ ఈ రోజునుంచీ అయిదు రోజులపాటు రామనామాన్ని జపించిన వాళ్ళని ఆ నక్షత్రం ఏమీ చేయలేదని భగవతార్ చెప్పారు/ పూనాకు చెందిన ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త ఎ/ఇ/ఐ/యస్/ అన్న అక్షరాలు తమ పేర్లో వుంటే మరణం తప్పదని పేర్కొన్నారు/

ప్రధానికి నవ్వొచ్చింది/ పై నాల్గు అక్షరాలలో ఏదో ఒకటి లేకుండా ఎలా వుంటుంది? అయినా ఈ పత్రికలకి బుద్దిలేదు/ ప్రజలు అసలే భయభ్రాంతుల్తో వుంటే ఈ వార్తలేమిటి?

వీళ్ళ మొరాలిటీ ఏమైంది?

అసలు తనే తప్పుచేశాడు/ పదిరోజుల క్రితమే అర్డినెన్స్ ద్వారా ఆ పత్రికల్ని కంట్రోలు చెయ్యాలసినది/
ఇప్పుడనికొని ఏం లాభం?
జగదీష్ చాలా వర్రీడ్ గా __ ఆందోళనగా కనిపిస్తున్నాడు/

వాళ్ళు ప్రెసిడెంటు నివాసస్థలం చేరుకొనే సరికి ఎనిమిదయింది/ అప్పటికే అక్కడ మిగతా వాళ్ళున్నారు/ అయిదు ఏరియాల లెఫ్టెనెంట్ జనర్ల్స్ (ఆర్మీ), చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ మర్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ __ అందరికంటే పైన సుప్రీమ్ కమేండర్ ఆఫ్ ది ఆర్మ్ డ్ ఫోర్సెస్ _ ది ప్రెసిడెంటు ఆఫ్ ది ఇండియా/ వీళ్ళు చేరుకోగానే సమావేశం మొదలైంది/ సమస్య చాలా చిన్నది/ కానీ ఫలితాలు ఊహించలేనటువంటివి/

సైన్యంలో చాలా మంది తమతమ ఇళ్ళకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు/ అదీ సమస్య/

ఈ పదిరోజులూ తమతమ భార్యాపిల్లల్తో గడిపి __ చావుకు సకుటుంబంగా ఆహ్వానించాలనుకుంటుననరు/

ఆ హాల్లో వున్న వారందరి మొహాలూ గంభీరంగా వున్నాయి/ చాలా సేపు ఎవరి ఆలోచనలో వాళ్ళుంది ఎఅరూ మాట్లాడలేదు/ సైనికులు క్రమశిక్షణకి అలవాటుపడినవారు కాబట్టి__ తమ కోర్కెని పై అధికారులకి విన్నవించుకున్నారు/ కొన్ని దేశాల్లో అప్పుడే సైన్యంలో అలజడి మొదలవటం __ చాలా మంది 'కనబడకుండా' పోవతం జరిగింది/

చర్చ చాలాసేపు జరిగింది/

ఈ ముందు పదిరోజులూ ఎలా వుంటుందో తెలీదు/ ఎప్పుడు ఎవరి అవసరం వస్తుందో తెలీదు/ అలా అని సైన్యాన్ని 'బలవంతంగా' ఆపలేం/// మొత్తానికి ఒక నిర్ణయం జరిగింది/

కెఫ్టెన్ లెవల్ నుంచీ పైనవున్న అధికారులు మాత్రం వుండాలి, మిగతావారు ఆగష్టు పన్నెండు నుంచీ వెళ్ళిపోవచ్చు/

రాత్రి పదింటికి సమావేశం ముగిసింది/

ఇక్కడ ఇది ముగుస్తున్న సమయంలో////

ప్రపంచం

లిబియా రాజధాని ట్రిపోలీలో ఒక రహస్య సమావేశం జరిగింది/ ఇరాన్ సిరియా, యమెన్, సూడాన్, జోర్డాన్, ప్రధానమంత్రులు అందులో పాల్గొన్నారు/

ఇంత మంది ఒకచోట కూడేరంటే, దానికి గమ్యం ఒక్కటే ఇజ్రాయిలు/

"జెరూసలేం" అంటే "శాంతినిలయం" అని అర్థం/ కానీ అదేం చిత్రమో? ఆ నగరంలో శాంతి అన్న పేరే వినపడదు/ క్రీస్తు శకం డెబ్బైలో రోమన్లు దానిని సర్వనాశనం చేసేరు/ దాదాపు ౧౦లక్షల మంది యూదుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేరు/ మూడంతస్తుల భవనాలమీద నుంచి పసిపిల్లల్ని రోడ్ల మీదకు విసిరేసేరు/ జెరూసలేం లోకి యూదుల ప్రవేశం నిషేధించబడినది/

ఇది జరిగిన పంథొమ్మిది వందల సంవత్సరాల తరువాత ఇజ్రాయేలు కు విముక్తి లభించింది/ ఈ మధ్య కాలమ్‌లో ఆ నగరం నలబై ఆరు దండయాత్రలకి గురి అయింది/

ప్రవక్త మహమ్మద్ స్వర్గానికి వెళ్ళింది ఇక్కణ్నుంచేనని మహ్మ్మదీయుల నమ్మిక/ మక్కా మదీనాల తర్వాత ముస్లింలకు ఇదే పవిత్ర స్థలం/ అయితే మదీనాల తర్వాత ముస్లింలకు ఇదే పవిత్ర స్థలం / అయితే క్రీస్తుని శిలువ వేసింది కూడా ఇక్కడే/ అందుకు క్రైస్తవులకి యిది "దేవుడు తన పేరు వ్రాసిన నగరమ్" అయింది/

౧౯౪౮ లో బ్రిటీషు వలస రాజ్యం నుంచి ఇజ్రేలు స్వాతంత్ర్యాన్ని పొందిన కొన్ని గంటల్లోనే చుట్టూ వున్న ఎనిమిది అరబ్బు రాజ్యాలు మూకుమ్మడిగా దండెత్తి దాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలని చూసి, ఓడిపోయాయి/

యూదుల గుడి__ ముస్లింల మసీదు వున్న "డూమ్ ఆఫ్ ది రాక్" భూమ్మీద మనుషులున్నంతవరకూ సమస్యగానే వుంటుందని మేధావుల అంచనా__
********************************************************************************

కమేండర్ ఇన్ చీఫ్ సూడాన్__ "ఈ ఆఖరి రోజుల్లో జెరూసలేంని జయించకపోతే దేవుడు క్షమించడ"ని అన్నారు/ ఈజిప్టు ప్రెసిడెంట్ ఒకే ఒకమాట అన్నాడు/ "ఇజ్రాయేలు సముద్రంలోకి తోసెయ్యాలి/ త్రో ఇట్ ఇన్ టూ ది సీ__"

అందరూ హర్షద్వానాలు చేసేరు/

అయిదు నిమిషాల అనంతరం ఒక తీర్మానం చెయ్యబడింది/

ప్రపంచపు ఆఖరిరోజులని 'సెలబ్రేట్' చేసుకోవటానికి మేమంతా జెరూసలేంలో కల్సుకొంటాం అని ప్రతిజ్ఞ చేస్తున్నామ్/ జెరూసలేంని దక్కించుకోవటానికి, మా పవిత్ర స్థలాన్ని ఆఖరిరోజుల్లో మా ఆధీనంలో ఉంచుకోవటానికి ప్రాణాలైనా అర్పిస్తాం/ యుద్దాన్ని ప్రకటిస్తున్నాము/
ప్రతి ఒక్కరూ ప్రమాణం చేసేరు/

ప్రపంచపు రాజకీయాలు ఇలా మారుతూ వుంటే, ఇంకోవైపు సాంఘీకమైన మర్పు ఇంకోలా వుంది/ మత్తుమందు మనిషిని మానసికంగా బలహీనుడ్ని చేస్తుంది/ అమెరికాలో దాదాపు కోటిన్నర జనాభా, మందు అలవాటుపడిన వారున్నారని అంచనా/ ప్రపంచం అంతమవబోతుందనగా అది మూడు కోట్లకి పెరిగింది/ మార్జువానా, హెరాయినుల ధర రెండింతలైంది/

చావు భయాన్ని మత్తులో పోగొట్టుకోవడం మనిషికి సులభంగా కనిపించింది/

భూమి పేలిపోయినా పర్వతాల ఉపరిభాగం సురక్షితం అనే నమ్మకాన్ని కొంతమంది శాస్త్రజ్ఞులు వ్యక్తం చేసేరు/ ఆ మాటలమీద నమ్మకం వున్నవాల్లు పదిరోజులకు సరిపడా ఆహార పదార్థాల్ని మూటకట్టుకొని కాంచనగంగ, మకాలు మౌంట్ బ్లాంక్, ఆల్ఫ్స్ పర్వతాల మీదకు వెళ్ళి పోయారు/ అయితే ప్రపంచంలో ఎత్తయిన ఈ పర్వతాలు ఆ తర్వాత రెండురోజుల్లోనే పేలిపోయేయి/ వెళ్ళీన వాళ్ళు సజీవసమాధి అయిపోయేరు__ నిశ్శబ్దంగా __ మిగతా ప్రపంచానికి గుర్తులు కూడా మిగల్చ కుండా///

ఆగష్టు పన్నెండు


ప్రొఫెసరు ఆనందమార్గం తన ఇంట్లో గదిలో కూర్చొని వున్నాడు/ అతడి ముందు కప్పులో టీ డికాక్షన్ వుంది/ అది చల్లారిపోయి రెండు గంటలయింది/ దాన్ని గురించి పట్టించుకోకుండా ఆలోచిస్తునాడు/ దాదాపు డెభ్భై రెండు గంటల్నుంచీ ఒకటే ఆలోచన/

పదిహేడో తారీఖు పదకొండు గంటలా/ పన్నెండు నిముషాలకు మూడు సెకన్ల పాటు భూమిని ఆ నక్షత్ర ఆకర్షణ నుంచి తప్పించటం ఎలా?

ప్రఫెఅరు ముందో కాగితం వుంది/ దాన్నే చాలాసేపటి నుంచీ పరీక్షిస్తున్నాడు/

ఇంతలో తలుపు చప్పుడైంది/

రమణ!

"ఆఫీసు కెళ్ళలేదా?" అడిగేడు/

రమణ క్షనం విస్తుపోయి సర్దుకున్నాడు/ మతిలేని ప్రొఫెసరు మాటిమాటికి తన పేరు సార్దకం చేసుకుంటూ వుంటాడు/

"మీరు బయటకొచ్చి ఎన్ని రోజులయింది?"

"నాల్గురోజులు/ ఇప్పుడే బయటకు వెళ్దామనుకుంటున్నాను/ ఇంట్లో ఏమీ లేవు/"

"బయట కూడా ఏమీ దొరకవు" అన్నాడు రమణ/ "ఒకసారి బయటకొచ్చి చూడండి/ అంతా స్మశానం/// స్మశానంలా వుంది/"

ప్రొఫెసరు ఒక్క క్షణం మాట్లాడలేదు/ రమణే అన్నాడు/ " మా నాన్న చివరిరోజులు కాశీలో గడపాలన్నాడు/ ప్రయత్నిస్తే రైళ్ళు నడపటం మానేసి రెండ్రోజులయిందని తెలిసింది/"

"మొత్తం అంతా స్థంబించిపోయిందన్నమాట/"

"అంతా కాదు////" రమణ కంఠంలో గంభీరత చోటుచేసుకుంది/ "మనిషిలో రాక్షసత్వమ్ పురులు విప్పుకుంటూంది/"

"అంటే///?"

"అందమైన ఆడవాళ్ళున ఇంటిలోకి జొరబడి గూడాలు మానభంగాలు చేస్తున్నారు/ ఆహారపదార్థాల్ని దోచుకుంటున్నారు/ అడ్డుకొనే వారు లేకపోవడంతో పైశాచికత్వం విజృంభిస్తుంది/ చావెలాగు తప్పదని తెలిసిన మనిషి అన్నిటికీ తెగించాడు/ ఈ చీకట్లో విన్న వెలుగు రేఖ ఒకటే పాపభీతితో డబ్బున్న వాళ్ళు చేస్తున్న సంతర్పణలు////"

"పాపభీతా?"

"అవును" అన్నాదు రమణ/ "చాలా విషయాల్ని బయట పెడుతుందది/ పాపం ఒక శ్రేష్టిగారు/ అన్ని తరాలనుంచి సంపాదించిన పాపపు డబ్బుని బంగారంగా మాచుకున్నాడో_ తను మూడో అంతస్తుమీదకి ఎక్కి నాణేల్ని వెదజల్లి పిచ్చివాడైపోయాడు/"

"ప్రళయం తప్పడనే నమ్మకం అంత బలంగా ఏర్పడిందా అందరికీ/"

"మామూలుగా అయితే నమ్మకమూ అపనమ్మకముల మధ్య కొట్టుమిట్టడేవారు/ కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా భూమి బీటలువారడం కనిపిస్తూనే వుంటే__ ఇంకా తమనెవరూ రక్షించలేరని నమ్మకం ప్రబలుతోంది/"

ప్రొఫెసరు ఉలిక్కిపడి "భూమి బీటలువారుతోందా?" అని అడిగేడు/

రమణకి విసుగేసింది/ "ఒక్కసారి బయటకు రాకూడదూ?"అన్నాడు/ "జరుగుతున్న విధ్వంసకాండ కల్లారా చూడొచ్చు/"

"లేదు లేదు/ ఇక్కడే వుండాలి/ ఏదయినా చెయ్యాలి/ ఏదయినా ఆలోచించాలి/ ఏదయినా చేసి ప్రపంచాన్ని రక్షించాలి/"

రమణ జాలిగా ఆ మతిలేని ప్రొఫెసరుకేసి చూసేడు/ ప్రళయ కాలపు ఝుంఝూమారుతంలా దూసుకు వస్తున్న ఈ నక్షత్రాన్ని ఈ అల్ప జీవి ఎలా ఆపుతాడు?

లేచి "వెళ్ళొస్తాను" అన్నాడు/
"అప్పుడేనా?" అన్నాడు/
"వంతులవారీగా కాపలా కాస్తున్నాం/"
ప్రొఫెసరు ఆశ్చర్యంగా "ఎందుకు?" అన్నాడు/
"ఎందుకా ////" పెలవంగా నవ్వాడు రమణ/
"ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా స్థంబించి పోయినందుకు/ ప్రజల్ని ప్రజలే రక్షించుకోవలసి వచ్చినందుకు/"

ప్రొఫెసరు లేచి/ "ఇక్కడ ఇలా వుంటే మిగతా దేశాల్లో ఎలా వుంది?"

"తెలీదు/"

"ఏం?"


"రేడియోస్టేషన్లు పని చెయ్యడం మానేసి రెండ్రోజులయింది/"

ప్రొఫెసరు నిశ్చేష్టుడయ్యాడు/

"వెళ్ళొస్తాను" అన్నాడు రమణ/

ప్రొఫెసరు మాట్లాడలేదు/

రమణ లేచి బైటకొస్తూ తలుపు బలంగా వేసి ముందుకు నడిచేడు/ లోపల ప్రొఫెసరు తిరిగి కాగితాలు పరిశీలించసాగేడు/
తలుపు బలంగా వేసినప్పుడు ఆటోమేటిక్ లాక్ పడిపోయిందని బయట రమణకిగానీ, లోపలున్న ప్రొఫెసరుకిగాని తెలీదు/

****************************************************************

ఆ రోజు బాగా చీకటి పడ్డాక పెద్ద పెద్ద చప్పుళ్ళు వినబడ్డాయి/ ఇళ్ళలో తలుపులు బిగించుకొని కూర్చున్నవాళ్ళంతా హాహాకారాలు చేస్తూ బైటకొచ్చేరు/ అంతకుముందుకన్నా ఎక్కువగా భూమి బీటలువారుతోంది/ ఫెళా_ఫెళా చప్పుళ్ళు చేస్తూ, రెండుగా విడిపోతూంది/ ఆ ప్రదేశంలో వున్న యిళ్ళూ, చెట్లు భూస్థాపితం అయిపోతున్నాయి/ రోదనలు //// అరుపులు//// ఇంకా అయిదు రోజుల తర్వాత రావల్సిన ప్రళయం ఆ రోజే వచ్చినట్లుంది/

దాదాపు పది సెకండ్ల తరువాత అంతా సర్దుమణిగింది/
పదకొండు గంటలా రెండు నిమిషాలయింది/
నిన్నటి రోజూ అదే సమయానికి/
ఆగష్టు పదిహేడు అదే సమయానికి/
ఆ రోజు నుంచీ ప్రతిరోజూ అదే సమయానికి/

అయితే భీభత్సానికి చెదరని వాళ్ళు ఆ పల్లె ప్రజలే/ స్వామివారు ఆ ఒక్క పల్లెని రక్షిస్తామని మాట యిచ్చేరు/ ప్రార్థనలు నిర్విరామంగా జరుగుతున్నాయి/

రాజయ్య కూడా వెళ్ళి తృణమో, ఫణమో అర్పించుకొన్నాడు/

వస్తూంటే చీకట్లో యిద్దరు వ్యక్తులు మాట్లాడుకొంటూ వుండటం కనిపించింది/ ఒకడు భూషణం/ ఇంకొకరు ప్రెసిడెంటు/ మాటల్లో తన పేరు వినిపించటం చూసి అతడు చీకట్లో ఆగేడు/ చెట్టుచాటున వున్న అతణ్ని గమనించని వాళ్ళు అతడి గురించి మాట్లాడుకొంటున్నారు/

"రంగారావు ఆపు సేస్తాడంట _ రాజయ్య పొలం మన స్వాధీనమవకుండా/"

"అంత పెద్దోడయ్యాడా రంగారావు?"

"ఎట్టయినా మనమీద దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు" అన్నాడు భూషణం/

"ఆణ్ణి జూసుకొనేనా ఈ రాజయ్యగాడు ఇన్ని కబుర్లు చెప్తున్నాడు?"

భూషణం మాట్లాడలేదు/

"సరే_ అయితే ఆడేం సేస్తడో _ ఎం సెయ్యగలడో సూద్దాం/ ఆడి కళ్ళముందరే ఆ రాజయ్య గాడ్ని సెట్టుక్కట్టి నిప్పెడ్తే////? ఆడేం సేస్తడో////"

వింటున్న రాజయ్య వణికిపోయేడు/ రెండు ఏనుగులు ఢీ కొంటే మధ్య నలిగిన కుందేలులా వణికిపోయేడు/

పరుగెత్తేడు/ ఆక్కుండా పరుగెత్తీ రంగారావు దగ్గరకు చేరుకొన్నాడు వగరుస్తూ, విషయం అంతా విని మీసం తిప్పుతూ "అంత ధైర్యం వుందటరా వాళ్ళకి?" అన్నాడు రంగారావు/

రాజయ్యకి భయంతో మాట రావటంలేదు/

"సరే_ నేను చూసుకుంటాలే ఆళ్ళ సంగతి/"

దూరం నుంచి "మము బ్రోవరా" అని భక్తులు ముక్తకంఠంతో పాడుతున్నారు/
అక్కడ స్వామివారు శేషశయనం మీద విష్ణుమూర్తిలా పడుకొని వున్నారు/ అక్కడున్న వారి చేతులకు తాయెత్తులు కట్టబడి వున్నాయి/ పూజలు జరుగుతున్నాయి/ డాక్టరు మెట్లుదిగి వస్తూంటే రంగారావు కనబడి నమస్కారమ్ చేశాడు/

"ఎక్కడకో వెళుతున్నట్టున్నారే" అని అడిగేడు ఇంటి ముందున్న స్కూటర్ ని చూస్తూ/

"వెళ్ళిపోతున్నాను రంగయ్యా! ఈ ఆఖరి అయిదు రోజులు పట్నంలో గడుపుదామని" అన్నాడు డాక్టర్/

"అదేమిటి బాబూ _ ఈ పల్లెలో వుండాలని, ఈ పల్లెకు కావాలని అందరూ కోరుకొంటూ వుంటే మీరు వెళ్ళిపోతున్నారే!"

"ఈ పల్లెకా? అర్థంకాక అడిగేడు/

"మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోద్ది/ ఈ తాయెత్తు కట్టుకున్నోళ్ళే బతుకుతారు/"

డాక్టర్ అతణ్ని చూస్తే జాలేసింది/

పల్లెని వదిలి వెళ్తున్న డాక్టర్ని చూస్తే రంగయ్యకి జాలేసింది/ అమాయకుణ్ని చూసి వేదాంతి ఎంత జాలిపడ్తాడో/// వేదాంతిని చూసి అమాయకుడూ అంతే జాలిపడ్తాడు/ డాక్టర్ మౌనంగ స్కూటర్ స్టార్ట్ చేశాడు/ ఆఖరిసారి తనింతకాలం వున్న ఇంటివైపు చూసుకున్నాడు/ ముందుకు సగిపోయేడు/

ఊరు దాటుతూంటే గుడి కనిపిమ్చింది/ స్కూటర్ ఇంజన్ ఆపు చెయ్యకుండానే అలా ఆగి అటు చూసేడు!

బాబావారి చుట్టూ చేరి భక్తులు భజనలు చేస్తున్నరు/ భక్తి పారవశ్యంతో ఊగిపోతున్నారు/ ప్రపంచాన్నీ, ప్రళయాన్నీ, జయించిన ఆనందం వాళ్ళ మొహాల్లో కనిపిస్తూంది/ అసలు మృత్యువు వాళ్ళ దరిచేరదనే నమ్మకంతో_ ఆనందంతో వూగిపోతున్నారు/

అతడికో విషయం అర్థమైంది/

అక్కడ బాబా కాదు ముఖ్యం/

నమ్మకం!

అదే వాళ్ళని కోటలా కాపాడుతూంది/ ఐదురోజులపాటూ వాళ్ళు ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నారు/ తరువాత చచ్చిపోతారు/ అది వేరే సంగతి/ ఈ ఐదు రోజుల సంగతి? తనకున్న మానసిక వ్యధ వాళ్ళకి లేదు/ చావు దగ్గరవుతూందన్న చింతలేదు/ భక్తి వాళ్ళని కాపాడుతూంది/ ఆ గొడుగు క్రింద వాళ్ళు రక్షణ తీసుకొంటున్నారు/


అజ్ఞానం మనిషిని రక్షిస్తుమ్ది
***************************************************
ఇక్కడ నుండి టైపు చేసు ఓపిక లేక క్లుప్తంగా వ్రాస్తున్నాను/
*************************************************
కట్
కట్
కట్


******************************************************************************************

ట్రిపోలీ లో అరబ్బుదేశాలు ఇజ్రాయేలు మీద దండెత్తడానికి తీసుకున్న నిర్ణయం దారుణంగా బగ్గింగ్ చేయబడింది/

అవి అన్నీ ఓడిపోయినాయి/ అమెరికా దారుణంగా బాంబులు వేసింది/

అన్ని పెట్రోలు బంకులు కాల్చివేశాయి/

ఓ దారుణం
ఓ ఘోరం
*****************************************************************************************

ప్రొఫెసరు భాగా ఆలోచించి ఆలోచించి
చివరకు ఓ ఉపాయం కనుగొన్నాడు

ఆక్సీజను తో ఓ పొరని ఆకాశంలో ఏరడిస్తే అది ఆంటీ మాగ్నెట్ గా పనిచేస్తుందని కనుక్కుంటాడు/

కానీ, నడవటానికి ఓపిక లేదు/

రమణ వచ్చి తలుపు కొడితే తాలం వేసి ఉంటుంది/

***************************************************************************************

ఇక్కడ నుంది రచయత గారి ముగింపు నచ్చలేదు నాకు, కనుక నేను మార్చి క్లుప్తంగా వ్రాస్తున్నాను/

తరువాత రమణకి అనుమానం వచ్చి తలుపు పగలగొట్టి వెళ్లి ప్రొఫెసరుని చావు బతుకుల్లో రక్షిస్తాడు/

******************************************************************************

తరువాత పనులు చాలా వేగంగా జరుగుతాయి/

ప్రపంచదేశాలన్నీ చేతులు కలిపి ప్రపంచాన్ని రక్షిస్తాయి/

***********************************************************************
మిగిలిన సమస్యలు కాలానికే వదిలివేయబడుతాయి
వాటిని కాలమే ఓ పరిస్కారం చూపిస్తుంది/

*******************************************************************

ప్రొఫెసరు గారికి నోబుల్ ప్రైజు ఇవ్వటం కాదు, దాని బాబులాటి ఓ ప్రైజు అతని పేరు మీద నే పెడతారు/

కొన్ని దేశాలలో అతని పేరు మనుషులకి, మరికొన్ని నగరాలకి, మరికొన్ని దేశాలకే పెడతారు/

*************************************************************************

రమణకి ప్రొఫెసరు అసిస్టెంటుగా కనీ వినీ ఎరుగని పేరు వస్తుంది/

************************************************************************
చిత్తగించవలెను/